Off The Record: గులాబీ పార్టీలో టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ జిల్లా గులాబీ దళంలో టెన్షన్ నెలకొంది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాస బాణాన్ని వదులుతున్నారు. అసంతృప్తులంతా ఒక్కటై వారిని పదవుల నుంచి దించేందుకు పావులు కదుపుతున్నారట. ఈ చర్యల వెనుక జిల్లా మినిస్టర్ ఉన్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం రచ్చ రచ్చ అవుతోంది.
Also Read
మంత్రి ఆఫీసు చుట్టూ చక్కర్లు
మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని BRS మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇటీవల కాలంలో వారిపై సొంత పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారని.. తమ డివిజన్లు, వార్డులను పట్టించుకోవడం లేదని నిరసనలు చేపడుతున్నారు. దీంతో తమను ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని బాధిత మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు జిల్లా మంత్రి మల్లారెడ్డికి మొర పెట్టుకున్నారట. ప్రతి రోజూ మంత్రి క్యాంపు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
జవహర్‌నగర్ మేయర్ కావ్యపై 20 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు?
మూడేళ్ల క్రితం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మేడ్చల్ జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపల్ చైర్మన్లను అధికారపార్టీ కైవశం చేసుకుంది. అక్కడక్కడా గెలుపొందిన కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు కూడా గులాబీ గూటికి చేరారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఉన్నట్టుండి సొంత పార్టీ నేతలే మేయర్లు, ఛైర్మన్లపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. జవహర్ నగర్ మేయర్ కావ్య, మేడ్చల్ మున్సిపల్ ఛైర్మన్ దీపికారెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. మేయర్ కావ్యకు వ్యతిరేకంగా 20 మంది కార్పొరేటర్లు ఎకమయ్యారు. పిర్జాదిగూడ మేయర్ వెంకటరెడ్డి, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డిలదీ ఇదే పరిస్థితి.
పిర్జాదిగూడలో మేయర్‌కు వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శన
పిర్జాదిగూడలో డిప్యూటీ మేయర్ శివకుమార్‌తో కలిసి అసమ్మతి కార్పొరేటర్లు అర్దనగ్న ప్రదర్శన చేయడంతో అధికారపార్టీ శిబిరంలో కలకలం రేగింది. సొంతపార్టీ కార్పొరేటర్లే మేయర్లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడీ సమస్య దమ్మాయిగూడ, నాగారం, ఘటకేసర్, గుండ్ల పోచంపల్లి, నిజాంపేట పురపాలికలకు పాకినట్టు చెబుతున్నారు. అయితే ఒక్క మేడ్చల్ జిల్లాలోనే ఈ తరహా ఆందోళనలు చెలరేగడం వెనుక ఏదో కుట్ర ఉందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయట. బాధిత మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు మంత్రి మల్లారెడ్డిని ఆశ్రయిస్తున్నా.. ఈ సమస్య రావడానికి ఆయన కూడా కారణమై ఉండొచ్చనే చర్చ సాగుతోంది. మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లుగా ఉన్నవారు మంత్రి మాట వినడం లేదట. పైగా పార్టీ కార్యక్రమాలకు పైసలు తీయడం లేదట. దీంతో వారికి ఝలక్ ఇవ్వడానికే మల్లారెడ్డి తెరవెనుక నాటకం ఆడుతున్నారనేది కొందరి అనుమానం.
మేయర్లు, ఛైర్మన్లతో రాజీనామా చేయించే ఎత్తుగడ ఉందా?
మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లగా ఉన్నవారితో రాజీనామా చేయించే ఎత్తుగడ ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటం.. మరో వర్గాన్ని సిద్ధం చేసుకునే ఎత్తుగడ అయిఉండొచ్చని అనుకుంటున్నారట. ఇప్పటికే మంత్రిని ఆశ్రయించిన మేయర్లు, ఛైర్మన్లు.. విషయం తెలుసుకుని కంగుతింటున్నట్టు సమాచారం. మరి.. అసలు లొగుట్టు ఎప్పుడు బయట పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!