Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
- కొన్ని చోట్ల టీడీపీ, జనసేన మధ్య భేదాభిప్రాయాలు..
- పీక్స్‌కు చేరుతున్న లోకల్ లెవల్ పంచాయితీలు..
- జిల్లాల టూర్స్‌తో విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్‌కళ్యాణ్..
- పదవుల్లో జనసేనకు అన్యాయం అంటూ పదేపదే ఫిర్యాదులు..
- కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి, చెక్‌పెట్టే ప్లాన్..
- అసంతృప్తితో పార్టీకి దూరమవ్వాలనుకుంటున్న కొందరు ..
- అన్నిటికీ మందుగా వచ్చేనెల నుంచి పవన్ జిల్లాల టూర్..
- ఒకేసారి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కూడా ప్లాన్స్..
- స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించే లక్ష్యం..
- జూన్ నుంచి మొదలయ్యే పవన్ టూర్స్ పై కేడర్ ఆసక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దాని వెనక గట్టి ఫ్యూచర్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2029 ఎన్నికల్లో కూడా ఇదే కాంబినేషన్లో, ఇలాగే కలిసి వెళ్తామని చెబుతున్నాయి పార్టీల అగ్ర నాయకత్వాలు. మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన అధ్యక్షులైతే ఇదే మాట పదేపదే చెబుతున్నారు. పై స్థాయిలో అంత ఐక్యత కనిపిస్తున్నా…. గ్రౌండ్ లెవల్‌కి వచ్చేసరికి వాతావరణం వాళ్ళు ఊహించుకుంటున్నంత సామరస్యంగా ఏం లేదన్నది పొలిటికల్ ఒపీనియన్. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణితో పాటు కార్యకర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలున్నాయి, పంచాయితీలు పీక్స్‌కు చేరుతున్నాయి. సరిగ్గా అలాంటి వాటి మీదే ఇప్పుడు దృష్టి పెట్టారట పవన్‌కళ్యాణ్. జిల్లాల పర్యటనలు చేసి… క్షేత్ర స్థాయిలో జనసేన నాయకత్వానికి భరోసా కల్పించడంతోపాటు బలోపేతం చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే రెండు సార్లు పవన్ జిల్లా యాత్రలకు సిద్ధమైనా… రకరకాల కారణాలతో వాయిదా పడింది. దీంతో క్షేత్రస్థాయిలో పేరుకుపోతున్న సమస్యలు మరింత ముదురుతున్నాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశం, జేఎల్పీ మీటింగ్ సహా కీలక భేటీల్లో… గ్రౌండ్ లెవెల్లో జనసేనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాప్రతినిధులు పదేపదే అధ్యక్షుడి దృష్టికి తీసుకు వచ్చారు. స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం, నామినేటెడ్ పదవుల పంపకం, అధికార వ్యవహారాల్లో సమన్వయ లోపాల్లాంటివన్నీ కలగలిసి క్యాడర్లో అసంతృప్తి పెరుగుతోందన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలన్నిటికీ ఫుల్స్టాప్ పెట్టేందుకు… జిల్లా స్థాయిలో కూటమి ప్రధాన నాయకులతో కో ఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని సాల్వ్ చేస్తామని
పవన్ కూడా హామీ ఇస్తూ వస్తున్నారు. కానీ… అవన్నీ మాటలకే పరిమితం అయ్యాయి తప్ప ఆచరణలోకి రాలేదు. అదే సమయంలో పదేపదే సమస్యలను చెప్పి విసిగిపోయిన కొంతమంది కార్యకర్తలు, లోకల్ లీడర్స్ పార్టీ అధినాయకత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ దూరమవుతున్నారన్న సమాచారం కూడా హెడ్డాఫీస్‌కు అందుతోందట. ఇది ఇలాగే కొనసాగితే కూటమికే కాదు, జనసేన రాజకీయ భవిష్యత్ కూడా ప్రమాదంలో పడుతుందన్న సంకేతాలతో పవన్‌కళ్యాణ్ అలర్ట్ అయినట్టు తెలిసింది.
Also Read
ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా… వచ్చే నెల నుంచే జిల్లాల యాత్రలతో స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రతి జిల్లాలో నియోజకవర్గ స్థాయి సమీక్షలు, గ్రౌండ్ రియాలిటీపై ప్రత్యక్ష అవగాహన, అసంతృప్తి స్వరాలను వినడం, కూటమిలోని మిగతా పార్టీల నేతలతో సమన్వయ చర్చలు, కష్టపడే కార్యకర్తలకు భరోసా లాంటి రకరకాల అంశాలే పవన్ టూర్ ప్రధాన లక్ష్యాలుగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలపడేలా ముందస్తు వ్యూహరచన చేయడం కూడా ఈ యాత్రల వెనకున్న కీలక ఉద్దేశంగా కనిపిస్తోంది. మరో వైపు ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే అవకాశాలున్నందున… ఈ పర్యటనలు దానికి కూడా ఉపయోగపడతాయన్న లెక్కలున్నాయి. లోకల్ బాడీస్ ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కేలా వ్యూహరచన చేయాలని పవన్ భావిస్తున్నారట. ఇక గత ఎన్నికల్లో జనసేన విజయంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలకు నేరుగా భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో పవన్ ఈ టూర్స్ ప్లాన్ చేస్తున్నారన్నది ఇంకో వెర్షన్. ఇటీవల పార్టీ క్యాడర్లో ఒకింత నిరాశ వాతావరణం పెరుగుతోందన్న వార్తల మధ్య అధ్యక్షుడి జిల్లాల పర్యటనలు కొత్త జోష్ నింపుతాయని అంటున్నారు. మొత్తం మీద జూన్ నుంచి మొదలవబోయే పవన్ టూర్ పార్టీ కేడర్‌లో జోష్ నింపడంతో పాటు రేపు స్థానిక ఎన్నికల్లో పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించడానికి రూట్ క్లియర్ చేస్తుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
-
Iran: ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!
-
Lenin Censor Talk : ‘లెనిన్’ సెన్సార్ టాక్.. పెద్ది లాంటి షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Wife Murder: స్మూతీలో విషం? అమెరికాలో భార్యను కడతేర్చిన తెలంగాణ భర్త కేసులో సంచలన విషయాలు!
ట్రెండింగ్
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!