Site icon NTV Telugu

Off The Record: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..?

T Bjp

T Bjp

Off The Record: బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. జులై ఒకటిన పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన ఉంటుంది. నెలల తరబడి పేరుకుపోయిన నైరాశ్యం, కేడర్‌లో అసహనం, ఆశావహుల నిష్టూరాల్లాంటి వాటన్నిటికీ తెరపడబోతోంది. కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంలో…. రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంలో కేంద్ర పెద్దలు కూడా ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడే ఓ కొత్త చర్చ మొదలైంది రాష్ట్ర పార్టీ వర్గాల్లో.. ఢిల్లీ పెద్దోళ్లు ఎవరికి టిక్‌ పెట్టి ఉంటారు? పాతోళ్ళకి పట్టం కట్టబోతున్నారా..? లేక కొత్త వాళ్ళ మీద మక్కువ చూపిస్తారా అని తెగ మాట్లాడేసుకుంటున్నాయి రాష్ట్ర పార్టీ వర్గాలు. ఎవరు అయ్యే అవకాశం ఉందంటూ…. ఎవరికి వారు విశ్లేషణలు చేసేస్తున్నారు. పార్టీ బీసీ అజెండాతో… ముందుకు వెళ్తున్నందున ఆ సామాజికవర్గాల నుంచే….. కొత్త అధ్యక్షుడు ఉండటం ఖాయమని నమ్ముతున్నారు అంతా. అయితే… ఆయా సామాజికవర్గాల నుంచి ఎవరు ఉండవచ్చంటూ… వాళ్ళ వాళ్ళ ఈక్వేషన్స్ ప్రకారం ఒక్కో పేరు తెరపైకి వస్తోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న పాతకాపులకే ఛాన్స్‌ ఇవ్వాలన్నది కొందరి డిమాండ్‌. పాత, కొత్త అన్నది కాదు… వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారం దిశగా నడిపించే నాయకుడు కావాలన్నది ఇంకొందరి మాట. ఈ క్రమంలో… పార్టీ సంస్థాగత ఎన్నికల జాతీయ రిటర్నింగ్ అధికారిగా ఉన్న లక్ష్మణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Read Also: Jagdeep Dhankhar: పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలి.. ఉపరాష్ట్రపతి మద్దతు..

అయితే బాధ్యతలు తీసుకోవడానికి ఆయన ఎంతవరకు సుముఖంగా ఉన్నారన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మరోవైపు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అదీ ఇదీ కాకుండా…. ఒకవేళ మహిళను అధ్యక్షురాలిగా చేయాలనుకుంటే మాత్రం…. డీకే అరుణకు ఛాన్స్‌ దక్కవచ్చంటున్నారు. ఇక పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చాలా మంది ఒక్క ఛాన్స్‌ అంటూ రేస్‌లో ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కాకుండా తమకు ఇవ్వాలని అడుగుతున్నారట పార్టీ సీనియర్స్‌. అయితే… ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఏం మాట్లాడినా….. పార్టీ హై కమాండ్‌ ఈ విషయంలో ఇప్పటికే క్లారిటీకి వచ్చినందున ఫైనల్‌గా ఏ పేరు బయటికి వస్తుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు. ఇక్కడే ఇంకో వాదన కూడా తెర మీదికి వచ్చింది. పార్టీ అధ్యక్ష పదవిని కొత్త వాళ్ళకు ఇస్తారా? పాత నేతలకా అన్నది ఇప్పుడసలు సబ్జెక్ట్‌ కాదని, ఒక నాయకుడు ఒకసారి బీజేపీ బీ ఫామ్‌ మీద ఎన్నికల్లో పోటీ చేశాక ఇక కొత్త పాత ఏంటని అడుగుతున్నారు చాలా మంది నాయకులు.

Read Also: Adluri Laxman Kumar: మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తప్పిన ప్రమాదం..

మరోవైపు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ పేర్ల విషయంలో కూడా గట్టి ప్రచారమే జరిగినా…. వాళ్ళిద్దరి విషయంలో కొన్ని సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. రేస్‌లో ఆశావహులు ఎక్కువ మంది ఉండడం, పార్టీ హై కమాండ్ నిర్ణయాలు ఊహించలేని విధంగా ఉంటుండడంతో ఒక అవగాహనకు రాలేకపోతున్నామని అంటున్నారు ఎక్కువమంది నాయకులు. పరిస్థితి ఇంతకు ముందులా లేదుకదా..? పార్టీలో ఒకరిద్దరే లేరు కదా… అలాంటప్పుడు ఈ మాత్రం సస్పెన్స్‌ ఉండటం సహజం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పార్టీ వర్గాల్లో. ఇక్కడే ఇంకో ట్విస్ట్‌ కూడా ఉండవచ్చంటున్నారు. అభ్యర్థి ఎవరన్న విషయంలో అధిష్టానం దాదాపు క్లారిటీకి వచ్చినా… ఒకటికన్నా ఎక్కువ నామినేషన్స్‌ తీసుకోవాలని నిర్ణయిస్తే మాత్రం వేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామంటున్నారు కొందరు నాయకులు. ఈ పరిణామాల మధ్య ఫైనల్‌ రిజల్ట్‌ ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా చూస్తున్నారు తెలంగాణ బీజేపీ లీడర్స్‌.

Exit mobile version