Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు
- మూసీకి పునరుజ్జీవం పోయడానికంటూ ప్రభుత్వ ప్రణాళికలు
- పరీవాహక నిర్వాసితులకు బీఆర్‌ఎస్ అండ
- మూసీ కేంద్రంగా రెండు పార్టీల రాజకీయ యుద్ధం
- ఇళ్ళు కూల్చి రోడ్డున పడేస్తున్నారంటున్న బీఆర్‌ఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూసీ చుట్టూ మళ్ళీ రాజకీయం ముసురుకుంటోందా? నేనీదరినీ…నువ్వాదరినీ.. అన్నట్టుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరో దరిన ఉండి నది మీద పొలిటికల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నాయా? బీఆర్‌ఎస్ అర్బన్ వార్‌కు కాంగ్రెస్ రూరల్ కౌంటర్ వేస్తోందా? నువ్విక్కడుంటే…నేనక్కడుంటానని సీఎం రేవంత్ ప్రతిపక్షానికి కొత్త అజెండా ఫిక్స్ చేశారా? ఏంటా అజెండా? మూసీ కేంద్రంగా మొదలైన కొత్త యుద్ధమేంటి? మూసీ ప్రక్షాళనపై తెలంగాణ రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తోంది. ఒకరు ఔనన్నదాన్ని ఇంకొకరు కాదనడం సర్వ సాధారణమైపోయింది. అన్నిట్లో మాదిరిగానే మూసీ విషయంలో కూడా అంతే అన్నట్టు తయారైంది. నిర్జీవంగా మారిపోతున్న మూసీకి పునరుజ్జీవం పోయడానికంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది.
త్వరలో పనులు కూడా మొదలు పెట్టబోతుంది. దీంట్లో బాధితుల పక్షం అంటూ brs గాంధీ సరోవర్ సమీప ప్రాంత బాధితులకు అండగా నిలుస్తోంది. మూసీ పరివాహక బాధితులకు న్యాయం చేయాలని… ఆందోళన చేస్తోంది ప్రతిపక్షం. దీనికి సంబంధించి ఓవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్షం ప్రజెంటేషన్స్‌తో హోరెత్తిస్తున్నాయి. ఇలా ఎత్తులకు పై ఎత్తులతో మూసీ చుట్టూ రాజకీయం ముసురుకుంటోంది. అయితే…. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. తమ రాజకీయ రణ క్షేత్రంగా ఒక్కో పార్టీ ఒక్కో జిల్లాను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారుతోంది. హైదరాబాద్ అజెండాగా brs పావులు కదుపుతోంది. అందుకు కౌంటర్‌గా అధికార పార్టీ మరో ఎత్తుగడ వేయడంతో మేటర్ మాంఛి రసవత్తరంగా మారుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కట్టడాలను కూల్చేసి పేదల్ని రోడ్డున పడేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ గళమెత్తింది.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్‌ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
అయితే… మూసీ కాలుష్యంతో ఎక్కువ నష్టపోతోంది నల్గొండ జిల్లానే అంటూ… దాన్ని అజెండాగా మార్చేసింది అధికార కాంగ్రెస్. నాగోల్ నుండి మొదలుకుని కృష్ణా నదిలో కలిసే వరకు మూసీ ఎక్కువగా నల్గొండ జిల్లాలోనే ప్రవహిస్తోంది. పరిసర ప్రాంతాల రైతులు ఆ నీటిని సాగుకు వినియోగిస్తున్నారు. దీంతో నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయి. ఇదే అంశాన్ని అజెండాగా మార్చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. గతంలో మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర కూడా చేశారాయన. మళ్ళీ వస్తా… త్రివేణి సంగమం వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మూసీ మొదటి విడత పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు సీఎం. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా ప్రజల సమస్యలే కాదు.. నల్గొండ జిల్లా ప్రజల గోస కూడా చూడండని అన్నారాయన. పరిహారం, సాయం విషయంలో రాజీ లేదు. కానీ…. మూసీ ప్రక్షాళనతో నల్గొండ ప్రజల గోస తీరుతుందని చెప్పుకొచ్చారు. అటు రాజకీయంగా చూస్తే…ఇప్పటికే నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కి కంచుకోట. ఇప్పుడు మూసీని ప్రధాన అజెండాగా మల్చుకుని నల్గొండ మీద ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. మీరు గ్రేటర్ ఎంచుకుంటే… మేము రూరల్ ఎంచుకుంటం అన్నట్టు మారింది రాజకీయం. మొత్తం మీద ఆ విధంగా… BRS గ్రేటర్ రాజకీయ అజెండా కు… సీఎం రేవంత్ నల్గొండను తెర మీదకు తెచ్చి కౌంటర్ ఎజెండా ఫిక్స్ చేశారన్న మాట.
- Tags
- Congress Vs Brs
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!