Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Unbelievable Alliance In Isnapur Brs Mla And Bjp Mp Join Hands To Defeat Congress Leader Neelam Madhu

Off The Record : ఇస్నాపూర్‌లో కొత్త రకం రాజకీయ సమీకరణలు..

Published Date :February 21, 2026 , 10:00 pm
By Sudhakar Ravula
  • ఇస్నాపూర్‌లో కొత్త రకం రాజకీయ సమీకరణలు..
  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య దోబూచులాడిన ఛైర్మన్‌ పీఠం..
  • చేతులు కలిపిన బీజేపీ ఎంపీ రఘునందన్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌..
  • వాస్తవంగా రాజకీయ శత్రువులు రఘునందన్‌, మహిపాల్‌..
  • ఉమ్మడి శత్రువు నీలం మధుకు చెక్‌ పెట్టడం కోసమే కలిశారా?..
  • మధు భార్య ఛైర్‌పర్సన్‌ అయితే బలపడతారని భావించారా?..
  • ఉమ్మడి శత్రువును ఇద్దరూ కలిసి దెబ్బ కొట్టారా?..
Off The Record : ఇస్నాపూర్‌లో కొత్త రకం రాజకీయ సమీకరణలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు ఈ సారి సంచలనం రేపాయి. ఛైర్మన్‌ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మెజార్టీ ఎవరికీ దక్కలేదు. అటు బీజేపీ ఒక్క వార్డు కూడా గెలవలేదు. మొత్తం 26 వార్డులకుగాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10చోట్ల గెలిచాయి. మిగతా 4 సీట్లలో స్వతంత్ర కౌన్సిలర్లు విజయం సాధించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు భార్య కవిత ఇస్నాపూర్ 4వ వార్డు నుంచి గెలిచారు. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ మహిళకి కావడంతో తన భార్యకు పదవి ఇప్పించుకోవాలనుకున్నారు నీలం మధు. ఇస్నాపూర్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 14. బీఆర్ఎస్ 2 సీట్ల దూరంలో ఉంటే.. కాంగ్రెస్ 4 అడుగుల దూరంలో నిలిచింది. దీంతో ఇక్కడ గెలిచిన నలుగురు స్వతంత్ర కౌన్సిలర్లు కీలకంగా మారారు. వాళ్ళలో ముగ్గురు కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చి ఆ క్యాంప్‌లో చేరిపోయారు. మరొకరు బీఆర్ఎస్ తో చేతులు కలపగా ఆ పార్టీ బలం 13కు చేరి రాజకీం రక్తి కట్టింది. ఈ పరిణామాల నడుమే… బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు కాంగ్రెస్ క్యాంపులో చేరడంతో ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 14 దక్కింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి విప్ జారీ చేశారు. ఇక కాంగ్రెస్‌కే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కుతుందని అనుకునేలోపు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గేమ్‌ మార్చేశారు. తన ఎక్స్ అఫిషియో ఓటుని ఇస్నాపూర్‌లో నమోదు చేసుకున్నారాయన. దీంతో… రెండు పార్టీల బలం మళ్లీ 14కి చేరింది.

సరే…. ఇక టాస్‌లోనైనా అదృష్టం వరిస్తుందని భావించారు కాంగ్రెస్ నేత నీలం మధు. భారమంతా దేవుడిపైనే వేశామన్నట్టు నడుస్తున్న టైంలో ఆ పార్టీ అస్సలు ఊహించని పరిణామం జరిగింది. బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా తన ఎక్స్ అఫిషియో ఓటును ఇస్నాపూర్‌లోనే నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ని గెలిపించడానికే అక్కడ రిజిస్టర్‌ చేసుకున్నారనేది అందరికి తెలిసిన విషయం. కానీ ప్రత్యర్థి పార్టీ ఎంపీ రఘునందన్ రావు అలా ఎందుకు చేశారో ఎవరికీ అంతుచిక్కలేదు. అదే సమయంలో కాంగ్రెస్‌కు మరోషాక్ తగిలింది. ఆ పార్టీ కౌన్సిలర్ మాధవి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి టచ్ లోకి వెళ్లారు. నీలం మధు భార్య కవితకి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ పదవి దక్కడం ఇష్టం లేకే ఆమె బీఆర్ఎస్‌తో చేతులు కలిపారట. మరోవైపు ఛైర్మన్‌ ఎన్నిక రోజున రెండు వేర్వేరు పార్టీలకు చెందిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓకే కారులో రావడం ఇంకా ఆసక్తి రేపింది. దాంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డే నీలం మధు భార్యను మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ కానివ్వొద్దన్న లక్ష్యం పెట్టుకుని ఎంపీతో చేతులు కలిపినట్టు అంచనా వేశారు అంతా.

ఇక ఎన్నికలో బీఆర్ఎస్‌కు చైర్మన్ పదవి, కాంగ్రెస్ పార్టీకి లాస్ట్‌ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చిన మాధవికి వైస్ చైర్మన్ పదవి దక్కాయి.వాస్తవానికి పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాజకీయ శత్రువులు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా మహిపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు రఘునందన్. ఇటు నీలం మధు ఈ ఇద్దరు నేతలకు రాజకీయ విరోధి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నుంచి మహిపాల్ రెడ్డిపై పోటీ చేశారు నీలం. ఆ తర్వాత మెదక్ ఎంపీగా రఘునందన్ పై పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఇద్దరికీ ఉమ్మడి రాజకీయ శత్రువయ్యాడు నీలం. ఆ ప్రకారమే ఇద్దరూ చేతులు కలిపి నీలంకు చెక్‌ పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఒక వేళ ఇస్నాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే నీలం మధు సతీమణి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ అవుతారు. అప్పుడాయన మళ్లీ రాజకీయంగా బలోపేతం అవుతారు కాబట్టి ఇద్దరూ కలిసి దెబ్బ కొట్టారన్న విశ్లేషణలున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS BJP Alliance in Isnapur
  • Isnapur Municipal Election Results
  • Neelam Madhu Congress News
  • Neelam Madhu vs Mahipal Reddy
  • off the record

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions