Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Congress Minister

Off The Record : తెలంగాణ మంత్రుల వ్యవహారం శృతిమించుతోందా?

Published Date :October 13, 2025 , 8:21 pm
By Gogikar Sai Krishna
  • తెలంగాణ మంత్రుల వ్యవహారం శృతి మించుతోందా?
  • మంత్రుల కీచులాటలతో ప్రజల్లో చులకనభావం పెరుగుతోందా?
  • ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌వన్నీ భారీ డైలాగ్‌లేనా?
  • కుటుంబ పంచాయితీ అంటున్న పీసీసీ చీఫ్‌
Off The Record : తెలంగాణ మంత్రుల వ్యవహారం శృతిమించుతోందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

కాంగ్రెస్‌ పార్టీలో పోట్ల గిత్తల్ని ఆపేవాళ్ళు లేరా? ఎవరికి వారు కట్లు తెంచుకున్నట్టు నోటికి పని చెబుతూ చెలరేగిపోవడమేనా? చివరికి మంత్రులు సైతం కట్టు తప్పుతున్నా… కంట్రోల్‌ చేసే దిక్కు లేకుండా పోయిందా? చివరికి మంత్రులతో సహా… మొత్తం ప్రభుత్వమే పలుచన అవుతున్నా… పెద్దలు ఎవ్వరూ ఎందుకు రియాక్ట్‌ అవడంలేదు? అధికార పార్టీలో అసలేం జరుగుతోంది?

తెలంగాణలో మంత్రుల వ్యవహారం రోజురోజుకు శృతిమించుతున్నట్టు కనబడుతోంది. ఎవరికి వారు అసలు పని వదిలేసి.. ఇష్టా రాజ్యాంగా మాట్లాడేస్తున్నారన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో. ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక వివాదాన్ని నెత్తికెత్తుకుని ఇరుకున పెడుతున్నారని, తమను ఎవరు ఏం చేస్తారన్న ధీమానా? లేక ఇది కాంగ్రెస్‌ కల్చర్‌ అనుకుంటున్నారా అంటూ హాటు ఘాటు చర్చలు నడుస్తున్నాయి. వాళ్ళ ఉద్దేశ్యం ఏదైనా… ఈ కీచులాటల కారణంగా… ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తల్లో కూడా మంత్రులంటే చులకన భావం ఏర్పడుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజ్ వచ్చిన మొదటి రోజే క్రమశిక్షణ గురించి మాట్లాడారు. నాకు అదే ముఖ్యం.. గీత దాటితే వేటు తప్పదంటూ భారీ డైలాగ్సే కొట్టారు. కానీ…. ఎవరు ఎంతలా చెలరేగినా… ఇప్పటివరకు ఎవర్నీ… కనీసం మందలించిన పాపానా కూడా పోలేదు.

కఠినంగా ఉండాల్సిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా… ఇది మా కుటుంబ సమస్య అనేస్తున్నారు తప్ప… తప్పు చేస్తున్న కుటుంబ సభ్యుల్ని సరిదిద్దే ప్రయత్నం మాత్రం చేయడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. నిజంగానే అది కాంగ్రెస్‌ కుటుంబ పంచాయతీ ఐతే… గాంధీభవన్‌ నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ… ఇలా రోడ్డెక్కి మాట్లాడుకోవడం ఎందుకు? అందునా… డైరెక్ట్‌గా మంత్రులే అలా వ్యవహరించడం ఏ రకంగా కుటుంబ సమస్య అని కార్యకర్తలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. పార్టీని ముంచేలా, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేలా… వ్యవహరిస్తున్న మంత్రుల విషయంలో ఎందుకు జాలి చూపిస్తున్నారన్నది ఎక్కువ మంది ప్రశ్న. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా…. అందరి లొల్లి చూస్తున్నారేగానీ… బ్రేకులు వేయడం లేదు. అంటే.. ఆయన బ్రేక్స్‌ వేయలేక పోతున్నారా..? లేక అదను కోసం ఎదురు చూస్తున్నారా..? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి పార్టీ సర్కిల్స్‌లో. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ల పంచాయతీ ముదిరి చివరికి… బీసీ వర్సెస్‌ మాదిగగా మారిపోయింది. రెండు రోజుల్లో దీనికి తెర పడింది అనుకుంటుండగానే.. మరో మంత్రి వివేక్.. మళ్ళీ ఆ తుట్టెను కదిపి… మాల, మాదిగ కులాల పంచాయతీకి ఆజ్యం పోశారు. నేను మాలను కాబట్టే అలా వివాదాల్లోకి లాగారంటూ అడ్లూరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు వివేక్. ఆ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అడ్లూరి అనడం కొంత బెటర్ అయ్యింది కానీ… ఆయన కూడా నోటికి పని చెప్పి ఉంటే… అది అంకెంత దూరం వెళ్ళిఉండేదోనని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ విషాదం ఏంటంటే… ఈ వివాదంలో ఉన్న మంత్రులు ముగ్గురూ సీనియర్సే.
అయినా వీధికెక్కి రచ్చ చేసుకున్నారు.

ఇక వరంగల్ లొల్లి అయితే… వేరే లెవల్‌. జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తూ.. ఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి ఫిర్యాదు చేశారు కొండా దంపతులు. మా శాఖలో పొంగులేటి పెత్తనం ఏంటన్నది వాళ్ళ క్వశ్చన్‌. ఇక… మా నియోజక వర్గాల్లో… మంత్రికి పనేంటి? అనవసరంగా వేలు పెట్టడం ఏంటని రచ్చ చేశారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు. ఇది క్రమశిక్షణ కమిటీదాకా వెళ్ళింది. ఆ లొల్లి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక మేడారం జాకత పనుల రివ్యూ విషయంలో కూడా మంత్రుల మధ్య సఖ్యత లేదు. ఇక్కడ కూడా వివాదంలో ఉన్న మంత్రులంతా సీనియర్సే. పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే….దాన్ని పది కాలాల పాటు నిలబెట్టుకోవాల్సిందిపోయి ఇలా.. పార్టీని వివాదాల్లో కి లాగి.. అంతర్గత పంచాయితీలతో ప్రభుత్వాన్ని పలచన చేస్తున్నారన్న ఫీలింగ్‌ పెరుగుతోంది కేడర్‌లో. ఇలా… వరుస ఎపిసోడ్స్‌ విషయంలో…ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నట్టు..? ఆమె గాంధీ కుటుంబానికి దగ్గర, అంతా సెట్ చేస్తారని తెలంగాణాకు పంపితే ఏ మాత్రం ప్రభావం ఎందుకు చూపలేకపోతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి కేడర్‌లో. మీనాక్షి కూడా అందరు నాయకుల్లాగే… స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడం తప్ప.. కంట్రోల్ చేయలేకపోతున్నారా..? అనే చర్చ కూడా నడుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇటీవల మంత్రులకు కాస్త గట్టిగానే క్లాస్‌ ఇచ్చారట. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని చెప్పినట్టు తెలిసింది. కానీ..ఆయన చెప్పిన నాలుగు రోజులు కూడా తిరక్కముందే సీన్‌ రిపీట్‌ అవడంతో… కాంగ్రెస్‌లో అంతేగా… అంతేగా అంటూ సెటైర్స్ పడుతున్నాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • NTV Telugu
  • OTR

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions