Site icon NTV Telugu

Off The Record: ఒకప్పుడు కామ్రేడ్స్‌ అంటే నిత్యం ఉద్యమాలు, సమస్యలపై పోరాటాలు కానీ ఇప్పుడు..!

Cpi

Cpi

Off The Record: తెలంగాణలో కామ్రేడ్స్‌ సంకట పరిస్థితిలో ఉన్నారా? అటు ప్రజా పోరాటాలు చేయలేక, ఇటు గమ్ముగా ఉండలేక సతమతమవుతున్నారా? వామపక్షాల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారిపోయిందా? అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉండటమే సీపీఐకి అసలు సమస్యా? కేడర్‌లో ఊపు కోసం ఉపన్యాసాలు తప్ప.. వాస్తవంలో లెఫ్ట్‌ నేతలు ఏం చేయలేకపోతున్నారా?

Read Also: Shine Tom Chacko: బహిరంగంగా క్షమాపణలు చెప్పిన ‘దసరా’ విలన్‌.. వివాదానికి ముగింపు!

ఒకప్పుడు కామ్రేడ్స్‌ అంటే.. నిత్యం ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలతో బిజీ బిజీగా ఉండేవారు. కానీ…మారుతున్న పరిస్థితుల్లో వాళ్ళ ఉద్యమాల తీరు కూడా మారిపోతోందన్న అభిప్రాయం బలపడుతోంది. కొన్నేళ్లుగా ప్రత్యక్ష ఉద్యమాలు తగ్గిపోయాయి. కేవలం నాలుగు గోడల మధ్య రౌండ్ టేబుల్ సమావేశాలకు మాత్రమే ఎర్రన్నలు పరిమితమైపోతున్నారని, అంతకు మించి మైక్‌ టైగర్స్‌గా మిగిలిపోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది అన్ని వర్గాల్లో. క్షేత్ర స్థాయి పోరాటాలకు బదులు ఇన్‌సైడ్‌ మీటింగ్స్‌, మీడియా మైకుల ముందు మాత్రం మేం లేస్తే మనుషులం కాదన్నట్టు స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడం పెరిగిపోయినట్టు చెప్పుకుంటున్నారు. మామూలుగానే అలా ఉంటే.. ఇక ప్రభుత్వంతో మిత్రపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల సంగతైతే చెప్పనక్కర్లేదు. అధికార పార్టీతో అంటకాగుతూ… తమ సహజ స్వభావమైన ప్రజా ఉద్యమాలను మర్చిపోతున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి.

Read Also: Hyderabad: పెళ్లై రెండు నెలలైనా కాలేదు..! భర్త ఆత్మహత్య.. హుస్సేన్‌ సాగర్‌లో దూకిన భార్య

అయితే, అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ పెద్దల దగ్గర ప్రస్తావించి పరిష్కారం చూపడానికి బదులు స్టేట్‌మెంట్స్‌కే పరిమితం అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో సీపీఐ తీరు గురించి ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు పార్టీ కేడర్‌ను ఉత్తేజపరిచేందుకు ఆవేశపూరిత ప్రసంగాలను దంచికొడుతున్నారు తప్ప.. వాస్తవంలో సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. కేడర్‌ దగ్గర బీభత్సమైన డైలాగ్స్‌ కొడుతూ.. ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లినప్పుడు మాత్రం ఆల్‌ ఈజ్‌ వెల్‌ అంటున్నారని, కామ్రేడ్స్‌కు ఈ రెండు నాల్కల ధోరణి కరెక్టేనా అన్న చర్చ జరుగుతోందట తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

Read Also: Telangana Cabinet: జులై 10న తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇక, వాస్తవానికి ఇప్పుడు నిర్దిష్టంగా ఏం చేయాలో పాలు పోవడం లేదట కామ్రేడ్స్‌కు. మరీ ముఖ్యంగా మిత్రపక్షం సీపీఐ అయితే.. గట్టిగా కొట్లాడలేకపోతున్నట్టు చెబుతున్నారు. అటు ప్రతిపక్షంలో ఉన్న సీపీఎం కూడా సాఫ్ట్‌గా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తంగా లెఫ్ట్‌ పార్టీలు కాస్తో కూస్తో ఆందోళనల పేరుతో రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నా…జనం నుంచి కూడా ఆశించిన స్పందన రావడం లేదని చెప్పుకుంటున్నారు. ఇటు ప్రజల నుంచి ఆశించిన స్పందనలు లేకపోవడం, అటు అధికార పార్టీలతో అంటకాగడం లాంటి కారణాలతో ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమాల విషయంలో పూర్తి డైలమా కొనసాగుతోందన్నది పొలిటికల్‌ టాక్‌.

Exit mobile version