OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ టీడీపీ సీనియర్ లీడర్ పూలమ్మిన చోటే కట్టెలమ్ముతున్నారా? చెంప దెబ్బ…గోడ దెబ్బ అన్నట్టు మారిన పరిస్థితుల్లో… ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? ఒకప్పుడు తన కోసం గంటల తరబడి ఎదురు చూసిన రోజులు పోయి… ఇప్పుడు తన దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళే గంటలు గంటలు వెయిట్ చేయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? అడుగేస్తే అడ్డంకి, మాట్లాడితే మడత అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ లీడర్ ఎవరు? ఆయనకొచ్చిన బాధేంటి? టీడీపీ సూపర్ సీనియర్స్‌లో ఒకరు కిమిడి కళా వెంకట్రావు. ఒకప్పుడు ఆయన వేసిన పాచికే పార్టీ వ్యూహం అన్నట్టుగా ఉండేది. కానీ… ఇప్పుడు పార్టీ ముఖ్యుల దర్శనానికే గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని, దీన్ని ఆయన చాలా అవమానంగా ఫీలవుతున్నారని చెప్పుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసినప్పుడు తనదైన ముద్ర వేశారాయన. కానీ రాజకీయాల్లో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. టైం బ్యాడ్ అయి… గ్రహాలు బ్యాండ్ బజాయిస్తే… మొత్తం తిరగబడి పోతుంది. తాడే పామై కాటేస్తుంది. ప్రస్తుతం కళా పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉందట. ఎట్టా బతికినోడిని, చివరికి ఇట్టా అయిపోయిందంటూ… సన్నిహితుల దగ్గర ఆయన గోడు వెళ్ళబోసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సొంత నియోజకవర్గాన్ని వదిలి పార్టీ ఆదేశాలతో చీపురుపల్లికి మారి గెలిచినా…ఏం ప్రయోజనం లేకపోయిందని అంటున్నారు. తన సీనియారిటీ, గతంలో నిర్వహించిన పదవుల దృష్ట్యా…ఈసారి కేబినెట్ బెర్త్ ఖాయమనుకున్నారు కళా. కానీ… ఆ ఛాన్స్ కాదుకదా… అలాంటి వాసన కూడా ఆయన దరి చేరనివ్వలేదు టీడీపీ అధిష్టానం. దీంతో చేతికి వచ్చిన పండు నోటికి రాలేదన్న భావన కిమిడి అనుచరుల్లో అలాగే ఉండిపోయిందని అంటున్నారు. రాజకీయంగా ఒకప్పుడు చక్రం తిప్పినా…ప్రస్తుతం చెంప దెబ్బ, గోడ దెబ్బ అన్నట్టుగా ఉందట ఆయన పరిస్థితి. అటు సొంత జిల్లా శ్రీకాకుళం వెళితే… కింజరాపు కుటుంబం… ఇటు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాను చూస్తుంటే ఇక్కడ గజపతి ఫ్యామిలీ ఎక్కడా ఛాన్స్ ఇవ్వడం లేదంటున్నారు.
ఒకప్పుడు కళా అపాయింట్మెంట్ కోసం నాయకులు ఎదురు చూసేవారని… ఇప్పుడు తానే ఇతర నేతల టైం కోసం వేచి చూడాల్సి వస్తోందని అంటున్నారు. కాలం కలిసి వస్తే కొండ మీదున్న కోతి కూడా రారాజే… ఇదే ఫేట్ మారిపోతే రాజుకూ కష్టం తప్పదన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయిందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. అసలు రాజకీయంగా ఆయన అడ్డంకి తొలగించుకోటానికే గత ఎన్నికల్లో కింజరాపు ఫ్యామిలీ పథకం ప్రకారం పొగపెట్టి శ్రీకాకుళం జిల్లా నుంచి చీపురుపల్లికి పంపేశారన్న అభిప్రాయాలున్నాయి. పంపితే పంపారుగానీ… అదృష్టం కలిసొచ్చి గెలిచాను, మంత్రి పదవి వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. పార్టీలోనే మరో కీలక నేత అశోక్ గజపతి రాజుతో ఉన్న విభేదాల కారణంగా… ఆ ఛాన్స్ మిస్ అయిందన్నది టీడీపీ వర్గాల ఇంటర్నల్ టాక్. దీంతో కళా డీలాపడ్డా…తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారట. అయినా సరే.. ఎక్కడా చిన్న ఛాన్స్ కూడా దొరక్కపోగా.. చివరికి అవమానాలు మిగుతున్నాయన్న ఆవేదన పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. పార్టీలోని అత్యంత కీలకమైన నాయకుడు ఒకర్ని కలిసేందుకు ఇటీవల మాజీ మంత్రి ప్రయత్నించగా…. దాదాపు మూడు గంటల పాటు వెయిట్ చేయించారని, ఈ పరిణామమే ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని చెప్పుకుంటున్నారు. తన దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్న వ్యక్తి కూడా… ఉద్దేశ్యపూర్వకంగానే తనని గంటల తరబడి బయటనే వెయిట్ చేయించడం కళా వెంకట్రావుకు ఏ మాత్రం మింగుడు పడ్డంలేదని అంటున్నారు. ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలోనూ ఆశించిన ప్రాధాన్యం దక్కలేదనే అసహనం ఉందట. దీంతో టచ్ మీ నాట్ అన్నట్టు కొడుకునే పంపారని విశ్లేషిస్తున్నాయి రాజకీయవర్గాలు. ఈ పరిస్థితుల్లో… తన అనుభవంతో కళా వెంకట్రావు మరోసారి రాజకీయంగా పుంజుకుంటారా.. లేక ఇతి వార్తాహ….. కాలం కలిసొస్తే మళ్ళీ ఎప్పుడో చూసుకుందామని సైడైపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!