NTV Telugu Site icon

Off The Record: ఆ ఇద్దరు నేతలు శత్రువులయ్యారా..? ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే..!

Nzb

Nzb

Off The Record: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోధన్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మధ్య మాటల యుద్ధంతో హాట్‌ హాట్‌గా మారుతున్నాయి లోకల్‌ పాలిటిక్స్‌. బీజేపీ ఎంపీగా రెండోసారి గెలిచిన అర్వింద్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారని చెప్పుకుంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. ఇద్దరూ ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు కాబట్టి పొలిటికల్‌ సహజమేకదా అన్న డౌట్‌ రావడం కామన్‌. కానీ.. అసలు ట్విస్ట్‌ అక్కడే ఉందంటున్నారు. ఎన్నికలకు ముందు ఎత్తిపోసుకున్నారంటే ఓకే.. కానీ… అర్వింద్‌ ఫలితాల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సుదర్శన్ రెడ్డిని ఏకిపారేయడమే ఇక్కడ సబ్జెక్ట్‌ అట. ఎన్నికల్లో డబ్బులు పంచారని, ఆయన సొంత ఫ్యాక్టరీలు చూసుకోవడం తప్ప.. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకోవడం లేదని విమర్శించారు ఎంపీ.

Read Also: CM Revanth Reddy: రేపు వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు

అక్కడితో ఆగకుండా… సమయం దొరికినప్పుడల్లా మాజీ మంత్రి మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారట. ఎన్నికల ముందు చేయాల్సిన ఆరోపణలు, విమర్శలు ఫలితం వచ్చాకనే ఎందుకు చేస్తున్నారని ఆరా తీస్తున్న కొందరికి కొత్త విషయాలు బోధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓటుకు 200 నోటు పంచారని బీజేపీ విమర్శిస్తే.. మీరే 300 పంచారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారట. వాస్తవానికి అర్వింద్‌, సుదర్శన్‌రెడ్డి మధ్య పార్లమెంట్ ఎన్నికల వరకు మంచి టర్మ్స్ ఉండేవట. ఎంపీ అర్వింద్ ఎమ్మెల్యేని అంకుల్.. అంటూ సంబోధిస్తారట. డీఎస్ కుమారుడిగా ఉన్న పాత పరిచయాలతో పార్టీలు వేరైనా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలే ఉండేవన్నది ఇందూరు పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపించే మాట. కానీ.. సడన్‌గా, అదీ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ఎందుకిలా మారిపోయారంటే.. అందుకు బలమైన కారణమే ఉందన్న మాట వినిపిస్తోంది.

Read Also: Off The Record: పీసీసీ చీఫ్‌ విషయంలో హైకమాండ్‌కు క్లారిటీ వచ్చిందా..?

నిజామాబాద్ ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ క్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ బాధ్యతల్ని సీనియర్‌, మాజీ మంత్రి అయిన సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. ఇక్కడే ఇద్దరు నేతల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ దిగ్గజ నేతగా ముద్ర ఉన్న సుదర్శన్ రెడ్డి ఆయా సెగ్మెంట్లలో నేతలను ఎన్నికల టైంలో పరుగులు పెట్టించారట. అందరితో సమన్వయం చేసుకోవడంతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బోథన్‌ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికి భారీగా ఆధిక్యం సాధించడంలో సక్సెస్ అయ్యారు. సన్నిహితంగా ఉండే ఇద్దరి మధ్య తేడా కొట్టడానికి ఇదే కారణమన్నది స్థానిక పరిశీలకుల మాట. పైగా కేబినెట్‌ విస్తరణలో సుదర్శన్‌రెడ్డి బెర్త్‌ ఆశిస్తున్నారని, అందుకే కష్టపడి పనిచేసి తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేసినట్టు చెబుతున్నారు. ఆయన పొలిటికల్‌ టార్గెట్‌ కోసం ఆయన పని చేస్తే… అంకుల్‌ తనకు ఊపిరి సలపనివ్వలేదని ఫీలైన అర్వింద్‌ డైరెక్ట్‌ అటాక్‌ మొదలుపెట్టారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ముందు ముందు ఈ మాటల యుద్ధం మరింత ముదురుతుందా? లేక అంకుల్‌ అండ్‌ అబ్బాయ్‌ గతంలో లాగే మాట్లాడుకుంటారా అని ఆసక్తిగా చూస్తున్నాయి ఇందూరు రాజకీయ వర్గాలు.