Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..
- నామినేటెడ్ పదవిలో ఉన్న ఓనేత పనులు చక్కబెడుతున్నారా?..
- మంత్రి సీతక్క పేషీలోని సిబ్బందిపై కూడా నిఘా?..
- మంత్రి బంధువు ఒకరు పేషీలో అజమాయిషీ చేస్తున్నారా?..
- ఏ టెండర్ ఉన్నా తనకు తెలిసేలా నెట్వర్క్ ఏర్పాటు..
- తన అనుకూల వ్యక్తులు, సంస్థల కోసం రూల్స్ మార్చాలని వత్తిళ్లు?..
- కాంట్రాక్టర్స్ టీమ్ ఆగడాలకు మంత్రి పేషీ సిబ్బంది సహకారం?..
- మంత్రి లేనప్పుడు నేరుగా ఆమె ఛాంబర్‌లోనే మీటింగ్ పెడుతున్నారా?..
- కాంట్రాక్టర్స్‌కు సమాచారం ఇవ్వని అధికారుల్ని పేషీ సిబ్బంది బెదిరిస్తున్నారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్ల ప్రమేయం మితిమీరిపోయిందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. డిపార్ట్మెంట్లో ఏ చిన్న పని ఉన్నా అంతా మేమే అన్నట్టు కొందరు వ్యవహరించడం ఎవరికీ నచ్చడం లేదని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు కొందరు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాల్లో తలదూర్చడం పరిపాటిగా మారిందని చెప్పుకుంటున్నారు. ఓ జిల్లాలో కీలక నామినేటెడ్ పదవిలో ఉన్న నాయకుడు రెగ్యులర్‌గా సచివాలయానికి రాకపోకలు కొనసాగిస్తూ తన పనులు చక్కబెట్టుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. శాఖలో టెండర్లు ఇప్పిస్తానని పలువురు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు అడ్వాన్స్‌గా కూడా తీసుకుంటున్నారట. మరోవైపు సెక్రటేరియట్ లోని మంత్రి సీతక్క పేషీలోని పలువురి వ్యవహార శైలి పై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రికి, డిపార్ట్మెంట్ కు సంబంధించిన విషయాలను చూసుకునే సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. మంత్రికి బంధువు ఒకరు పేషీలో చేసే అజమాయిషీని సిబ్బంది తట్టుకోలేక పోతున్నారట.
ఓ జిల్లా స్థాయి నేత, పార్టీ నాయకుడు మరొకరితో కలిసి తెర వెనుక తంతంగాలు నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏ టెండర్ ఉన్నా తమకు తెలిసేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం, పనులు ఇప్పిస్తామని కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం పరిపాటి అయిందన్న చర్చ డిపార్ట్మెంట్లో జరుగుతోంది. శాఖలో ఏ రోజు ఏం జరుగుతుందోనని తెలుసుకునేందుకు ప్రతి సెక్షన్‌కు నేరుగా వెళ్తుంటారని ఫిర్యాదులు ఉన్నాయి. టెండర్లకు సంబంధించిన ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? అందులో ఎలాంటి నిబంధలు పెట్టారన్నది ముందే తెలుసుకుంటారట. అలాగే… తమకు అనుకూలమైన వ్యక్తులు, సంస్థలకు దక్కే విధంగా రూల్స్ మార్చాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తుంటారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అలాగే…. తమకు అనుకూలంగా టెండరు నిబంధనలు పెట్టించుకుని, ప్రయోజనం పొందుతున్న కాంట్రాక్టర్ల బృందం ఆ శాఖలోని హెచ్ వోడీ, జిల్లా స్థాయి అధికారుల నుంచి ఫైల్స్ మూవ్మెంట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటారట. సదరు అధికారులకు ఫోన్ చేస్తుంటారని తెలిసింది. ఆ టీమ్ ఆగడాలకు మంత్రి పేషీ స్టాఫ్ సహకారం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read
ఎందుకంటే.. సంబంధిత టీమ్ రెగ్యులర్‌గా పేషీలో కూర్చుని అక్కడి నుంచి ల్యాండ్‌లైన్స్ ద్వారా ఫోన్లు చేస్తుంటారని తెలిసింది. మంత్రి లేని సమయంలో నేరుగా ఛాంబర్లో కూర్చుని సమాలోచనలు చేస్తుంటారని నిఘా వర్గాలు పసిగట్టాయట. కాంట్రాక్టర్లు అడిగిన సమాచారాన్ని కొందరు అధికారులు ఇవ్వకపోతే…. మంత్రి పేషీలో పనిచేస్తున్న స్టాఫ్ రంగంలోకి దిగుతుంటారన్న టాక్ నడుస్తోంది. వాళ్లు అడిగిన సమాచారం ఇవ్వాలి. ఇవ్వకపోతే కుదరదంటూ బెదిరిస్తున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. అందుకు ముందు అధికారులు ఒప్పుకోకున్నా… ఆ తర్వాత వచ్చిన దమ్కీతో వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తోందన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. అప్పటికీ ఎవరైనా ఆఫీసర్స్ కాదు.. కూడదంటూ మొండికేస్తే… సదరు కాంట్రాక్టర్స్ గ్యాంగ్ నేరుగా వెళ్లి తమ స్టైల్లో బెదిరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలతో విసిగి పోయిన కొందరు అధికారులు ఇక భరించలేమంటూ… మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!