NTV Telugu Site icon

Off The Record: విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని వైసీపీ భావిస్తోందా..?

Vijayasai Reddy

Vijayasai Reddy

Off The Record: ఏపీ లిక్కర్ స్కాం ఎపిసోడ్‌లో రోజుకో ట్విస్ట్ ఉంటోంది. వైసీపీపై విషం చిమ్మేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారని, సిట్ విచారణకు హాజరవబోయే ఒకరోజు ముందు టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్‌తో ఆయన భేటీ అయ్యారంటూ వైసీపీ ఓ వీడియో రిలీజ్ చేయటం తాజా సంచలనం. సాయిరెడ్డికి టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని చెప్పడానికే వైసీపీ పెద్దలు ఈ వీడియోను బయటపెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు ఎప్పుడో మొదలైనా.. ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో అర్ధంగాక కాక సిట్ అధికారులు సతమతమవుతున్న టైంలో కాకినాడ సీపోర్టు కేసులో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాంకు కర్త, కర్మ, క్రియ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ మొదలు పెట్టడంతో టైటిల్స్ పడ్డాయి. ఇక ఆ తర్వాత అసలు బొమ్మ మొదలై…ప్రస్తుతం జగన్‌కు అత్యంత సన్నిహితులని చెప్పుకునే మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి దాకా వచ్చింది. లిక్కర్ కేసులో ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇందులో మిధున్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. ఇక ఈ కేసులో మిగిలింది అసలు నాయకుడేనంటూ ప్రచారం జరుగుతోంది.

Read Also: AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం..

ఎవరు అవునన్నా.. కాదన్నా.. వారం క్రితం వరకు ఈ కేసుకు సంబంధించి వైసీపీ పెద్దలంతా డిఫెన్స్‌ మోడ్‌లోనే ఉన్నారన్నది ఇంటర్నల్‌ టాక్‌. కానీ… ఇప్పుడు సడన్‌గా ఎఫెన్స్ లోకి వచ్చేసింది. నాలుగు రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టిన చేసిన జగన్… సాయిరెడ్డిపై కాస్త గట్టిగానే మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు ఆయన లొంగిపోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్‌ స్కామ్‌ పేరుతో భయపెట్టి.. బెదిరించి.. మ్యానిప్యులేట్ చేసిన తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెడుతున్నారని విమర్శించారాయన. ఇక రాజ్యసభ సభ్యునిగా మూడున్నరేళ్ళ టర్మ్ మిగిలి ఉన్నా.. చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకే సాయిరెడ్డి రాజీనామా చేశారన్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్‌కు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు జగన్‌. ఆయన ఈ మాటలు మాట్లాడిన మూడు రోజులకు వైసీపీ వీడియో రిలీజ్ చేయటం చూస్తుంటే…. విజయ సాయిరెడ్డి వ్యవహారంలో ఫుల్ క్లారిటీకి వచ్చాకే వైసీపీ అధ్యక్షుడు అలా మాట్లాడి ఉండవచ్చని భావిస్తున్నారు. టీడీపీ డైరెక్షన్‌లోనే మాజీ ఎంపీ సిట్ విచారణకు హాజరయ్యారంటూ వైసీపీ వీడియా రిలీజ్ చేయటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.

Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కొత్త ఫోటోలు.. త్రివిధ దళాధిపతుల పర్యవేక్షణ..

తాడేపల్లి… పార్క్ విల్లాలో సాయిరెడ్డి, టీడీపీ కీలక నేత టీడీ జనార్ధన్ భేటీ అయ్యారని.. ఆ తర్వాతనే తాను వచ్చిన కాకినాడ సీపోర్టు కేసు విచారణ అంశంతో సంబంధం లేకున్నా… లిక్కర్ స్కాం అంటూ మొత్తం టర్న్‌ చేశారని వైసీపీ ఆరోపించింది. పార్క్ విల్లాస్‌లోని విల్లా నెం 27కు మార్చి 11వ తేదీ సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు సాయిరెడ్డి వచ్చారని.. అదే విల్లాకు 13 నిమిషాల త‌ర్వాత సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని చెప్పే టీడీ జనార్ధన్ వచ్చారంటూ వీడియోను విడుదల చేసింది వైసీపీ. అక్కడ 45 నిమిషాల పాటు ర‌హ‌స్య మంత‌నాల జరిపారని.. ఈ కారణంగానే విచార‌ణ ముగిసిన వెంట‌నే మీడియా ముందుకు వచ్చి సాయిరెడ్డి మాట్లాడారంటూ లింక్‌ని సింక్‌ చేస్తోంది వైసీపీ. అయితే… సాయిరెడ్డిపై జగన్ మీడియా సమావేశంలో విమర్శలు చేసినా.. అట్నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆ తర్వాత టీడీపీ నేత టీడీ జనార్ధన్ ను కలిసినట్టు వస్తున్న వార్తలపై కూడా సాయిరెడ్డి వైపు నుంచి నో రెస్పాన్స్‌. అదే సమయంలో కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 కేసులు పెరుగుతున్నాయని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ లో మెస్సేజ్‌ పెట్టడంపై చర్చ జరుగుతోంది.

Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కొత్త ఫోటోలు.. త్రివిధ దళాధిపతుల పర్యవేక్షణ..

గతంలో తనపై జగన్ ఏ విమర్శ చేసినా ఎక్స్ లో రియాక్ట్ అయిన సాయిరెడ్డి.. ఈసారి మాత్రం ఎందుకు ఆ విషయంలో కామ్‌గా ఉన్నారన్న అంశాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. మరోవైపు… సాయిరెడ్డి విషయంలో ఇప్పటి వరకూ ఓ లెక్క…. ఇక నుంచి మరో లెక్క అంటోందట వైసీపీ అధిష్టానం. ఆయనకు మరికొన్ని రిటర్న్‌ గిఫ్ట్‌లు రెడీ అవుతున్నాని మాట్లాడుకుంటున్నారు వైసీపీ నాయకులు. లిక్కర్ కేసులో సడన్‌గా ఎఫెన్స్ లోకి రావటం..నాకు సంబంధం లేదని జగన్‌ సుదీర్ఘ వివరణ ఇవ్వడం, సాయిరెడ్డిని కార్నర్ చేయటం, ఒకవేళ తనను అరెస్టు చేసుకోవాలనుకున్నా రెడీగానే ఉన్నానని.. విజయవాడలోనే ఉంటానని జగన్ మాట్లాడటం, ఆ వెంటనే పార్టీ వైపు నుంచి వీడియో రిలీజ్ చేయటంలాంటివన్నీ యాధృచ్చికంగా జరిగినవి కాదని, అంతా ఒక లెక్క ప్రకారమే జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. లిక్కర్ కేసు విషయంలో వైసీపీ దూకుడుకు కారణాలేంటి.. వాళ్ళ వీడియోకు సాయిరెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.