Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Svsn Varma Security

Off The Record: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రాణాపాయం ఉండేంత సీన్ లేదా..?

Published Date :September 10, 2025 , 11:09 pm
By Sudhakar Ravula
  • 2014-19 మధ్య పిఠాపురం ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే వర్మ..
  • సడన్‌గా ఇప్పుడు వన్‌ ప్లస్‌ వన్‌ గన్‌మెన్‌ సెక్యూరిటీ..
  • గత ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన కేడర్‌ మధ్య స్వల్ప ఉద్రిక్తతలు..
  • ప్రాణాపాయం ఉండేంత సీన్‌ లేదన్న అభిప్రాయం..
  • ఆర్భాటం కోసమే వర్మ గన్‌మెన్‌ కావాలన్నారా?..
  • వర్మకు థ్రెట్‌ ఏమీ లేదని జిల్లా పోలీసులు రిపోర్ట్‌ ఇచ్చారా?..
  • గట్టిగా పట్టుబట్టడంతో పెద్దలు కాదనలేక ఓకే చెప్పేశారా?..
  • మంచి నామినేటెడ్‌ పదవి కూడా అంటూ మురుస్తున్న అనుచరులు..
  • ఆ విధంగానన్నా మురిసిపోండంటూ జనసేన సెటైర్స్‌..
Off The Record: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రాణాపాయం ఉండేంత సీన్ లేదా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు వన్ ప్లస్ వన్ గన్‌మెన్‌ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారు. అయితే … తాజాగా తనకు భద్రతా కారణాల రీత్యా ప్రొటెక్షన్ కావాలని ప్రభుత్వాన్ని అడిగారట మాజీ ఎమ్మెల్యే. ఏం… ఉన్నట్టుండి ఆయనకు ఏం ఆపద ముంచుకొచ్చింది? అర్జంట్‌గా సెక్యూరిటీ ఎందుకంటే…. చెప్పిన కారణాలు కూడా కాస్త ఆశ్చర్యంగానే అనిపించాయట కొందరికి. ఆ విషయాన్ని ఎక్కడా బయటపెట్టకుండా… అయినా… మాకెందుకులేమ్మా…. అంటూ కామ్‌ అయిపోయినట్టు తెలిసింది. 2024 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిశాక ఒకటి రెండు సందర్భాల్లో పిఠాపురంలో టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య కాస్త ఉద్రిక్తతలు తలెత్తాయి. కవ్వింపు చర్యలతోపాటు కార్ల మీద దాడులు కూడా చేసుకున్నారు. తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. అయినా… అవేమీ ప్రాణాపాయం ఉన్నంత స్థాయి వ్యవహారాలు కావన్నది విస్తృతాభిప్రాయం. పైగా.. ఇక్కడి నుంచి స్వయంగా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి చోట మిత్రపక్షం నియోజకవర్గ ఇన్ఛార్జ్‌కి జనసేన కార్యకర్తలు ఎందుకు ప్రాణాపాయం తలపెడతారన్నది స్థానికుల్లో మెదులుతున్న ప్రశ్న. కాకుంటే… ఇక్కడే మరో రకమైన చర్చ కూడా జరుగుతోంది.

మనం అధికార పార్టీలో ఉన్నాం. పైగా పిఠాపురం. ఇవన్నీ పైకి చెప్పుకోవడానికి బాగానే ఉన్నా… అధికార పదవి మాత్రం లేదు. పోతేపోనీ సర్దుకుందామనుకున్నా… కనీసం గన్‌మెన్‌ హంగామా అయినా లేకుంటే… మనల్ని ఎవడూ లెక్కచేయడం లేదని వర్మ ఫీలై పోతున్నారట. అందుకే నాకు గన్‌మెన్‌ను ఇచ్చి తీరాల్సిందేనని ప్రభుత్వం దగ్గర పట్టుబట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. సరే… ఆయనేదో ప్రెస్టీజ్‌ ఇష్యూగా ఫీలైపోయి అడిగేశారనుకో… అయినా, వెంటనే ఇచ్చేయడానికి అదేదో చాక్లెట్టో బిస్కెట్టో కాదుకదా!… అందుకే ప్రొసీజర్ ప్రకారం…. ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ అడిగిందట సర్కార్‌. వర్మకి ఏదన్నా థ్రెట్‌ ఉందా.. పోలీస్‌ రక్షణ కావాల్నా అన్న ప్రశ్నలకు అంత అవసరం లేదంటూ జిల్లా పోలీస్‌ అధికారులు రిపోర్ట్‌ ఇచ్చినట్టు తెలిసింది. అయినాసరే…. అదంతా నాకు తెలీదు.. నేను తిరిగి చూస్తే లెఫ్టూ రైటూ… గన్స్‌ కనిపించాల్సిందేనని మారాం చేశారట మాజీ ఎమ్మెల్యే. దాంతో.. ఇక చేసేదేం లేక ఆ కోరికనన్నా తీరుద్దామనుకుంటూ వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీకి ప్రభుత్వ పెద్దలు స్టాంపేసినట్టు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా ఆయన ముచ్చట తీరిపోయింది. రూల్స్‌ ప్రకారం చూసుకుంటే… మాజీ ప్రజా ప్రతినిధుల్లో అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే గన్‌మెన్‌ సెక్యూరిటీ ఇస్తారు. ఒకవేళ ఆ లిస్టులో లేనివాళ్ళు ఎవరైనా తమకు కావాలంటే మాత్రం… పరిస్థితిని బట్టి కేటాయించి సిబ్బంది జీతాన్ని వాళ్ళ దగ్గరి నుంచే వసూలు చేస్తారు.

అలా.. వర్మకు గన్‌మెన్‌ కేటాయింపు ఒక ఎత్తయితే… దీన్ని ఆయన అనుచరగణం మరోలా అర్ధం చేసుకుంటోందట. సెక్యూరిటీ వచ్చేసింది కాబట్టి మా సార్‌కు ఇక మంచి నామినేటెడ్‌ పదవి ఇచ్చేస్తారంటూ తెగ మురిసిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అంతేనా… ఇంకొందరైతే…కాస్త అడ్వాన్స్‌ అయిపోయి పూజలు సైతం చేయించేస్తున్నారట. కానీ.. పిఠాపురంలో మరో పవర్‌ సెంటర్‌ని తయారు చేయడానికి పవన్‌ కళ్యాణ్‌ ఒప్పుకుంటారా అన్నది ఎక్కువ మంది విశ్లేషకుల్ని వేధిస్తున్న ప్రశ్న. అటు లోకల్‌ జనసేన కేడర్‌ సైతం… సార్‌కి ఎలాగూ పదవి లేదు… ఆ…. గన్‌మెన్‌ మురిపెమన్నా తీర్చుకోనివ్వండర్రా… అంటూ సెటైర్స్‌ వేస్తున్నారట. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికల సమయంలోనే ప్రకటించారు చంద్రబాబు. కానీ ఏపీలో ఇప్పుడు 2027 వరకు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. దాంతో… మాజీ ఎమ్మెల్యేని సంతృప్తి పరచడానికే గన్‌మెన్‌ను ఇచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు పిఠాపురంలో. మాజీ ఎమ్మెల్యే గన్‌మెన్‌తో సంతృప్తి చెందుతారా? లేక తన పాత డిమాండ్స్‌ని అలాగే కొనసాగిస్తారా అన్నది చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Kakinada
  • off the record
  • pithapuram
  • SVSN Varma

తాజావార్తలు

  • Ola Bike Price Drop: శుభవార్త చెప్పిన ఓలా.. ఆ ఎలక్ట్రిక్ బైక్ ధరలు భారీగా తగ్గింపు..

  • Mamata Banerjee: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు బీజేపీ కుట్ర..

  • Bitter Gourd Recipe: కాకరకాయలోని చేదుకు ఇలా వీడ్కోలు చెప్పండి..! ఇక, లొట్టలేసుకు తింటారు..

  • Vivo V70 FE: వివో V70 FE 5G ఫోన్‌ విడుదల.. 200MP కెమెరా, 7,000 mAh బ్యాటరీ.. ధర ఎంతంటే?

  • Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions