Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Brs Party Leaders

Off The Record About BRS: బీఆర్‌ఎస్‌లో పదవుల కోసం పోటీ.. హిందీపై పట్టు కోసం నేతల కుస్తీ

Published Date :December 13, 2022 , 10:03 pm
By Sudhakar Ravula
Off The Record About BRS: బీఆర్‌ఎస్‌లో పదవుల కోసం పోటీ.. హిందీపై పట్టు కోసం నేతల కుస్తీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశవ్యాప్తంగా BRS కార్యకలాపాలు ప్రారంభించే దిశగా గులాబీ శిబిరంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యాలయం సిద్ధమైంది. ఇక జరగాల్సిన మరో ముచ్చట.. పార్టీకి కొత్త కమిటీల ప్రకటన. ఆ పనిలోనే ఉన్నారు గులాబీ దళపతి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్‌.. అందుకు తగ్గట్టుగానే పార్టీ కమిటీని వేసే పనిలో ఉన్నారు. ఆ ఫ్రేమ్‌లో పట్టేవారికే బీఆర్‌ఎస్‌ పదవులు కట్టబెడతారని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో BRS విస్తరించేందుకు ప్రత్యేకంగా కమిటీలు వేస్తారని తెలుస్తోంది. ఆ విషయం తెలుసుకున్న కొందరు గులాబీ నేతలు.. ఆ పదవులు చేజిక్కించుకునేలా ఎత్తుగడలు వేస్తున్నారట.

Read Also: Off The Record About Congress Cold War: పీసీసీలో పదవుల కీచులాట.. రేవంత్‌, ఉత్తమ్‌ మధ్య కోల్డ్‌వార్‌..!

ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలంటే.. స్థానిక భాషలపై పట్టు ఉంటే పని మరింత ఈజీ అవుతుంది. ఉత్తరాదిలో హిందీ బెల్ట్‌ ఎక్కువ కావడంతో.. ఆ భాష అనర్గళంగా మాట్లాడే పార్టీ నేతలపై గులాబీ పెద్దలు ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై మక్కువతో ఆ పదవులు చేపట్టాలని ఆశిస్తున్నవాళ్లు తమకున్న పరిచయాలతో లాబీయింగ్‌ మొదలుపెట్టారట. కొందరు టీఆర్ఎస్‌ నేతలైతే.. హిందీ భాషపై పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. ప్రత్యేకంగా ట్యూటర్లను పెట్టుకుని హిందీ నేర్చుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే కాస్తోకూస్తో హిందీ వచ్చిన నేతలు.. మరింత ప్రావీణ్యం సాధించే పనిలో నిమగ్నం అయ్యారట. వివిధ రాష్ట్రాలకు బీఆర్‌ఎస్‌ కోఆర్డినేటర్ల నియామకంతోపాటు అనుబంధంగా రైతు విభాగం కూడా ఉండబోతోందట. అంటే మరికొన్ని పార్టీ పదవులు అదనంగా లభిస్తాయి. అలాగే ఢిల్లీలో ఉంటూ పార్టీ కార్యకలాపాల నిర్వహణతోపాటు వివిధ రాష్ట్రాల్లో BRS విస్తరణ బాధ్యతలు కొందరికి అప్పగించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారట. వాటిపై త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఢిల్లీలో బీఆర్ఎస్‌ ఆఫీసు ప్రారంభం తర్వాత సీఎం కేసీఆర్‌ పార్టీ కార్యకలాపాల స్పీడ్‌ పెంచుతారని చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి పర్యటన మొదలుపెట్టి.. ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లోగానే కమిటీలు కొలిక్కి వస్తాయని.. ఆ పదవులను ఒడిసి పడితే.. రాజకీయాల్లో కొత్తగా రెక్కలు విచ్చుకుంటాయనే ఆశల్లో ఉన్నారు గులాబీ నేతలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • BRS Party
  • BRS Party Leaders
  • hyderabad
  • off the record

తాజావార్తలు

  • SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

  • Rajya Sabha: 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక.. రేసులో ఎవరున్నారంటే..!

  • Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

  • Bengal Election: వేదికపై సీఎం యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి.. వీడియో వైరల్

  • SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions