NTV Telugu Site icon

Off The Record: జేసీ వదలని ఆ హీరోయిన్‌..! వదల బొమ్మాళీ.. వదల

Jc

Jc

Off The Record: జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, టీడీపీ లీడర్‌. అంతకు మించి పొలిటికల్‌ మొండి ఘటం అని చెప్పుకుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లంతా. పట్టు పడితే ఎదురుగా ఎవరున్నా వదలరని అంటారు. గతంలో మాజీ సీఎం జగన్ ఉద్దేశించి ఆయన అన్న మాటలు చాలా దూరం వెళ్ళాయి. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ వ్యాఖ్యల ఫలితాన్ని జేసీ అనుభవించారని అంటారు పొలిటికల్‌ పండిట్స్‌. అది వేరే స్టోరీ. అంతటి మొండి ఘటాన్ని కూడా… ఇప్పుడు ఓ హీరోయిన్‌ ముప్పు తిప్పలు పెడుతున్నారట. ఏ ఉద్దేశ్యంతో అన్నారో గానీ… జేసీ నోటి నుంచి వచ్చిన ఒక మాట ఆ హీరోయిన్‌కు అస్త్రంగా మారిందట. అసలు రాజకీయాలు, వ్యాపారాలు తప్ప వేరే వ్యవహారాలు పట్టించుకోని జేసీని హీరోయిన్ వెంటాడటం ఏంటంటే.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. ఆమె బీజేపీ నాయకురాలు కూడా.

Read Also: Hamas-Israel: హమాస్ దాడి తర్వాత నెతన్యాహుకు మొదట ఫోన్ చేసి ప్రపంచ నేత ఎవరంటే..!

ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ దగ్గరికి రీల్‌ రివైండ్‌ చేయాల్సిందే. తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఇందుకు కేవలం మహిళలను మాత్రమే ఆహ్వానించి… జేసీ పార్క్‌లో నిర్వహించడం వివాదానికి దారితీసింది. ఇటీవల తాడిపత్రి ఏరియాలో గంజాయి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి అది మహిళలకు సేఫ్‌ ఏరియా కాదని, గంజాయి బ్యాచ్‌లు దాడి చేస్తే.. ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు హీరోయిన్‌ కమ్‌ బీజేపీ లీడర్‌ మాధవీలత. అందుకే మహిళలు ఆ ప్రోగ్రామ్‌కి వెళ్ళవద్దని కూడా సలహా ఇచ్చారట ఆమె. ఆ పాయింటే జేసీ టచ్‌ చేసిందట. ఠాఠ్‌… నేనేంటి… నా పరపతి ఏంటి? నేను న్యూ ఇయర్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తే వెళ్ళొద్దని చెబుతుందా? అంటూ… ఫైర్‌ ఫైర్స్‌ ద ఫైర్‌ అన్నారట ఆయన. కానీ.. అప్పటికప్పుడు నేరుగా జేసీ స్పందించలేదుగానీ… ఆయన వర్గీయులు మాత్రం సోషల్ మీడియాలో బీజేపీ మహిళా విభాగాన్ని ఏకిపారేశారు. ఆ రచ్చ అలా జరుగుతుండగానే.. అనంతపురంలో జేసీ ట్రావెల్స్‌ బస్సుకు నిప్పంటుకుంది. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదమో… మరోటో కాదని, కచ్చితంగా బీజేపీ నాయకుల పనేనని అన్న ప్రభాకర్‌రెడ్డి…దానిమీద పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయబోనని అన్నారు.

Read Also: Pune: పూణేని వణికిస్తున్న గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS).. 54 మందికి నిర్ధారణ.. ఈ వ్యాధి లక్షణాలు..

అదే ఊపులో… తాడిపత్రి న్యూ ఇయర్‌ ఈవెంట్ మీద బీజేపీ మహిళా నేత, హీరోయిన్ మాధవీలత చేసిన వ్యాఖ్యల మీద.. అప్పుడు చాలా తీవ్రంగా స్పందించారాయన. అందులో అభ్యంతరకరమైన భాష వాడటంతో… వెంటనే బీజేపీ లీడర్స్‌ కూడా రియాక్ట్‌ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బిజెపి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మంత్రి సత్య కుమార్ ఒక అడుగు ముందుకేసి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదని…భాగస్వామ్య పార్టీ నాయకుల మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. పరిస్థితి చేయి దాటిపోతోందని పసిగట్టిన జేసీ ఒక మెట్టు దిగారు. మాధవీలత విషయంలో తాను అభ్యంతరకర పదజాలం వాడటం తప్పేనంటూ అపాలజీ చెప్పారు. ఆమెను ఏదో అనాలన్న ఉద్దేశం తనకు లేదని, ఎవరి వృత్తులు వారివంటూ వివరణ ఇచ్చుకున్నారు. అప్పుడున్న ఆవేశంలో అలా మాట్లాడానని, ఆమెకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని అన్నారాయన.

Read Also: Davos Tour: సన్​ పెట్రో కెమికల్స్​ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం.. 7,000 మందికి ఉద్యోగాలు

అక్కడితో ఆ ఎపిసోడ్‌ ముగిసిపోతుందని అనుకున్నా… మాధవీలత మాత్రం వదల బొమ్మాళీ.. అంటున్నారట. అన్నట్టుగానే…. హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఛాంబర్‌కి వెళ్లి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని తక్కువ చేసి మాట్లాడిన జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నది అక్కడ ఆమె విజ్ఞప్తి. జేసీ తనను ఉద్దేశించి వాడిన పదజాలంపై సినీ పరిశ్రమకు చెందిన ఎవరైనా స్పందిస్తారని చూశానని, కానీ ఏ ఒక్కరూ రియాక్ట్‌ అవక పోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు మాధవీలత. ఇక న్యాయ పోరాటం చేస్తానంటూ ఆ తర్వాత సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాల్లో నటించే మహిళల గురించి ముందు ఇష్టానుసారం అసభ్యకరంగా మాట్లాడి… ఆ తర్వాత క్షమాపణ చెబితే సరిపోతుందా? అన్నది మాధవీలత క్వశ్చన్‌. జేసీ తీరుతో తన కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇన్ని పరిణామాల మధ్య జేసీ ఎపిసోడ్‌ రక్తి కడుతోంది. జేసీ సారీని యాక్సెప్ట్‌ చేయకుండా… నేను పట్టిందే పట్టు అంటూ మాధవీలత ముందుకు వెళ్తారా? అలా వెళ్తే… జేసీ ఏం చేస్తారన్నది ఆసక్తి కరంగా మారింది.