Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Ntv Otr About Darsi Telugu Desam Party Present Situation

Darsi TDP: దర్శి టీడీపీలో కొత్తగా దుబాయ్ గోల.. పోయేదెపుడు?

Published Date :July 2, 2022 , 5:22 pm
By Ramesh Nalam
Darsi TDP: దర్శి టీడీపీలో కొత్తగా దుబాయ్ గోల.. పోయేదెపుడు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కుప్పంలో ఓడిపోయినా టీడీపీ అక్కడ గెలిచి రికార్డు సృష్టించింది. అధినేత కూడా అన్ని వేదికలపైనా ఆ గెలుపు గురించే మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా దుబాయ్‌ గోల వచ్చిపడింది. దీంతో జెట్‌ స్పీడులో దూసుకుపోతున్న పార్టీ కాస్తా ఇప్పుడు సైలెంటైంది. దీంతో తమ్ముళ్లలో ఎక్కడలేని అయోమయం ఏర్పడిందట. ఇంతకీ దర్శి టీడీపీలో దుబాయ్‌ గోల తీరేదెపుడు?

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడిపోయారట. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడినా ఆ తర్వాత తొలిసారిగా జరిగిన దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో గెలిచి ఫుల్ స్వింగ్‌లోకి వెళ్లిపోయామనుకున్నారట. కానీ టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాదుడేబాదుడు కార్యక్రమంతో, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మాత్రం జరగటం లేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుండి వైసీపీ అభ్యర్ది మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన శిద్దా రాఘవరావు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఆయన ఒంగోలు లోక్‌ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.. ఆ తర్వాత వైసీపీలో చేరారు.

Also Read

  • Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
  • OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
  • Off The Record : తీవ్ర ఆవేదనలో తణుకు జనసేన లీడర్స్, కేడర్
  • Off The Record : కవిత పార్టీలో చేరిన రాథోడ్ బాబూరావు..అసలు కారణాలేంటి ?

మరోపక్క గత ఎన్నికల్లో దర్శినుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన కదిరి బాబురావు కూడా వైసీపీలో చేరటంతో కొంతకాలం దర్శి టీడీపీ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఆ పార్టీ అధిష్టానం పమిడి రమేష్ కు పార్టీ నియోజకవర్గ భాద్యతలు అప్పగించింది. గతంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన రమేష్ ఇంఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత సమర్ధవంతంగానే పనిచేశారనే టాక్‌ పార్టీలో వచ్చింది. పైగా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కూడా సాధించారు. కుప్పంలో ఆ పార్టీ ఓడినా ఇక్కడ మాత్రం ఒన్ సైడ్ విక్టరీని సాధించగలిగింది.

టీడీపీ గెలుపుకు వైసీపీలో ఉన్న లుకలుకలు మరో కారణం అయినప్పటికీ అందివచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ ఇంఛార్జ్ రమేష్ వినియోగించుకోవటంలో సఫలమయ్యారనే టాక్‌ ఉంది. దీంతో చంద్రబాబు కూడా ప్రకాశం జిల్లా నేతలందరూ సమిష్టిగా పనిచేసి క్లిష్ట పరిస్దితుల్లో పార్టీని నిలబెట్టారని, ఏపీలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా గుర్తు చేస్తున్నారు. ఒంగోలు మహానాడులో కూడా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంత వరకూ అంతా బాగానే ఉన్నా మహానాడు తర్వాత, దర్శి నియోజకవర్గంలో గందరగోళ పరిస్దితులు ఏర్పడ్డాయట. మహానాడు కార్యక్రమ సమయంలో ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సుబ్బారావు అనే వ్యక్తి సినీనటుడు బాలకృష్ణతో కలిసి చంద్రబాబును కలవటం, అవకాశం ఇస్తే దర్శి నుండి పోటీ చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముందు చెప్పారట. ఈ విషయం దర్శి టీడీపీలో హాట్ టాపిక్ లా మారిందట..

దుబాయ్ సుబ్బారావు పేరు వినిపించగానే దర్శి టీడీపీలో గందరగోళం మొదలైందట. అదే సమయంలో పార్టీ పిలుపునిచ్చిన బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా జరగకపోవటంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం ఏర్పడింది. ఇప్పటి వరకూ ఫుల్ జోష్‌లో ఉన్నామనుకుంటున్న పార్టీ శ్రేణులకు అసలేం జరుగుతుందనే అనుమానాలు మొదలయ్యాయట.

ఈ అనుమానాలకు తగ్గట్టుగానే ఆ పార్టీ ఇంఛార్జ్ పమిడి రమేష్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదట. మహానాడు సమయంలో దుబాయ్ సుబ్బారావు పేరు సీన్‌ లోకి వచ్చిన తర్వాత రమేష్‌ అసంతృప్తిగా ఉంటున్నారని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు. మరోపక్క టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే జనసేనకు దర్శి టికెట్ కేటాయించవచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ పరిణామాల మధ్య అసలు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ? పమిడి రమేష్ సైలెంట్ అవటానికి కారణాలేంటి? దుబాయ్ సుబ్బారావు దర్శి టీడీపీలో ఎంటర్‌ అవుతున్నారా? అధినేత మనసులో అసలేముంది..అనే ప్రశ్నలతో కేడర్‌ సతమతమౌతోందని టాక్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • darsi politics
  • ntv of the record
  • Prakasam District
  • Telugu Desam Party

తాజావార్తలు

  • Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..

  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!

  • Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..

  • Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్‌గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions