Off The Record: గత ఎన్నికల్లో టిడిపి తరపున ఏలూరు ఎంపీ టిక్కెట్ దక్కించుకుని గెలిచారు పుట్టా మహేష్ కుమార్ యాదవ్. కడపకు చెందిన పుట్టా…. ఏలూరుకు కొత్త కావడంతో… ఎన్నికల్లో సీనియర్ లీడర్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది. అప్పుడే కొత్త నేతకు చుక్కలు చూపించిన కొందరు నేతలు ఇప్పటికి అదే పంథాలో ఉన్నారట. కొత్తకావడం, చిన్నాచితక పనులకోసం స్థానిక నాయకులపై ఆధారపడాల్సి రావడంతో ఆయన చుట్టూ చాలామంది చేరిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే అదునుగా చాలా మంది మేమంతా ఎంపీగారి తాలూకా అని చెప్పుకుని తిరుగుతుండటం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీకి కూడా తలపోటుగా మారిందట. ఈసారి చింతలపూడి, ఏలూరు, పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఫస్ట్‌టైం ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు చోటామోటా నేతలు.. మేం ఎంపీగారి తాలూకా అంటూ ఇపుడు ఎమ్మెల్యేల ముందే ఇస్తున్న బిల్డప్‌లు ఎక్కువైపోయాయని, అవి ఎంపీ ఇమేజ్‌ని కూడా దెబ్బ తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎంపీ మహేష్ ఉంటే.. ఢిల్లీలో లేదంటే తన వ్యాపారాలు చూసుకోడానికి విదేశాల్లో ఎక్కువగా ఉంటున్నారని, నియోజకవర్గంలో నెలకో రెండు నెలలకో.. సుడిగాలి పర్యటనలు చేసి మాయమవుతుంటారని సమాచారం.
Read Also: Off The Record: బావ బామ్మర్దుల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కి చేరిందా?
ఇదే అదునుగా భావించిన కొంతమంది నేతలు ఆయనతో పాటు తిరిగి ఆయన మనుషులుగా చెలామణి అవుతూ మిగతా నియోజకవర్గాల్లో అలజడి సృష్టిస్తున్నారన్నది లోకల్ టాక్. ఇదే విషయం అనేక సార్లు ఎంపీ దృష్టికి వెళ్ళడంతో… దయచేసి అలాంటి వారి మాటలు నమ్మకండి బాబోయ్ అంటూ ప్రెస్‌మీట్స్ పెట్టి మరీ చెప్పుకున్నారు. కానీ… వాళ్ళ పద్ధతి మాత్రం మారలేదు. ఇదంతా ఒక ఎత్తైయితే చింతలపూడి, ఉంగుటూరు,పోలవరం నియోజకవర్గాల్లో ఎంపీగారి తాలుకా అంటూ కొంత మంది మట్టి దోపిడీ, ఉద్యోగాలపేరుతో నిరుద్యోగులలకు టోకరాల్లాంటి పనుల్లో మునిగి తేలుతున్నారని సమాచారం. ఎంపీ పుట్టా మహేష్ పుట్టిన రోజుకో.. లేదా ఏదో పండగనాటికో ఆయన ఫోటోలతో తమ ఫోటోలను పెట్టి పెద్దపెద్ద ఫ్లెక్సీలేసుకుని హడావుడి చేసే బ్యాచ్ మరోటి ఉంది. సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న దెందులూరు, కైకలూరు, నూజివీడు పరిధిలో ఇలాంటి సమస్యలేకపోయినప్పటికి.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాత్రం ఆ ఇబ్బందులు ఎదురవుతున్నట్టు సమాచారం. వీటన్నిటినీ పట్టించుకునే అవకాశం ఎంపీకి ఉండటం లేదట. నియోజకవర్గంలో ఆయన పర్యటనంతా కేవలం రెండు మూడు రోజులకే పరిమితం కావడం.. అదికూడా సుడిగాలి షెడ్యూల్ ప్రకారమే జరుగడం తప్ప మరో కార్యక్రమానికి అవకాశంలేకపోవడంతో పుట్టా మహేష్‌ని కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం నాయకులకు ఉండటం లేదట. ఏ కార్యక్రమానికి వెళ్ళినా కనీసం స్థానిక నాయకులను పట్టించుకోకపోవడం, ఆయనకు అవసరమైన ఎలివేషన్స్ ఇచ్చే సొంత టీమ్ హడావుడి మరింత ఎక్కువ ఉంటోందని సొంత పార్టీ నేతలే ఫీలవుతున్నారట.
Read Also: Israel: ‘‘ఇస్లాం స్టడీ చేయాలి, అరబిక్ నేర్చుకోవాలి’’.. ఇజ్రాయిల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది..?
పైగా… ఎంపీ పర్యటనల్లో, ఆయన ఆఫీస్‌లోనూ సొంత మనుషుల కోటరీ ఉండటంతో.. స్థానిక నాయకులు దూరం జరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరూ స్థానికులు కాకపోవడంతో…ఎవరు నాయకులు, ఎవరు కార్యకర్తలు అన్నది తెలియక అందర్నీ గుమ్మం బయటే నిలబెట్టేస్తుండటం ఇబ్బందిగా మారుతోందట. ఆ దెబ్బకు హర్ట్ అవుతున్న కొందరు అసలు ఎంపీని కలిసే ప్రయత్నం చేయడం లేదని చెప్పుకుంటున్నారు. సిబ్బంది ఓవరాక్షన్ కారణంగా గుమ్మం దగ్గర పడిగాపులుకాసి నేను ఫలానా అని చెప్పుకోవడంకంటే కామ్‌గా ఉండటం బెటరని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సగంమంది నేతలు గమ్ముగా ఉండి పోతున్నారట. దీంతో ఏలూరు ఎంపీ పుట్టాకు, లోకల్ లీడర్స్‌కు మధ్య గ్యాప్ బాగానే పెరుగుతోందన్నది లోకల్ టాక్. ఎంపీ పట్టింపులేని తనం, కింది స్థాయిలో ఆయన సిబ్బంది ఓవరాక్షన్ కారణంగా సొంత పార్టీ నాయకులే దూరమవుతున్నారన్నది ఏలూరు టీడీపీ వర్గాల టాక్.
