Site icon NTV Telugu

Off The Record: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఎక్స్ట్రా ఫోకస్?

Jubli Hills

Jubli Hills

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త వ్యూహాలకు పదును పెడుతోందా? గ్రేటర్‌ హైదరాబాద్‌లో పట్టు బిగించే పనిని గట్టిగా చేయాలని భావిస్తోందా? కంటోన్మెంట్‌లో మొదలైన పరంపరను జూబ్లీహిల్స్‌లో కొనసాగించాలనుకుంటోందా? ఇంతకీ కాంగ్రెస్‌ పెద్దల ప్లాన్‌ ఏంటి? జూబ్లీహిల్స్‌ బైపోల్‌ వ్యూహం ఎలా ఉండబోతోంది?

Read Also: Laya : బాలకృష్ణ మూవీ కోసం ఏడ్చారా.. లయ క్లారిటీ..

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈనెల 9న చనిపోయారు. దీంతో… ఈ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఇందుకు సంబంధించి శాసనసభ సెక్రటరీ గెజిట్ ఇచ్చారు కూడా. అటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి సమాచారం చేరింది. ఈ క్రమంలో… ఇక ఉప ఎన్నికల దిశగా కదలికలు మొదలయ్యాయి. అందరికంటే ముందుగా అధికార కాంగ్రెస్‌ పార్టీ… ఈ విషయంలో ఎక్స్‌ట్రా ఫోకస్‌ పెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై గాంధీభవన్‌లో ఆల్రెడీ చర్చలు మొదలయ్యాయట. అవడానికి ఇది బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటు అయినా… అధికార పార్టీగా…. గెలిచి మన ఖాతాలో వేసుకుంటేనే మర్యాద అన్నట్టుగా ఉందట తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దల అభిప్రాయం. అందుకే అన్ని సమీకరణలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలనుకుంటున్నట్టు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్‌ మహ్మద్ అజారుద్దీన్ పోటీ చేశారు. అలాగే మజ్లిస్‌ పార్టీ తరపున నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. కానీ, ఎన్నికల తర్వాత నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలాంటి రకరకాల బలాలలను కలుపుకుని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి గ్రేటర్‌లో సత్తా చాటే దిశగా కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నట్టు సమాచారం.

Read Also: Kothwalguda Eco Park: త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి కొత్వాల్‌గూడ ఎకో పార్క్..

మరోవైపు ఆశావహులంతా ఇప్పటికే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. దీంతో ఈసారి టిక్కెట్‌ ఎవరికి దక్కుతుందన్న చర్చ జోరుగా జరుగుతోంది పార్టీలో. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గంలో ముస్లిం మైనార్టీల ఓట్లు కీలకం. అలాగే ఎంఐఎ ఓటు బ్యాంకు కూడా ఎక్కువే. ఆ పరిధిలో మజ్లిస్‌ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే…. కాంగ్రెస్‌తో ఎంఐఎంకు కొంత సఖ్యత ఉంది. కాబట్టి పతంగి పార్టీ మద్దతు కోరే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఆ దిశగా గనుక రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరి… ఎంఐఎం బరిలో దిగకుండా కాంగ్రెస్‌కు మద్దతిస్తే.. మేటర్‌ వేరేగా ఉంటుందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్‌ ఆశావహుల లిస్ట్‌ కూడా పెరిగిపోతోంది. 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్… తనకు మరో ఛాన్స్‌ ఇవ్వమని అడుగుతున్నారట. అలాగే… నవీన్‌ యాదవ్‌ కూడా… హస్తం గుర్తు మీద ఒక్క ఛాన్స్‌ అంటున్నట్టు తెలుస్తోంది. అటు పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి కూడా తనకు టిక్కెట్‌ ఇవ్వాలని పార్టీ పెద్దలను అడుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే… గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయిన విజయారెడ్డి…ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటు అడుగుతున్నారని, అందుకు పార్టీ పెద్దలు సిద్ధంగా లేరన్న మాటలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్‌ వర్గాల్లో. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కూడా టిక్కెట్‌ రేస్‌లో ఉన్నారట. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట స్వామి కూడా టిక్కెట్‌ అడుగుతున్నట్టు సమాచారం. టైం గడిచేకొద్దీ… ఇలా ఒక్కొక్కరు యాడ్‌ అవుతూ ఆశావహుల లిస్ట్‌ పెరుగుతోంది. ఆ సంగతి ఎలా ఉన్నా…. అభ్యర్థి విషంలో ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకుని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎట్టిపరిస్థితుల్లో పాగా వేయాలన్న గట్టి పట్టుదలతో ఉందట కాంగ్రెస్‌ నాయకత్వం. గతంలో కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్.. జూబ్లీహిల్స్‌ని కూడా కైవసం చేసుకుని గ్రేటర్‌లో పట్టు పెంచుకోవాలని అనుకుంటోందట. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి ఎంపిక ఎలా ఉంటుందో చూడాలి మరి.

Exit mobile version