Off The Record: టీడీపీలో చిన్న పోస్ట్‌ను అడ్డం పెట్టుకుని ఆ నాయకురాలు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారా..?
- విజయనగరం అశోక్ బంగ్లా వాతావరణం మారిందా?..
- ఎమ్మెల్యే అదితి హయాంలో సీన్ ఛేంజ్ అయిందా?..
- అశోక్ అనుచరుల్ని ఛోటా లీడర్స్ టార్గెట్ చేస్తున్నారా?..
- బంగ్లాలో ఇప్పుడు అనురాధ బేగం హవా నడుస్తోందా?..
- సర్వం బేగం మయం అన్నట్టుగా వ్యవహారం ఉందా?..
- అశోక్ బంగ్లాలో ఇప్పుడు సెటిల్మెంట్స్ జరుగుతున్నాయా?..
- ఎమ్మెల్యేకి సర్వస్వం నేనే అన్నట్టు అనురాధ బేగం నడిపిస్తున్నారా?..
- కబేళాల నుంచి వసూళ్ళ ఆరోపణలు నిజమేనా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: విజయనగరం టీడీపీకి అశోక్ గజపతిరాజు బంగ్లానే కేరాఫ్. అదే పార్టీ ఆఫీస్ కూడా. జిల్లా పార్టీకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఇక్కడి నుంచే జరిగిపోతుంటాయి. జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి కూడా పలువురు సీనియర్ లీడర్స్ వచ్చిపోతూ… అదో హుందాగా ఉండేదని, అయితే… అదంతా గతం అన్న టాక్ నడుస్తోంది ప్రస్తుతం ఇక్కడ. అశోక్ వారసురాలు అదితి రాజకీయాల్లోకి వచ్చాక సీన్ పూర్తిగా మారిపోయిందన్నది లోకల్ టాక్. చోటా, మోటా నాయకులు కొందర్ని వెనకేసుకుని తిరుగుతూ అదితి ఎంకరేజ్ చేస్తున్నారని, వాళ్లేమో… పేనుకు పెత్తనం ఇచ్చిన చందాన చెలరేగిపోతున్నారన్నది విజయనగరం టీడీపీ సీనియర్స్ మాట. ప్రత్యేకించి అశోక్గజపతితో కలిసి రాజకీయ ప్రయాణం చేసిన వారిని ఇప్పుడీ ఛోటా మోటా లీడర్స్ టార్గెట్ చేస్తున్నారట. ఎమ్మెల్యే అదితి వెనక తిరుగుతున్న అనురాధ బేగం అనే నాయకురాలు బంగ్లాలో సర్వం నేనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట.
పార్టీలో ఆమె స్థానం ఎక్కడంటే… పెద్ద చెప్పుకునేదేం కాదన్నది కేడర్ వాయిస్. కానీ, అంతా తానే అన్న రేంజ్లో బంగ్లాలో బిల్డప్ ఇస్తున్నారట బేగం. ఇటీవలి కాలంలో ఆమె తీరు తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఉందని, చిన్న చిన్న పంచాయితీలతో మొదలై ఇప్పుడు ఏకంగా సెటిల్మెంట్లు చేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కొత్త నాయకురాలి తీరుపై పాత నేతలంతా ఫుల్ ఫైర్‌లో ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలైన వెంటనే… గ్రామ సచివాలయాల టూర్ వేసిన బేగం తాను చెప్పిన వారికే పనులు చెయ్యాలని హుకుం జారీ చేయడం అప్పట్లో సంచలనం అయింది. ఎలాంటి హోదా లేకున్నా… సచివాలయ సిబ్బంది కుర్చీలో కూర్చోవడం, తానే ఎమ్మెల్యే అన్నట్టుగా దర్బార్ నడపడం తొలి రోజుల్లో కలకలం రేపింది. ఆ వీడియోలు బాగా వైరల్ అయి పార్టీ నుంచి వార్నింగ్స్ రావడంతో… కాస్త తగ్గినట్టు చెప్పుకున్నారు. ఇప్పుడిక పార్టీ, ప్రభుత్వం పేరు చెప్పి ఎక్కడికక్కడ బేగం దందాలు మొదలైపోయినట్టు చెప్పుకుంటున్నారు. అలాగే… స్థానికంగా ఉన్న కబేళాల నుంచి ఎమ్మెల్యే పేరు చెప్పి నెలవారీ వసూళ్ళు మొదలుపెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు టీడీపీ సీనియర్స్ విషయంలో అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని, ఐదు దశాబ్దాల పాటు అశోక్‌తో కలిసి నడిచిన వాళ్ళను సైతం పూచికపుల్లతో సమానంగా తీసి పడేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read
అశోక్ గజపతిరాజుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నాయకుడి విషయంలో బేగం అనుచిత వైఖరిపై పార్టీ శ్రేణులు భగ్గు మంటున్నాయి. ఆయనతో పాటు మరి కొందరు ముఖ్య నేతల విషయంలో కూడా ఈ షాడో ఎమ్మెల్యే ధోరణి సహించ లేనిదిగా ఉంటోందని టీడీపీ కేడరే రగిలిపోతోందట. ఈనెల 8న బంగ్లాలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగిన సందర్భంగా…. ఒక కీలక నేత, జిల్లాలోనే టీడీపీ తొలి సభ్యత్వం తీసుకున్న నాయకుడి విషయంలో అగౌరవంగా ప్రవర్తించిన తీరుతో అక్కడున్న పార్టీ నేతలంతా షాకయ్యారట. అలాగే ఇంకో సీనియర్ నాయకుడు ఐవీపీ రాజు భార్య మహిళాదినోత్సవంలో పాల్గొంటే.. ఆమెను లేపి మరీ…కుర్చీ లాకున్నారని, ఆమె సిగ్గు, అవమాన భారంతో వెనుదిరిగినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని ఎమ్మెల్యే అదితిగజపతి చూస్తూ కూడా ఏమీ అనకపోవడం ఇంకా దురణం అన్న టాక్ నడుస్తోంది విజయనగరంలో. దీంతో బేగం చర్యల వెనుక ఎమ్మెల్యే ప్రమేయం కూడా ఉండి ఉంటుందని గుసగుసలాడుకుంటోంది టీడీపీ కేడర్. అంతే కాదు…. బంగ్లాలో ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తూ… అశోక్ వెనక ఉన్న ఓ ఐదుగురు నేతలను బయటికి పంపించే కుట్రలకు కూడా తెర లేచినట్టు ప్రచారం జరుగుతోంది. షాడో ఎమ్మెల్యే విషయంలో ఏమాత్రం తాత్సారం జరిగినా ఆశోక్ గజపతి రాజు పరపతితోపాటు బంగ్లా ప్రతిష్ట కూడా మసకబారడం ఖాయమన్న ఆందోళన ఉందట లోకల్ కేడర్‌లో. ఈ విషయంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!