Site icon NTV Telugu

Off The Record: కలకలం రేపుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్.. ఎవరి గురించి ?

Otr Ponnam Jeevan

Otr Ponnam Jeevan

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా మారారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే ఎక్కువగా ఆయనే పార్టీని ఇరుకున పెడుతున్నారన్న అభిప్రాయం ఉందట గాంధీభవన్‌ వర్గాల్లో. అందుకు తగ్గట్టే… జగిత్యాల పరిణామాలతో అవకాశం దొరికినప్పుడల్లా… సొంత పార్టీ నేతలపై విరుచుకు పడుతున్నారాయన. నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా…. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు ఎమ్మెల్యే సంజయ్.వరుసగా రెండుసార్లు తనని ఓడించిన సంజయ్…. తన పార్టీకే చేరువ కావడం మింగుడు పడటం లేదట జీవన్ రెడ్డికి.. దీంతో రెండేళ్లుగా అలకల అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు. ప్రారంభంలో వాటికి కాస్త రియాక్ట్ అయి బుజ్జగించిన కాంగ్రెస్‌ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం… ఇక రొటీన్‌ అయ్యేసరికి పట్టించుకోవడం మానేశారు. దీంతో ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు చేరిన జీవన్‌రెడ్డి పార్టీపై దాదాపు తిరుగుబాటు చేసినతం పని చేస్తున్నారన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. అందుకు తగ్గట్టే ఇటీవలి ఎన్నికల్లో స్వతంత్రులను బరిలోకి దింపి పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయినా జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం అయింది. అటు ఎమ్మెల్యే సంజయ్, ఇటు జీవన్ రెడ్డి మధ్య వార్‌తో నియోజకవర్గంలోని మరో మున్సిపాలిటీ రాయికల్‌ను కోల్పోవాల్సి వచ్చిందని పార్టీ నేతలే అంటున్నారు.

ఈ విషయంపై పార్టీ పెద్దలు సీరియస్ అయినా…. జీవన్ డోంట్ కేర్ అన్నట్టు సమాచారం. ఆయన విషయంలో పార్టీ సీరియస్‌గా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న క్రమంలో… మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ అవసరాల రీత్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది… పార్టీ నిర్ణయాన్ని గౌరవించకుండా ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తారా? నాయకత్వం సైలెంట్‌గా ఉందంటే… అది చేతగాని తనమో, అలసత్వమోనని అనుకోవద్దు. సరైన సమయంలో పార్టీ కచ్చితంగా స్పందిస్తుందంటూ…. జీవన్ ఎపిసోడ్‌పై స్పందించారు పొన్నం. అయితే మాజీ మంత్రికి, ప్రస్తుత మంత్రికి మధ్య కొన్నేళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోందట. మొదటి నుంచి కూడా వీరిద్దరి మధ్య అంత సఖ్యత ఏమీ లేదని చెప్పుకుంటున్నారు. అటు గతంలో జీవన్ అలకపాన్పు ఎక్కినప్పుడు మరో మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అండగా నిలిచారు.వారి బుజ్జగింపులతోనే అప్పట్లో మెత్తబడ్డారట జీవన్… అందరూ వచ్చి పలకరించినా పొన్నం మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉన్నారట… పైగా జీవన్ పార్టీపై కామెంట్స్ చేసిన ప్రతిసారి…. రాష్ట్ర నేతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పొన్నం అన్నట్టు సమాచారం…

కొందరి మద్దతు జీవన్‌కి దక్కినప్పటికి.. పొన్నం నుంచి మాత్రం రివర్స్ అయిందట… తనకు ఎమ్మెల్సీ రెన్యూవల్ విషయంలో, క్యాబినెట్ స్థాయి పదవి ఇచ్చే విషయంలో చర్చలు జఠిగినప్పుడు కూడా పొన్నం అడ్డుపడ్డారని పలుమార్లు బాహాటంగానే అనుచరుల ముందు వాపోయారట జీవన్‌రెడ్డి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లలో తమ నేతకు ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు జీవన్ అనుచరులు… సరిగ్గా ఇదే సమయంలో క్రమశిక్షణా చర్యలు అంటూ మంత్రి పొన్నం కామెంట్ చేయడం సరికొత్త చర్చకు తెర తీసింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయన వ్యవహరించిన తీరును పార్టీకి గుర్తు చేసేందుకే పొన్నం ఈ కామెంట్స్ చేశారనే చర్చలు సాగుతున్నాయి… పెద్దలు జీవన్ రెడ్డిని పెద్దల సభకు వెళ్లకుండా చేసేందుకు పార్టీలో గట్టి ప్రయత్నాలే సాగుతున్నట్టు పొన్నం హింట్ ఇచ్చారనేది ఇంకో వెర్షన్‌. జీవన్ వైపే ఉన్నట్టుగా చెబుతున్న జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి ఏ స్టెప్ తీసుకుంటారు..? పొన్నం జీవన్ మధ్య వార్ బహిర్గతం అవుతుందా అనేది వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు..

Exit mobile version