గత ఎన్నికల్లో టిడిపి తరపున ఏలూరు ఎంపీ టిక్కెట్ దక్కించుకుని గెలిచారు పుట్టా మహేష్ కుమార్ యాదవ్. కడపకు చెందిన పుట్టా.... ఏలూరుకు కొత్త కావడంతో... ఎన్నికల్లో సీనియర్ లీడర్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది. అప్పుడే కొత్త నేతకు చుక్కలు చూపించిన కొందరు నేతలు ఇప్పటికి అదే పంథాలో ఉన్నారట. కొత్తకావడం, చిన్నాచితక పనులకోసం స్థానిక నాయకులపై ఆధారపడాల్సి రావడంతో ఆయన చుట్టూ చాలామంది చేరిపోయినట్టు చెప్పుకుంటున్నారు.