Site icon NTV Telugu

Off The Record: కడప టీడీపీలో కొత్త రాగం..! టికెట్‌ కోసం పోటీ పెరుగుతోందా?

Tdp

Tdp

Off The Record: ఇదే ఆ నియోజకవర్గం.. కడప. ఈ సెగ్మెంట్‌లో పట్టుకోసం అధికార, విపక్షాలు ఎప్పుడూ పోరాటం చేస్తుంటాయి. కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మైనారిటీ ఓటర్ల తర్వాత బలిజ, రెడ్డి సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ. మూడు దశాబ్దాలుగా ఇక్కడ మైనారిటీ అభ్యర్థులదే గెలుపు. అది కాంగ్రెస్‌ అయినా.. టీడీపీ అయినా.. ఇప్పుడు వైసీపీ అయినా.. ముస్లిం అభ్యర్థులే ఎమ్మెల్యేలు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న అంజాద్‌ బాషా సైతం కడప ఎమ్మెల్యేనే.

Read Also: Off The Record: మంచు మనోజ్‌ పెళ్లిలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.. కొత్త జంటతో ఆయన అనుబంధం ఏంటి..?

1994-99 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖలీల్‌భాషా కడప ఎమ్మెల్యే. 2004 నుంచి 2014 వరకు కడప టికెట్‌ను ముస్లింయేతర అభ్యర్థులకు టికెట్‌ ఇచ్చింది టీడీపీ. 2019లో మాత్రం అమీర్‌బాబును పోటీ చేయించింది. ఇప్పుడు 2024లో టీడీపీ ఏం చేస్తుంది అన్నదే ప్రస్తుతం ప్రశ్న. ఈ నియోజకవర్గంలో వైసీపీ బలంగా కనిపిస్తోంది. వైఎస్‌ ఫ్యామిలీ ప్రభావం కూడా ఎక్కువే. అయినప్పటికీ కడపలో పాగా వేయడానికి టీడీపీ అనేక ప్రయోగాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఓడిన అమీర్‌బాబు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నప్పటికీ ఆయనకు మళ్లీ టికెట్‌ ఇస్తుందా అనేది పార్టీ వర్గాల్లో నెలకొన్న డౌట్‌. ఈ సీటును టీడీపీలో పలువురు నేతలు ఆశిస్తుండటమే ఆ అనుమానానికి కారణం.

Read Also:Off The Record: ప్రకాష్‌రాజ్‌ ఏమైపోయారు..? ఎన్నికల్లో పోటీ చేస్తారా?

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తన కుటుంబానికి కడప అసెంబ్లీ టికెట్‌ కేటాయించాలని కోరుతున్నారట. తన భార్యను పోటీ చేయించే ఆలోచనలో శ్రీనివాసుల రెడ్డి ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గుర్తింపు పొందిన లక్ష్మీరెడ్డి కుటుంబం సైతం అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తోందట. పార్టీ పెద్దల చెవిలోనూ ఓ మాట వేసినట్టు సమాచారం. ఇంతలోనే కమలాపురం టీడీపీ ఇంఛార్జ్‌, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి పేరు కూడా కడప టీడీపీ వర్గాల చర్చల్లో నలుగుతోంది. కమలాపురంలోనే కాకుండా కడపలోనూ తమకు అనుకూల వర్గాలు ఉన్నాయని.. రాజకీయంగా వ్యాపారపరంగా బలమైన సంబంధాలు ఉండటంతో పుత్తా గట్టిగానే పట్టుబడుతున్నారట. హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ముస్లింయేతర నాయకుల నుంచి వస్తున్న ఒత్తిళ్లపై టీడీపీ హైకమాండ్‌ ఏటు తేల్చుకోలేక పోతోందట. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి కూడా కడప తరహాలో లాబీయింగ్‌ లేదన్నది పార్టీ వర్గాల మాట. కడప నుంచి ఎవరైనా పార్టీ నేతలు వస్తే.. వాళ్లు టికెట్‌ కోసం వచ్చారేమోనని అనుమనించి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి జంకుతున్నారట. మరి.. ఈ ఒత్తిళ్ల మధ్య కడప సీటు విషయంలో టీడీపీ పెద్దలు ఏం చేస్తారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Exit mobile version