Off The Record: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతు ఎవరికి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: రంగారెడ్డి-హైదరాబాద్- మహబూబ్‌నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి దాఖలైన నామినేషన్ల పరిశీలన తర్వాత 21 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ సంఖ్య తగ్గుతుందో లేదో కానీ.. అధికారపార్టీ బీఆర్‌ఎస్ మద్దతు ఎవరికి అన్నది పెద్ద చర్చగా మారుతోంది. పోటీలో ఉన్న AVN రెడ్డికి బీజేపీ సపోర్ట్ చేస్తోంది. గత ఎన్నికల్లో MLCగా గెలిచి.. తర్వాత గులాబీ పార్టీలో చేరిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మరోసారి ఫీల్డ్‌లో ఉన్నారు. PRTU నుంచి చెన్నకేశవరెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన అభ్యర్థులు MLC ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే ప్రచారం ప్రారంభించేశారు. మొత్తం 29 వేల 720 మంది ఓటర్లు ఉండటంతో వారందరినీ కలిసి ఓటు అభ్యర్థించే పనిలో ఉన్నారు క్యాండిడేట్స్.
Read Also: Off The Record: సిక్కోలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులాల కుంపట్లు
Also Read
గత ఎన్నికల్లో కాటేపల్లి జనార్దన్‌రెడ్డికి గులాబీ పార్టీ మద్దతిచ్చింది. తర్వాత ఆయన గులాబీ కండువా కప్పుకొన్నా.. ఇప్పుడు పోటీ చేస్తున్నా.. ఆయనకే మద్దతు అనే ప్రకటన అధికార పార్టీ నుంచి లేదు. దీంతో BRS వైఖరి ఏంటన్నది ప్రశ్న. జనార్దన్‌రెడ్డి మాత్రం ప్రచారం ప్రారంభించేశారు. బరిలో ఉన్న PRTU నేత చెన్నకేశవరెడ్డి తప్పకుండా గెలిచి శాసనమండలిలో అడుగు పెడతాననే ధీమాతో ఉన్నారు. ఈ ఇద్దరు నాయకులు బీఆర్‌ఎస్ మద్దతు తమకే అని ప్రచారం చేసుకుంటున్నా.. అధికారిక ప్రకటన రాలేదు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చెన్నకేశవరెడ్డి వైపే పార్టీ మొగ్గు చూపుతోందనే వాదన నడుస్తోంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. దానికంటే మూడు నాలుగు నెలల ముందు జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ ఫలితం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న మూడ్ బయట పడుతుందనేది కొందరి వాదన. దాంతో టీచర్ల వైఖరి ఏంటి? ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నారు? అని ఆరా తీస్తున్నారట. దీంతోపాటే జనార్దన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డిలలో ఎవరు అధికారపార్టీ మద్దతు సంపాదిస్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బరిలో 21 మంది ఉండటంతో ఎవరు ఎన్ని ఓట్లు చీలుస్తారు? ఎక్కువ మొగ్గు ఎవరికి ఉంది అనేది కూడా కీలకంగా మారుతోంది.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!