Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Aswaraopeta Congress Mla Jare Adinarayana

Off The Record: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అధికారులు గుర్తించడంలేదా? మంత్రి ముందే అధికారులపై ఎమ్మెల్యే ఫైర్

Published Date :May 2, 2025 , 9:27 pm
By Chandra Shekhar Pamena
  • హాట్‌ హాట్‌గా అశ్వారావుపేట రాజకీయం
  • రెండుగా చీలిన నియోజకవర్గ కాంగ్రెస్‌
  • ఎమ్మెల్యే ఆదినారాయణ వర్సెస్‌ అధికారులు
  • ఎమ్మెల్యేని గుర్తించనట్టుగా ఆర్‌ అండ్‌ బీ అధికారులు
  • ఎమ్మెల్యేకి తెలియకుండానే ఓ గ్రామానికి రోడ్డు మంజూరు
  • శంకుస్థాపనకు పిలవడంతో అవాక్కయిన ఎమ్మెల్యే
  • ఎమ్మెల్యేకి నచ్చజెప్పడానికి మంత్రి తుమ్మల తంటాలు
  • గతంలో రింగ్‌ రోడ్డు వివాదంలో కూడా అదే తంతు
  • అప్పుడూ ఆర్ అండ్ బీ అధికారులు ఎమ్మెల్యేని లెక్కచేయని వైనం
  • ఎవరినో సంతృప్తిపరచడానికి వాళ్ళు ఇరుక్కుంటున్నారా?
  • అగ్గికి ఆజ్యం పోస్తున్న నియోజకవర్గ ఛోటా నాయకులు
  • మంత్రి సర్దిచెబుతున్నా ఎమ్మెల్యే వినకపోవడం వెనక రాజకీయం ఉందా?
Off The Record: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అధికారులు గుర్తించడంలేదా? మంత్రి ముందే అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఆ ఎమ్మెల్యేని అధికారులు గుర్తించడం లేదా? ప్రజా ప్రతినిధిగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదా? అధికార పార్టీ శాసనసభ్యుడు అయినా సరే… ఎందుకా పరిస్థితి వచ్చింది? ఎమ్మెల్యే కూడా మంత్రి ముందే… అధికారుల మీద ఫైరైపోవడం వెనక రాజకీయం ఉందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది?

Read Also: MP Yusuf Pathan: ఒడిశాలో బెంగాలీ కార్మికులపై దాడి.. అమిత్ షాకు టీఎంసీ ఎంపీ లేఖ!

ఏపీ సరిహద్దులో ఉండే తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావు పేట. పేరుకు గిరిజన నియోజకవర్గం అయినా… అజమాయిషీ మాత్రం వేరే వర్గాలదే. ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా బండి లాగించేశారు. కానీ… సిట్టింగ్‌ ఎమ్మెల్యే జాలే ఆదినారాయణ మాత్రం… కాస్త స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించడంతో వివాదాలు రేగుతున్నాయట. నియోజకవర్గ కాంగ్రెస్‌ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు అనుకూలంగా రెండు వర్గాలుగా విడిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరికి దగ్గర అట. అలాగే అధికారులు మాత్రం మరో మంత్రికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో వాతావరణం ఎమ్మెల్యే వర్సెస్‌ అధికారులు అన్నట్టుగా మారిపోయి కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయట. మరీ ముఖ్యంగా ఆర్‌ అండ్‌ బీ అధికారులైతే…. ఎమ్మెల్యే ఒకరున్నారా అన్నట్టు ప్రవర్తిస్తున్నారట. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ అంటున్నారు.

Read Also: Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? కారణాలు ఇవేకావొచ్చు.. జాగ్రత్త సుమీ!

కాగా, రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో… ఓ మారు మూల గ్రామానికి రోడ్డు మంజూరైంది. ఆ సంగతి ఎమ్మెల్యేకి తెలియదు. కానీ… డైరెక్ట్‌గా శంకుస్థాపనకు రమ్మని ఆయన్ని పిలిచారు అధికారులు. దాంతో అగ్గి మీద గుగ్గిలం అయ్యారట ఆదినారాయణ. ఏం తెలియకుండా, ముందేమీ చెప్పకుండా ఎకాఎకిన శంకుస్థాపన చేయమని అడిగితే… ఎలాగంటూ మంత్రి తుమ్మల సమక్షంలోనే సీరియస్‌ అయ్యారట. మంత్రి జోక్యం చేసుకుని ఎమ్మెల్యేని చల్లబరిచే ప్రయత్నం చేసినా… ఆయన తగ్గలేదట. దాంతో మినిస్టర్‌ కారులోనే ఎక్కించుకుని ముందు వేరే కార్యక్రమాలకు వెళ్ళి… నచ్చజెప్పి ఫైనల్‌గా రోడ్డుకు శంకుస్థాపన చేశారట. ఆదినారాయణకు, అధికారులకు మధ్య ఎంత గ్యాప్‌ ఉందో… దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది అశ్వారావుపేటలో. గతంలో రింగ్ రోడ్డు వ్యవహారంలో కూడా ఇలాంటి వివాదమే జరిగింది. జిల్లాకు చెందిన ఓ మంత్రి శ్రద్ధ తీసుకుని మైనారిటీలకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించారు.

Read Also: Garuda 2.0 : ఆహా’లో దూసుకుపోతున్న గరుడ 2.౦

అయితే, జాతీయ రహదారుల నిర్మాణాలు ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే ఉండాలంటూ పట్టు పట్టారు ఆదినారాయణ. చివరికి ఆయన పంతమే నెగ్గింది. ఇక్కడ కూడా ఆర్ అండ్ బి అధికారులు ఎమ్మెల్యేని పట్టించుకోలేదట. దీంతో… ఆ ఒక్క శాఖ అధికారులే ఎందుకు అలా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే… ఎవరినో సంతృప్తి పరచడానికి ఆర్‌ అండ్‌ బీ అధికారులు అలా ప్రవర్తిస్తూ ఇరుక్కుపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే మధ్య వివాదాలతో అధికారులు ఇబ్బంది పడుతున్న వాతావరణం అశ్వారావుపేటలో కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు లోకల్‌గా ఉన్న చోటా నాయకులు… తాము మంత్రులు, ఎమ్మెల్యేకి దగ్గరయ్యేందుకు ఏదో ఒక విషయం మీద పెద్దోళ్ళ చెవులు కొరికేస్తున్నారట. దీనివల్ల సమసిపోవాల్సిన విభేదాలు ఎప్పటికప్పుడు రేగుతున్నాయంటున్నారు. అదే సమయంలో మంత్రి తుమ్మల సర్దిచెబుతున్నా….ఎమ్మెల్యే ఆదినారాయణ వినకుండా సాగదీయడం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఆయన సైతం ఎవరినో సంతృప్తి పరిచేందుకు అధికారులను పదేపదే టార్గెట్‌ చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు. మొత్తం మీద కారణాలేవైనా సరే… అశ్వారావుపేటలో వాతావరణం మాత్రం తేడాగా ఉందంటున్నారు పరిశీలకులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • khammam
  • MLA Jare Adinarayana
  • off the record
  • OTR

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions