Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Peddireddy Ramachandra Reddy And Kuppam Ysrcp

Off The Record: పెద్దిరెడ్డి ఏమయ్యారని కేడర్ క్వశ్చన్..? కుప్పం వైసీపీలో నిశ్శబ్దం..!

Published Date :April 30, 2025 , 9:26 pm
By Sudhakar Ravula
  • కుప్పం ఎమ్మెల్యేగా 8సార్లు చంద్రబాబు గెలుపు..
  • 2024లో ఓడించాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు..
  • స్పెషల్‌ కేర్‌ తీసుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
  • అప్పట్లో కుప్పం తమ్ముళ్ళకు చుక్కలు..
  • ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో నిశ్శబ్దం..
  • తాజాగా మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికతో మరోసారి హాట్‌ హాట్‌..
  • 15 ఓట్లతో సొంతం చేసుకున్న టీడీపీ..
  • వైసీపీ నుంచి 8మంది కౌన్సిలర్స్‌ మాత్రమే హాజరు..
  • చివరి నిమిషంలో టీడీపీ వైపు నలుగురు వైసీపీ కౌన్సిలర్స్‌ మొగ్గు..
  • నాడు బీరాలు పలికిన పెద్దిరెడ్డి ఏమయ్యారని కేడర్‌ క్వశ్చన్‌..
Off The Record: పెద్దిరెడ్డి ఏమయ్యారని కేడర్ క్వశ్చన్..? కుప్పం వైసీపీలో నిశ్శబ్దం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పుడూ హాట్‌ టాపిక్‌ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్‌ తాజాగా మరోసారి చర్చనీయాంశం అయింది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో మొదలైన సెగల సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించే తాజా చర్చ. కుప్పం అంటే చంద్రబాబు… బాబు అంటే కుప్పం అన్నంతగా ఈ నియోజకవర్గంతో ఆయనకు బంధం పెనవేసుకుపోయింది. వరుసగా 8 విడతల నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారాయన. కానీ… 2024 ఎన్నికల్లో ఈ సీటును షేక్‌ చేయాలని ఓ రేంజ్‌లో పావులు కదిపింది వైసీపీ. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. కుప్పంలో బాబుకు చోటు లేకుండా చేయాలంటూ… మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మరీ పావులు కదిపారు. నాడు చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసేందుకు.. పెద్దిరెడ్డి పన్నని వ్యూహాలంటూ లేవని అంటారు. ఆయన అండతో కుప్పం వైసిపి నేతలు సైతం… స్థానికంగా తమ్ముళ్లకు చుక్కలు చూపించారు. వరుసగా పంచాయతీ ఎన్నికల నుండి మున్సిపల్ పోరు వరకు అన్నిటిలో వైసీపీ జెండా ఎగరేశారు. చివరికి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందని అంటే.. సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి కూడా చంద్రబాబు రోడ్డు మీద కూర్చుని ధర్నా చేయాల్సి వచ్చింది.

Read Also: Off The Record: తెలంగాణ కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న ఆ అంశం ఏంటి..?

ఇక ఆయన వచ్చిన ప్రతిసారి రాళ్ల దాడులు, ఘర్షణలు కామన్ అయిపోయాయి కుప్పంలో. ఆ ఊపులోనే… ఈసారి చంద్రబాబు ఎలా గెలుస్తాడో చూస్తామంటూ మీసాలు మెలేసి తొడలు కొట్టింది పెద్దిరెడ్డి వర్గం. కానీ.. చివరికి వాళ్ళొకటి తలిస్తే…. ఓటర్లు మరోటి తలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు బెడిసి కొట్టి వరుసగా ఎనిమిదోసారి కుప్పం ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు. ఇక ఆ తర్వాతి నుంచి స్థానిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాడు మా అంత మొనగాళ్ళు లేరంటూ జబ్బలు చరుచుకున్న స్థానిక వైసీపీ నాయకులు చాలా మంది అడ్రస్‌ లేకుండా పోయారు. కొందరు బెంగళూరుకు షిఫ్ట్‌ అయిపోతే… ఇంకొందరు కామ్‌గా.. ఉన్నామా లేదా అన్నట్టుగా టైంపాస్‌ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగింది మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులుండగా… అందులో 18 వార్డులను గెలుచుకుని పాగా వేసి అప్పట్లో చంద్రబాబుకు షాక్‌ ఇచ్చింది వైసీపీ. టీడీపీ కేవలం 6 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే… నిరుడు నవంబరు 6న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ పదవితోపాటు, ఆరో వార్డ్‌ కౌన్సిలర్‌గా కూడా రాజీనామా చేశారు సుధీర్. అందుకే ప్రస్తుతం ఛైర్మన్‌ ఎన్నిక అనివార్యం అయింది. రాష్ట్రంలో అధికారం మారాక ఇక్కడ కూడా బలాబలాలు మారిపోయాయి. మొత్తం 14 మంది టీడీపీ కౌన్సిలర్ల మద్దతుకు, ఎమ్మెల్సీ ఓటు కూడా తోడవడంతో ఛైర్మన్‌ పదవి సైకిల్‌ పార్టీ సొంతమైంది. వైసీపీ నుంచి 8 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. దీంతో టిడిపి సునాయాసంగా విజయం సాధించింది. వన్నియకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజును కుప్పం మున్సిపల్ చైర్మన్‌ పదవి వరించింది. అయితే… ఎన్నిక ముందు వరకు సై అంటే సై అన్న వైసిపి నేతలు….చివరికి వచ్చే సరికి చేతులెత్తేశారట. నలుగురు కౌన్సిలర్లు అయితే చివరి నిమిషంలో వైసిపికి షాక్ ఇచ్చి టిడిపి జై కొట్టారట. అదంతా అధికార పార్టీ వ్యూహం వల్లేనన్నది లోకల్‌ టాక్‌.

Read Also: Off The Record: తెలంగాణ కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న ఆ అంశం ఏంటి..?

అయితే…. ఇప్పుడు ఈ పాయింట్‌ని బేస్‌ చేసుకునే కొత్త చర్చ జరుగుతోంది కుప్పంలో. నాడు ఏకంగా చంద్రబాబునే ఓడిస్తామంటూ… బీరాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు మున్సిపాలిటీ బలం ఉన్నా సరే… ఎందుకు వదిలేశారు? కనీసం పట్టించుకున్న పాపాన ఎందుకు పోలేదు? అసలా ఊరితో నాకేం పని అన్నట్టుగా ఎందుకు ఉన్నారని మాట్లాడుకుంటున్నారట స్థానికంగా. అంటే… తొడలు కొట్టడాలు, మీసాలు మెలేయడాలన్నీ అధికారం ఉంటేనేనా? లేదంటే… బలం ఉన్న మున్సిపాలిటీని కూడా ఎందుకొచ్చిన గొడవలే అనుకుని వదిలేస్తారా అన్న చర్చ స్థానిక వైసీపీ కేడర్‌ మధ్యనే జరుగుతోందట. మిమ్మల్ని నమ్ముకుని మేము ఆ రోజు చెలరేగిపోతే… ఇప్పుడు నాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కుప్పం నేతల క్వశ్చన్‌ అట. ఇక టిడిపి నేతల సెటైర్స్‌ సంగతి సరేసరి. అయితే కొద్ది మంది వైసీపీ సీనియర్ నేతలు మాత్రం పెద్దిరెడ్డి కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికను పరోక్షంగా పర్యవేక్షించారని, పార్టీకి ద్రోహం చేస్తూ వెళ్లిపోయి టీడీపీకి ఓటేసిన కౌన్సిలర్స్‌ని వెంటనే సస్పెండ్ చేయమని చెప్పింది ఆయనేనని అంటున్నారు. ఈ వాదనలు, వివరణల సంగతి ఎలా ఉన్నా… కుప్పం వైసిపి క్యాడర్ మాత్రం మా పెద్దాయన ఎక్కడ అంటూ గట్టిగానే నిలదీస్తున్నారట. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • kuppam
  • off the record
  • peddireddy Ramachandra Reddy
  • YSRCP

తాజావార్తలు

  • Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్‌ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

  • Israel: భారీ దాడులకు సిద్ధమైన ఇజ్రాయిల్.. ట్రైన్ నెట్‌వర్క్ టార్గెట్‌గా అటాక్స్..

  • AA 22 : లవ్ లెటర్ లోడింగ్.. ప్రీ లుక్‌తోనే ప్రభంజనం

  • మూడు మ్యాచుల్లో మూడూ వివాదాలే.. SRHను వెంటాడుతున్న అంపైరింగ్ తప్పులు.. యాజమాన్యం సంచలన నిర్ణయం!

  • Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో కీలక చర్చలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions