Off The Record: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే సీన్ ఉందా..? అన్ని వట్టి మాటలేనా..?
- ఈసారి అధికారం మాదేనంటున్న తెలంగాణ బీజేపీ..
- పని చేయకుండా నమ్మితే సరిపోతుందా?..
- రాష్ట్ర బీజేపీ చేసిన పెద్ద కార్యక్రమం ఏది?..
- జాతీయ పార్టీ ఊపిరి సలపనీయని ప్రోగ్రామ్స్ ఇస్తోందా?..
- లోకల్ ప్రోగ్రామ్స్ లేకుంటే కష్టమన్న అభిప్రాయం..
- ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై నిలదీతలు ఎక్కడ?..
- ప్రజా ఉద్యమాలు నిర్మిస్తేనే భవిష్యత్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో కమలం పార్టీకి మంచి వాతావరణం ఉందని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… అధికారం మాదేనంటూ ఢంకా బజాయిస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది. పవర్లోకి వస్తామన్న నమ్మకం ఉండటం ఏ పార్టీకైనా మంచిదే. కానీ… పనేమీ చేయకుండా అలా నమ్మేస్తే సరిపోతుందా? క్షేత్ర స్థాయిలో చేయాల్సిన పనులు చేయకుండా మాకు అధికారం వస్తుంది…. వస్తుంది అంటూ ప్రచారం చేసుకుంటే నిజంగా వచ్చేస్తుందా? ఈ ప్రశ్నలు వేస్తోంది ఎవరో బయటి వ్యక్తులు కాదు. స్వయంగా బీజేపీ కార్యకర్తలే. ఎప్పుడు చూసినా… జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేయడం, చేతులు దులుపుకోవడం తప్ప… రాష్ట్ర పార్టీ చేసిన పెద్ద కార్యక్రమం ఏది? ఇంతవరకు అస్సలు ఒక్క ప్రోగ్రామ్‌కైనా పిలుపునిచ్చారా? క్షేత్ర స్థాయిలో పారాడారా? జనాన్ని పోగేశారా? ఇవన్నీ చేయకుండా అధికారంలోకి వచ్చేస్తామని కలలుగంటూ కూర్చుంటే ఎలాగన్నది కేడర్ క్వశ్చన్. అయితే… అదే సమయంలో కొందరు నాయకుల ఆన్సర్ మరోలా ఉందట.
Read Also: CM Siddaramaiah: ఇంత మంది వస్తారని ఊహించలేదు.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
Also Read
అసలు జాతీయ పార్టీనే… ఊపిరి సల్పనీయకుండా ప్రోగ్రామ్స్ ఇస్తోందని, ఒకటి పూర్తవక ముందే ఇంకో కార్యక్రమం ఇస్తుంటే… ఇక ఇక్కడ ఆలోచించడానికి టైం ఎక్కడుందన్నది వాళ్ల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇన్ని కార్యక్రమాలు ఇస్తే దేన్నీ ప్రభావవంతంగా చేయలేమని కూడా అంటున్నారట. ఈ మధ్య కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్, వక్ఫ్ సవరణ చట్టం, అహల్యాబాయి జయంతి , ఆటల్ శత జయంతి, ఇప్పుడు యోగా డే, ఎన్విరాన్ మెంట్ డే, ఎమర్జెన్సీ కి 50 ఏళ్ళు, ప్రధానిగా మోడీకి11 ఏళ్ళు పూర్తి…. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర పార్టీ ఇస్తున్న కార్యక్రమాలే చాలా ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో మరో వాదనా వినిపిస్తోంది. కేంద్ర పార్టీ కార్యక్రమాలు ఇస్తుంది సరే… వాటితోనే.. మనకు సరిపోదుకదా… లోకల్‌గా, రాష్ట్ర సమస్యలను తీసుకుని జనంలోకి వెళ్ళినప్పుడే అధికార పార్టీని ఢీ కొట్టగలుగుతామని, లేదంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతామని చర్చించుకుంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం పై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నవి మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప… చేసిన దాఖలాలు ఎక్కడని ప్రశ్నిస్తోంది ఓ వర్గం.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఏదో.. నామమాత్రంగా చేశామంటే చేశామన్నట్టుగా మమ అనిపించి సర్దుకోవడం తప్ప రాష్ట్ర స్థాయి ఆందోళకు పిలుపునిచ్చిన కార్యక్రమం ఒక్కటి చూపండని కేడర్ అడుగుతున్న పరిస్థితి. జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని కాస్త తగ్గించి… తెలంగాణలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, అలా చేసినప్పుడే పార్టీ ప్రజల్లోకి వెళ్ళి అధికారం వస్తుంది తప్ప… మేం పవర్లోకి వస్తాం, వచ్చేస్తామని మాటలు చెప్పుకుంటూ తిరిగితే లాభం ఉండదన్నది కేడర్ వాయిస్. అలా లోకల్ ఇష్యూస్ తీసుకుంటే… స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కి ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. రాష్ట్ర పార్టీ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..