Site icon NTV Telugu

Off The Record: వైఎస్ జగన్ లిక్కర్ కేసులో అరెస్టుకు మానసికంగా సిద్ధమయ్యారా?

Jagan

Jagan

Off The Record: లిక్కర్‌ కేసులో అరెస్ట్‌కు జగన్‌ మానసికంగా సిద్ధమైపోయారా? కావాలంటే మా ఇంటికొచ్చి చేసుకోమనండబ్బా… అని సన్నిహితులతో అంటున్నారా? ఆ విషయంలో నిన్న మొన్నటిదాకా డిఫెన్స్‌లో ఉన్న వైసీపీ ఇప్పుడు ఎఫెన్స్‌లోకి రావడం వెనకున్న రీజనేంటి? జగన్‌ లెక్కలు ఎలా ఉన్నాయి? టీడీపీ ఆలోచన ఏంటి?

Read Also: Off The Record: కేసీఆర్‌ దగ్గర కవిత రెండు ప్రధాన డిమాండ్స్ పెట్టారా..?

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ అరెస్ట్ అవబోతున్నారంటూ… జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొదలు… జగన్ కుడి, ఎడమలుగా చెప్పుకునే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వరకూ వచ్చింది అరెస్ట్‌ల పర్వం. ఇప్పటిదాకా ఏడుగురు అరెస్ట్‌ అవగా… దాదాపు అందరి విషయంలో ముందు లీకులు రావడం, తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే… ఇంకేముంది రేపో మాపో జగన్‌ కూడా లోపలికి వెళ్ళడం ఖాయమంటూ టీడీపీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఓపెన్‌ కామెంట్స్‌ వద్దని చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చాకగానీ… ఆ పరంపర ఆగలేదు. మిగతా వాళ్ళ విషయంలో జరిగిన ప్రచారాలు నిజమైనా… జగన్ విషయంలో మాత్రం ముందుకు వెళ్లలేదు. మంత్రి లోకేష్‌, సీఎం చంద్రబాబు తాజా ఢిల్లీ టూర్‌లో అరెస్ట్‌ విషయాన్ని ప్రధానితో ప్రస్తావించారన్న ప్రచారం కూడా సోషల్‌ మీడియాలో జోరుగా జరుగుతోంది. ఒక పది పదిహేను రోజుల పాటు జగన్ అరెస్ట్ సబ్జెక్టే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉందంటే అతిశయోక్తి కాదు. కట్ చేస్తే ఇంతవరకు అలాంటి పరిణామాలేవీ జరగలేదు. పైగా దర్యాప్తులో సిట్‌ స్పీడ్‌ తగ్గించినట్టు కనబడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈలోపే కీలకమైన పత్రాలు అందుబాటులో లేవు. గత ప్రభుత్వ హయాంలో వీటిని కాల్చేశారంటూ మరో ప్రచారం మొదలైంది. దీంతో… ఇన్ని పరిణామాల మధ్య జగన్ అరెస్ట్ ఉంటుందా.. లేదా అన్న చర్చ కూడా మొదలైంది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఈ పరిణామ క్రమంలోనే… మీడియా సమావేశం నిర్వహించిన జగన్ గత ప్రభుత్వ లిక్కర్ పాలసీపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

Read Also: Alcohol : మందు తాగితే నిద్ర బాగా పడుతుందా? ఈ వాదనలో నిజమెంత…!

అయితే, అసలు స్కామే జరగలేదంటూ కొట్టి పారేశారాయన. తన ప్రభుత్వ హయాంలో మద్యం వ్యవహారానికి సంబంధించి సీఎంఓకు ఓ ఫైల్ వచ్చిందిగానీ… తాను ఎక్కడైనా ఒక్క సంతకం చేసినట్లు ఆధారాలు చూపించాలంటూ గట్టిగానే బదులిచ్చారాయన. అప్పటి ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కూడా అసలు ఎక్సైజ్ వ్యవహారాలు చూడలేదని చెప్పారు జగన్‌. ఈ కేసులో వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్‌ని బేస్‌ చేసుకుని అరెస్టులు జరిగాయి తప్ప వాస్తవ ఆధారాలతో జరగలేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు మాజీ ముఖ్యమంత్రి. తాను విజయవాడలోనే ఉంటానని, కావాలంటే…. తన ఇంటికి వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చంటూ దాదాపు సవాలు విసిరినంత పనిచేశారాయన. అటు ఈ కేసులో జగన్ అరెస్ట్‌కు సంబంధించి బీజేపీ కూడా ఆచితూచి స్పందిస్తోందట. ఏపీలో వైసీపీ తమ కూటమికి రాజకీయ శత్రువే అయినప్పటికీ…. జగన్ కు ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారట బీజేపీ నాయకులు. కూటమి పరంగా చూసుకుంటే శత్రువే అయినా…. ప్రియమైన శతృవు అన్నట్టుగా ఉందట బీజేపీ వ్యవహారం. గతంలో బీజేపీకి అవసరమైన అన్ని సందర్భాల్లో ఔట్‌రైట్‌ సపోర్ట్‌ ఇచ్చింది వైసీపీ. అందుకే అరెస్ట్‌ విషయంలో అట్నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చి ఉండకపోవచ్చన్న చర్చలు సైతం మొదలయ్యాయి. అలాగే జగన్ అరెస్ట్ అంటూ జరిగితే ఆ తర్వాతి పరిణామాల్ని అంచనా వేయాల్సి ఉంటుందనే లెక్కలున్నాయట. ఆయన అరెస్టయి ఒకసారి బయటకు వచ్చారంటే కచ్చితంగా ఆ సాకుతోనే జనాల్లోకి వెళ్తారు. ఆ తర్వాత జరిగే సానుభూతి రాజకీయం ఎట్నుంచి ఎటు టర్న్‌ అవుతుందో కూడా చెప్పలేమన్న అభిప్రాయం కూటమి నేతల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Off The Record: ఏపీ ప్రభుత్వం, టీడీపీలో భారీ మార్పులు.. కీలకంగా మారనున్న నారా లోకేష్

ఇక, ఇప్పటికిప్పుడు జగన్‌ను అరెస్ట్ చేస్తే… చంద్రబాబు అరెస్టుకు ప్రతిగానే అన్న అభిప్రాయమే బలంగా ప్రజల్లోకి వెళ్తుందన్న రాజకీయ విశ్లేషణలు సైతం ఉన్నాయట. ఇన్ని కోణాల్లో ఆలోచిస్తున్నందున జగన్‌ విషయంలో కాస్త దూకుడు తగ్గించి ఉండవచ్చంటున్నారు. మరోవైపు టీడీపీ సర్కిల్స్ మాత్రం జగన్ విషయంలో మార్పులేమీ లేవబ్బా.. ఇప్పుడు కడపలో మహానాడు జరుగుతోంది. కాగా, ఈ సమయంలో ఆరెస్ట్‌ అంటే…. పరిస్థితులు ఇబ్బందికరంగా మారొచ్చన్న లెక్కలతోనే వాయిదా వేశారు తప్ప యాక్షన్‌ పక్కా అంటున్నాయి. మరి లిక్కర్ స్కాంలో నెక్స్ట్ ఏంటి.. జగన్ అరెస్ట్ చేస్తారా.. లేదా? తాను అరెస్ట్ కాబోనని ఆయనకు నమ్మకం కలగడానికి కారణం ఏంటి… ఆ విషయంలో టీడీపీ లెక్కేంటన్నది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version