Site icon NTV Telugu

Off The Record: ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలేం జరుగుతుంది..? కేసు ఎటుపోతోంది..?

Phone Tapping Case

Phone Tapping Case

Off The Record: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో ఎప్పటికప్పడు కొత్త కొత్త ట్విస్ట్‌లు పెరుగుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టు సిట్‌ కూడా కానూన్‌ కే హాత్‌ బహుత్‌ లంబే హోతేహై… అన్నట్టుగా ఎప్పటికప్పుడు సెట్‌ చేసుకుంటూనే ఉంది. కానీ… తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం సిట్‌ బృందానికి కూడా ఎక్కడో డౌట్‌ ఉందా అన్న అనుమానాల్ని పెంచుతున్నాయట. ఎందుకంటే… వరుసబెట్టి బాధితులందర్నీ పిలిచి విచారిస్తున్నారు అధికారులు. మామూలుగా అయితే… అంత సీన్‌ అవసరం లేదన్నది నిపుణుల అభిప్రాయం. కానీ… ఈ కేసులో ఆధారాలు వీక్‌గా ఉండటం వల్లే… అదనపు బలం కోసం ఇలా బాధితుల వాంగ్మూలాలను భారీ ఎత్తున తీసుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. గత ఎన్నికల సమయంలో ఒక్క నవంబర్‌లోనే 618 మంది ఫోన్స్‌ను ట్యాప్‌ చేసిందట ప్రభాకర్ రావు అండ్ గ్యాంగ్. ఇప్పుడు వాళ్ళందర్నీ పిలిచి ఎందుకు స్టేట్‌మెంట్స్‌ రికార్డ్ చేస్తున్నారంటే.. ఎక్స్‌ట్రా కేర్‌ అన్న సమాధానం వస్తోందట దర్యాప్తు బృందం నుంచి. ఈ కేసులో సిట్‌ దర్యాప్తునకు ప్రధాన ఆధారం హార్డ్‌ డిస్క్‌లు. వాటన్నిటినీ ప్రణీత్‌రావు కట్‌ చేసి మూసీలో పడేశారన్న అభియోగాలున్నాయి. మూసీ నుంచి అధికారులు వాటిని రికవరీ చేసుకున్నారు కూడా.

Read Also: CEIR Portal: ఫోన్ పోయిందా నో టెన్షన్..? జస్ట్ ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయండి..

కానీ… హార్డ్‌ డిస్క్‌ల్లోని సమాచారం పూర్తిగా ఉందా? ఒకవేళ ఉన్నా…ఈ పరిస్థితుల్లో అది కోర్ట్‌లో నిలబడుతుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట. ఒకవేళ నిలబడకుంటే… కేసు వీక్‌ అవకుండా ముందు జాగ్రత్త కోసమే బాధితుల వాంగ్మూలాలను రికార్డ్‌ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటికి ముగ్గురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్‌ ఎంతవరకు నిలుస్తాయన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. ఇన్ని అనుమానాల మధ్య కేసు వీగిపోకుండా… పకడ్బందీగా దోషులకు శిక్ష పడాలంటే… అదనపు బలం అవసరమని భావిస్తున్న దర్యాప్తు అధికారులు బాధితుల్ని పిలుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. రేపటి రోజున మిగతావన్నీ వీగిపోయినా… వీళ్ళే ప్రధాన సాక్షులు అవుతారని నమ్ముతున్నారట అధికారులు. పొలోమని వందల మందిని ఎందుకు పిలుస్తున్నారయ్యా… అంటే… అందుకూ ఓ రీజన్‌ ఉందట. మొత్తం 618 మందిని పిలిస్తే… కోర్టు టయల్‌కు కొందరు హాజరవకున్నా… మిగతా వాళ్ళు సరిపోతారని అనుకుంటున్నట్టు సమాచారం. వాళ్ళందరిలో కనీసం పదిమంది అనుకూలంగా సాక్ష్యం చెప్పినా కేసు నిలబడుతుందన్నది సిట్‌ భావనగా తెలుస్తోంది. ముందు ముందు ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి మరి.

Exit mobile version