Off The Record: జనసేన నవ నిర్మాణ సభ కేంద్రంగా తెలంగాణలో రాజకీయ మంటలు..
- జనసేన నవ నిర్మాణ సభ కేంద్రంగా రాజకీయ మలుపు..
- హైదరాబాద్లో పవన్ ఎలా సభ పెడతారని మంత్రి పొన్నం అభ్యంతరం..
- పవన్ ప్రెస్మీట్ తర్వాత గట్టిగా మాట్లాడిన పొన్నం..
- తెలంగాణ మా అయ్య జాగీరే అన్న మాటలతో అగ్గికి ఆజ్యం..
- కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ వాదులు ఒక వేవ్లెంగ్త్లో..
- బీజేపీ, జనసేన ఒక ఫ్రీక్వెనీలో ఉన్నాయన్న అభిప్రాయం..
- పవన్ సభకు ఎందుకు అనుమతి ఇవ్వరని బీజేపీ ప్రశ్న..
- పవన్ వెనక బీజేపీ ఉందని కాంగ్రెస్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో చాలా రోజుల తర్వాత మళ్లీ సెంటిమెంట్ మంటలు రాజుకున్నాయి. ఐతే… ఈసారి వ్యవహారం కాస్త డిఫరెంట్గా ఉంది. అధికార పార్టీనే ముందు మొదలుపెట్టింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నవ నిర్మాణం పేరుతో జనసేన సభ అన్న పాయింట్ దగ్గర కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ నెగెటివ్ కామెంట్స్ చేశారని, అలాంటి నాయకుడు ఇప్పుడు తెలంగాణ కోసం అంటూ సభ పెట్టడం ఏంటన్న అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మొదలుపెట్టిన ఇష్యూలోకి తర్వాత తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నేతలు ఎంటరయ్యారు, రియాక్ట్ అయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళంతా డైలాగ్ వార్ మొదలుపెట్టారు. ఐతే.. పవన్ కళ్యాణ్ ప్రెస్మీట్ తర్వాత కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ బాగా రియాక్ట్ అయ్యారు.
నేను తెలంగాణలో తిరిగితే అడ్డుకుంటామని అంటున్నారు. ఇదేమన్నా వాళ్ళ అయ్య జాగీరా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారాయన. ఆ మాటలు తెలంగాణ వాదులను మరింత హర్ట్ చేశాయంటూ….అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు పొన్నం. ఎస్… ముమ్మాటికీ తెలంగాణ మా అయ్య జాగిరే…నీ అయ్య జాగీరు కాదంటూ అన్న మాటలతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. ఇక్కడ మరో అంశం ఏంటంటే… ఈ టోటల్ ఎపిసోడ్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ వాదుల వాదన ఒకలా ఉంటే… బీజేపీ, జనసేన నేతల వాదన ఒక ఫ్రీక్వెన్సీలో ఉంది. పవన్ కళ్యాణ్ సభ పెట్టుకుంటానంటే ఎందుకు అనుమతిఇవ్వరు… కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ… బీజేపీ నేతలు మాట్లాడారు. అదే సమయంలో మరో రకమైన విశ్లేషణ సైతం నడుస్తోంది. జనసేన వెనక బీజేపీ ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విమర్శలు కురిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం, ఇప్పుడు పవన్ నోట బీజేపీ మాటలు రావడం చూస్తుంటే… ఇద్దరూ ఒకటేనన్న ఫీలింగ్ బయటకు వచ్చిందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఏదేమైనా.. పవన్ కళ్యాణ్ వ్యవహారంతో రాష్ట్రంలో మరోసారి సెంటిమెంట్ మొదలైంది. ఉద్యమకారులంతా తిరిగి ఏకమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. రూపం మారిన మోడ్రన్ సెంటిమెంట్ వార్లో చివరికి పైచేయి ఎవరిది అవుతుందోనంటూ ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పండిట్స్.
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
తాజావార్తలు
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..