Site icon NTV Telugu

Off The Record : జీహెచ్ఎంసీ విభజన తీరుపై బీజేపీ ఫైర్

గ్రేటర్‌ హైదరాబాద్‌ను మూడుగా విభజించడం వెనక పొలిటికల్ కేలిక్యులేషన్స్‌ ఉన్నాయా? ఆ విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలేంటి? కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ఎందుకు మండిపడుతోంది? ఇవిగో…. ఇవీ… మీ ఉద్దేశ్యాలంటూ వేటిని ఎత్తి చూపుతోంది కాషాయ దళం? మూడు చోట్ల తమ బలం విషయంలో ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? గ్రేటర్ హైదరాబాద్‌ను మూడుగా పునర్విభజన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 300 వార్డ్‌లు, మూడు కార్పొరేషన్స్‌గా రూపు మారిపోయింది. గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను కొనసాగిస్తూనే…. సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్స్‌ కొత్తగా ఏర్పాటయ్యాయి. అదంతా ఒక ఎత్తయితే…. ఇప్పుడు విభజన తీరుపై రాజకీయ వివాదాలు రేగుతున్నాయి. మరీ ముఖ్యంగా విభజన తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీజేపీ. శాస్త్రీయత లేకుండా ఇష్టం వచ్చినట్టు, అడ్డగోలుగా విభజించారంటూ మండిపడుతున్నారు కాషాయ లీడర్స్‌. అసలు జీహెచ్‌ఎంసీ విభజన వెనక చాలా పెద్ద కుట్ర ఉందన్నది బీజేపీ ఆరోపణ. కాంగ్రెస్‌ నాయకులు తమ మిత్రులకు రాజకీయ లబ్ది చేకూరేలా నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కమలం నేతలు.

హైదరాబాద్‌ను మజ్లిస్‌కు కట్టబెట్టే దిశగానే కాంగ్రెస్ సర్కార్ అలా విభజన చేసిందని అంటున్నారు. పాతబస్తీతో పాటు ముస్లిం ప్రాబల్యం ఉన్న ఏరియాలను గ్రేటర్ పరిధిలో ఉంచారని, దాన్ని బట్టి చూస్తేనే… వాళ్ళ ఉద్దేశ్యం ఏంటో అర్థమవుతోందని అంటున్నారు. అదే సమయంలో మూడు కార్పొరేషన్స్‌లో బీజేపీ పరిస్థితిపై కూడా చర్చ జరుగుతోంది. మూడు చోట్ల పార్టీకి పట్టుందని, జీహెచ్‌ఎంసీలో అయితే… బీజేపీ వర్సెస్ మజ్లిస్ అన్నట్టుగా పోరు జరుగుతుందని లెక్కలేసుకుంటున్నారు. అటు సైబరాబాద్, మల్కాజ్ గిరిల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా పొలిటికల్‌ ఫైట్‌ ఉంటుందన్నది కమలం కేలిక్యులేషన్.

కొత్త కార్పొరేషన్స్‌ రెండూ ఆ పార్టీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ఈటల రాజేందర్ పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో ఈ రెండు ఎంపీ సీట్లలో బీజేపీరి భారీ మెజారిటీ వచ్చింది. గత గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలో కూడా మల్కాజ్ గిరి కార్పొరేషన్ పరిధి లో ఎక్కువ డివిజన్స్‌ను గెలుచుకుంది బీజేపీ. అయితే…గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న ప్రాంతాలు, కార్పొరేషన్ కూర్పు మాత్రం కాషాయ దళానికి మింగుడు పడ్డం లేదట. కోర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పీఠాన్ని ఎంఐఎం దక్కించుకునేలా ఈ విభజన ఉందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు.

Exit mobile version