Site icon NTV Telugu

Off The Record: జనసేన ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?

Janasena

Janasena

Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది జనసేన. జిల్లాలోని ఆరు సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించి కంచుకోటగా నిలబడింది. అలాంటి జిల్లాలో పార్టీ అధినేత ఆశించిందొకటి.. ఎమ్మెల్యేలు చేస్తున్నదొకటి అన్నట్టుగా తయారైందట పరిస్థితి. ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జనసేన నేతలు.. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో… భవిష్యత్తు సంగతి మనకెందుకు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్నట్టు ఆత్రంగా వ్యవహరిస్తున్నారట. గీత దాటుతూ… ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు అన్నట్టుగా చేస్తున్న పనులు చూసి జనసేన నేతలే అవాక్కవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తొలిసారి అసెంబ్లీకి వెళ్ళిన వారిలో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు శాసనసభ్యుడు పత్సమట్ల ధర్మరాజు ఉన్నారు. ఇక సీనియర్ నాయకుల లిస్టులో  భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నిడదవోలు ఎమ్మెల్యే కమ్ మంత్రి కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు.

Read Also: Telangana Cabinet: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు!

సీనియర్ల సంగతి పక్కనపెడితే  పోలవరం, నర్సాపురం, ఉంగుటూరు ఎమ్మెల్యేల అనుచరులు మాత్రం దున్నేస్తున్నారన్న టాక్‌ ఉంది జిల్లాలో. ఏ పనిచేయాలన్నా, ఏ కాంట్రాక్ట్ దక్కించుకోవాలన్నా, మద్యం వ్యాపారం చేయాలన్నా… షాడోలుగా మారిన ఎమ్మెల్యేల అనుచరగణానికి భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మంచా చెడా అన్నదాంతో సంబంధం లేదు. పని ఏదైనా సరే…… ఫిక్స్‌ చేసిన పర్సంటేజ్‌ ముట్టజెపితే చాలు…. పూర్తి స్థాయిలో సహకరిస్తారట. ఆయా నియోజకవర్గాల్లో ఇది ఓపెన్‌ టాక్‌ అంటున్నారు. నరసాపురంలో MLA బొమ్మిడి నాయకర్ సోదరుడితో సహా మరికొంత మంది నేతలు ప్రతి పనికీ… ఓ రేటు ఫిక్స్ చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇటీవల సివిల్ తగాదాల్లో సైతం ఎమ్మెల్యే మనుషులు తలదూర్చి  సెటిల్మెంట్స్‌ చేయడం వివాదాస్పదమవుతున్నట్టు చెబుతున్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఏ వ్యాపారం మొదలుపెట్టాలన్నా… ముందు నాయకర్‌కు కావాల్సిన వాళ్ళని కలిస్తేనే… పనవుతుందని, వాళ్ళకు సమర్పించుకోకుంటే… ఏ పనీ చేయలేరన్న ప్రచారం జోరుగా ఉంది. మట్టి తవ్వకాల విషయంలో జనసేన నేతల ఆగడాలపై… మిత్రపక్షం టీడీపీ నాయకులే ఫిర్యాదు చేసేవరకు వెళ్ళిందంటే… పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నది లోకల్‌ వాయిస్‌. ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు, తమ సామాజికవర్గానికి చెందిన వారితో సెటిల్మెంట్స్‌లాంటి ఆరోపణలు పెరుగుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యే అయిన నాయకర్‌ సలహాదారులు, సెటిల్మెంట్ చేసే బ్యాచ్‌తో పెద్ద కోటరీనే ఏర్పాటు చేసుకున్నారని జనసేన నేతలే గుసగుసలాడుకుంటున్నారట. ఇక పోలవరం విషయంలోనూ ఇదే పరిస్థితి.

Read Also: Extramarital Affair: ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో అన్న భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!

ఎమ్మెల్యే మనుషులమంటూ కొంతమంది అక్రమాలకు తెరలేపడంతో నియోజకవర్గంలో చులకన భావం ఏర్పడుతోందని తెగమధన పడిపోతున్నారట తెలుగు తమ్ముళ్ళు. జనసేన ఎమ్మెల్యే పనులు తమకు తలవంపులు తెస్తున్నాయన్నది వాళ్ళ వాదనగా తెలుస్తోంది. మొత్తం ఏడు మండలాల్లో ఎమ్మెల్యే షాడోస్‌ని పెట్టుకుని బీభత్సంగా వసూళ్ళకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. అయితే కొన్ని విషయాలపై ఎమ్మెల్యేకు అవగాహన తక్కువ ఉందని భావిస్తున్న కొందరు చోటామోటా నేతలు ఆయన దృష్టికి తీసుకురాకుండానే పర్సనల్‌గా పనులు చక్కబెట్టుకుంటూ… అందినకాడికి దోచుకుంటున్నారట. అటు ఉంగుటూరు నియోజకరర్గంలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Extramarital Affair: ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో అన్న భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పత్సమట్ల ధర్మరాజు చుట్టూ చేరిన ఆయన సొంత సామాజికవర్గ నేతలు…. పోలీసులు, ఇతర అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని అక్రమ చేపల చెరువులు నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏడాది గడిచినా ఎమ్మెల్యేలకు కొన్ని శాఖలపై పట్టు రాకపోవడం… షాడోలకు వరంగా మారిందని, ఎమ్మెల్యేల పేరుతో వాళ్ళే ఆదేశాలిస్తూ…. తమ పబ్బం గడుపుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. తీరా అవినీతి ఆరోపణలు వచ్చేసరికి ఆ నిందలన్నీ ఎమ్మెల్యేలపై పడుతున్నాయట. ఈ విషయంలో తెలిసి కూడా వాళ్ళేమీ చేయలేకపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. డ్యామేజ్‌ జరిగిపోతున్నా… నాయకులు సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడానికి కారణాలు అనేకం ఉన్నట్టు తెలుస్తోంది. తాము పట్టుకోల్పోతే… ఆ స్థానంలో టిడిపి నేతలు ఎక్కడ అజమాయిషీ చెలాయిస్తారోనన్న భయం ఉందని, అందుకే… ఏదైతేనేం… నడిచేదేదో నడవనీ… మనది మనకి వస్తోంది కదా అనుకుంటున్నట్టు సమాచారం. కానీ… ఆ ఉదాసీనతవల్ల పార్టీకి చెడ్డపేరు వస్తున్నట్టు ఫీలవుతోంది కేడర్‌. ఈ డ్యామేజ్‌ కంట్రోల్‌కి హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.

Exit mobile version