Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Brs 34

Off The Record : సింగరేణిలో బీఆర్ఎస్తో పొత్తుకు సీపీఐ సై అంటోందా?

Published Date :March 11, 2026 , 7:30 pm
By Gogikar Sai Krishna
  • సింగరేణి గుర్తింపు సంఘానికి ముగిసిన పదవీ కాలం
  • అన్ని యూనియన్స్‌కు సమాన హోదా కోసం డిమాండ్‌
  • గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రాధాన్యం తగ్గిస్తారా అన్న చర్చలు
  • సింగరేణిలో బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సీపీఐ సై అంటోందా?
Off The Record : సింగరేణిలో బీఆర్ఎస్తో పొత్తుకు సీపీఐ సై అంటోందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బొగ్గుబాయిలో కొత్త బంధాలు పుడుతున్నాయా? మైన్స్‌ సాక్షిగా మేటర్‌ మలుపులు తిరగబోతోందా? తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల ప్రభావం సింగరేణి ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందా? పాత మిత్రుల్ని పక్కనపెట్టి… కొత్త వాళ్ళు దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ సాంగ్‌ సింగబోతున్నారా? అసలేంటా సమీకరణలు? ఇప్పుడు కొత్తగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది? తెలంగాణలోని ఆరు జిల్లాలు, 11 ఏరియాల్లో విస్తరించి ఉంది సింగరేణి. ఎన్నిక ఏదైనా సరే… ఇక్కడి కార్మికుల ఓట్లు చాలా కీలకం. అందుకే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడ స్పెషల్‌ ఫోకస్‌ పెడుతుంటాయి. ఆ ప్రయారిటీలోనే… సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక కూడా అసెంబ్లీ ఎలక్షన్స్‌ని తలపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం బొగ్గుబాయిల్లో అదే హీట్‌ పెరుగుతోందట.

గుర్తింపు సంఘానికి రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో సంస్ధలో మళ్లీ ఎన్నికల మూడ్‌ వచ్చేసింది.కానీ… ఇక్కడే ఓ కొత్త వివాదం కూడా మొదలైంది. గడువు తీరిపోయినందున ప్రత్యేకంగా గుర్తింపు సంఘం ఏదీ లేదు కాబట్టి అన్ని యూనియన్స్‌కు సమాన హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ఆ డిమాండ్‌ను ఆమోదిస్తే…నిన్నటిదాకా అధికారం ఉన్న ఏఐటీయూసీ ప్రాధాన్యత తగ్గినట్టేనా? మళ్ళీ ఎన్నికలై ఫలితాలు వచ్చేదాకా యాజమాన్యంతో సంప్రదింపుల్లో ఆ సంఘాన్ని కూడా మిగతా వాటితో సమానంగా చూస్తారా లేక కొంచెం ఎక్కువ సమానం అంటారా అన్న చర్చలు జరుగుతున్నాయి కార్మిక వర్గాల్లో. అదే సమయంలో బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సీపీఐ సై అంటోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

మామూలుగా అయితే…. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌, సీపీఐ మిత్రపక్షాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. కానీ… మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లో వ్యవహారం కాస్త తేడాగా కనిపించింది. అక్కడక్కడా బీఆర్‌ఎస్‌, సీపీఐ స్నేహగీతం ఆలపించాయి. ఇప్పుడు అదే ఈక్వేషన్‌ సింగరేణిలో కూడా వచ్చి ఆ బంధం అలాగే కొనసాగుతుందా అన్న చర్చలు మొదలయ్యాయి రాజకీయవర్గాల్లో. చివరిసారిగా 2023 డిసెంబర్ 27న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా, కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా ఎన్నికయ్యాయి. ఇప్పుడు ఆ రెండిటి కాలపరిమితి ముగిసినందున యాజమాన్యం నిర్వహించే అధికారిక సమావేశాలకు అన్ని యూనియన్స్‌ను కలిపి పిలవాలన్న డిమాండ్‌ తెర మీదికి వచ్చింది. అలాగే… కాలయాపన చేయకుండా వెంటనే ఎన్నికలు నిర్వ హించాలని ప్రతిపక్ష సంఘాలు కోరుతున్నాయి. అలాగే… ఆయా మైన్స్‌తో పాటు కంపెనీ వ్యాప్తంగా అన్ని సంఘాలకు సమాన హోదా ఇవ్వాలంటూ ఎక్కడికక్కడ అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఎన్నికల కోసం అన్ని యూనియన్లు, వాటి ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. సరిగ్గా ఇక్కడే మున్సిపల్‌ ఎన్నికల నాటి పరిణామాలు చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే సింగరేణి ప్రాంతమైన క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో సీపీఐ పొత్తుపెట్టుకుంది.

సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీనే నిన్నటిదాకా సింగరేణిలో గుర్తింపు సంఘం. రాష్ట్ర స్థాయి పొత్తు కోణంలో గతంలో సీపీఐ, దాని అనుబంధం సంఘం సైతం కాంగ్రెస్‌తోనే ఉన్నాయి. కానీ… ఇప్పటికీ అదే అవగాహన ఉందా లేదా అన్నది ఇప్పుడు వస్తున్న సరికొత్త డౌట్‌. సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ కాంగ్రెస్ సంఘంతో కలిసి వెళ్తుందా లేక బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘానికి దగ్గరవుతుందా? లేక ఈ రెండూ కాదని సోలో సాంగ్‌ పాడుతుందా అన్నది ప్రస్తుతం కోల్‌ బెల్ట్‌లో ఇంట్రస్టింగ్‌ టాపిక్‌. మరి కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహిస్తుందా, లేక తాత్సారం చేస్తారా? అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. ఒకవేళ షెడ్యూల్‌ ప్రకారం ఎలక్షన్‌ జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీల బంధాలు, సంఘాల అనుబంధాలు ఎలా ఉంటాయన్నది మాత్రం కాస్త ఇంట్రస్టింగ్‌ సబ్జెక్టేనన్నది వాళ్ళ మాట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • NTV Telugu
  • OTR

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions