Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేయాల్సిందంతా చేస్తారు… కానీ చేసింది చెప్పుకోలేరు. సమస్యను సక్రమంగానే డీల్ చేస్తారు. కానీ… ఆఖరి వరకు అడుగులు వేయకుండా నాన్చి బద్నాం అవుతున్నారు. ఏ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోంది? తొందరపడట్లేదా.. లేక ఏం కాదులే… ప్రజలే అర్ధం చేసుకుంటారన్న ధోరణిలో ఉన్నారా? ముందుకు నెట్టేదాకా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కదలకపోవడం సమస్యగా మారుతోందా? లెట్స్ వాచ్. తెలంగాణ ప్రభుత్వంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సమస్యలు రావడమన్నది ఎక్కడైనా సహజం. కానీ… వాటిని సకాలంలో పరిష్కరించడం, ఆ సంగతి ప్రజలకు చెప్పుకోవడం మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా… సమస్యల్ని సకాలంలో పరిష్కరిస్తోంది, సరిగా హ్యాండిల్ చేయగలుగుతోంది. కానీ… ఆ చేసింది చెప్పుకోవడంలోనే వెనుకబడిపోయి మొత్తంగా బద్నాం అవుతున్నారా అన్నది లేటెస్ట్ డిస్కషన్. ఇక్కడ ఇంకా పెద్ద విషాదం ఏంటంటే… మనం సరిగా ప్రజెంట్ చేసుకోలేకపోతున్నాం, చేస్తున్న పనుల్ని ప్రజలకు వివరించలేకపోతున్నామన్న సంగతి ప్రభుత్వంలోని అందరికీ తెలుసు. అయినా… చెప్పుకోవడానికి మాత్రం ఎందుకు వెనుకాడుతున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదట. ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగేదాకా… ఆఖరి నిమిషం వరకు వేచి చూడటం ఎందుకు…? సమస్య తీవ్రత తెలిసిన వెంటనే రంగంలోకి దిగలేకపోవడానికి కారణాలేంటంటే… ఎవ్వరి దగ్గరా సమాధానం లేదు. దాదాపు ప్రతి సందర్భంలోనూ ఇదే జరుగుతోందట. వరి ధాన్యం కొనుగోలు వ్యవహారమే ఇందుకు తాజా ఉదాహరణ. దీన్ని సక్రమంగానే డీల్ చేస్తున్నామని, కానీ.. చేస్తున్నది చెప్పుకోలేకపోతున్నామని తాజా ప్రెస్మీట్లో అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అటు జిల్లా కలెక్టర్స్ కూడా ధాన్యం కొనుగోలు అంశంపై క్షేత్ర స్థాయిలో వచ్చే విమర్శలకు కనీస వివరణలు ఇవ్వడం లేదని అంటున్నారు. ఒకవేళ అధికారులు డైరెక్ట్‌గా మాట్లాడటానికి ఇబ్బంది అనుకుంటే… కనీసం మంత్రులకు సమాచారం ఇచ్చినా వాళ్ళైనా రైతులకు నచ్చజెప్పుకునే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. అందుకు సంబంధించిన డబ్బులు రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అసలేం జరగడం లేదని ఓవైపు ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తున్నా…. సర్కార్ సైడ్ నుంచి కనీసం ఈ సంగతి కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారన్న బిగ్ క్వశ్చన్. అంతకు ముందు సాఫీగా సాగినా… గడిచిన వారం..పది రోజులుగా ధాన్యం కొనుగోలులో కొన్ని ఇబ్బందులైతే తలెత్తుతున్నాయి. అందుకు తగ్గట్టుగా జిల్లా యంత్రాంగాన్ని, ఆయా జిల్లాల మంత్రుల్ని సమాయత్తం చేసి వాళ్ళకు అదే టాస్క్ ఇవ్వాల్సింది.
ఓవైపు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తూనే…మరోవైపు ఉన్న సమస్యల్ని రైతులకు చెప్తే.. తప్పకుండా వాళ్లు కన్విన్స్ అవుతారు. కానీ… ప్రతిపక్షం నానా యాగీ చేస్తున్నా… పాలకపక్షం మాత్రం మౌనంగానే ఉండిపోయింది. అందుకు బదులుగా గడిచిన వారం రోజుల నుంచే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను… ఆయా జిల్లాలకే పరిమితం చేసి ఇష్యూ సెటిల్ చేసేలా అడుగులు వేయాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూలీల సమస్య తగ్గుముఖం పట్టి… కొనుగోలు స్పీడప్ అవుతున్న టైంలో… ఇప్పుడు మంత్రులను రంగంలోకి దిగాలని ఆదేశించడం వల్ల ఒరిగే ప్రయోజనం తక్కువని, ఇప్పటికే చాలా ఆలస్యమైందన్న ఫీలింగ్ కలుగుతోంది రాజకీయవర్గాల్లో. ఓవైపు చేసేదంతా చేస్తూ కూడా… ఇలా విమర్శలు ఎదుర్కోవడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. మన నిర్ణయాలతో రైతులకు బెనిఫిట్ అవుతుంది.. విషయం వాళ్ళకు అర్ధమవుతుంది కదా అన్న ఫీలింగ్‌లో ప్రభుత్వం ఉందని, మరి జరిగే దుష్ప్రచారం సంగతేంటన్నది ప్రశ్న. ఇక్కడ లాభపడ్డవాళ్ళు ఎక్కువ మందే ఉన్నా…. వాళ్ళకంటే…ఇబ్బంది పడ్డ వాళ్ళే హైలైట్ అవుతున్నారని, దాని వల్ల రైతుల కోసం ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న అభిప్రాయం సమాజంలోకి వెళ్తోందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ప్రతిపక్షం చేసే హంగామాతో సర్కార్ అసలేం చేయడం లేదన్న అభిప్రాయం కూడా బలపడుతోందట. సమస్య పరిష్కారం విషయంలో పార్టీ ఆలోచన ఎలా ఉన్నా… వేసే అడుగులు కాస్త ముందస్తుగా ఉంటే బెటర్ అన్న భావన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలోని అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖలు చేసింది కూడా చెప్పుకోలేక పోవడం ఒక ఎత్తైతే.. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు సైతం చెబితేగానీ…పని మొదలుపెట్టే స్థితిలో లేరా అన్న సందేహాలు వస్తున్నాయి చాలామందిలో.
Also Read
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?