Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Nandyala Tdp Politics

Nandyala TDP Politics : ప్రత్యర్థుల పోరుకంటే వాళ్లకు వాళ్లే విమర్శించుకుంటున్నారా..?

Published Date :August 13, 2022 , 11:13 am
By Premchand Chowdary
Nandyala TDP Politics : ప్రత్యర్థుల పోరుకంటే వాళ్లకు వాళ్లే విమర్శించుకుంటున్నారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nandyala TDP Politics :ఒకరు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే. ఇంకొకరు ఈసారి ఎమ్మెల్యే కావాల్సిందే అనుకుంటున్న ఓ మాజీ మంత్రి తనయుడు. ప్రత్యర్థులపై పోరుకంటే.. వాళ్లే పరస్పరం విమర్శించుకుంటున్నారట. మూడేళ్లుగా మిన్నకుండి.. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ సొంతగూటిలో సౌండ్‌ పెంచుతున్నారట. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? లెట్స్‌ వాచ్‌..!

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి పెట్టనికోటనేది ఒకప్పటి మాట. టీడీపీ నేతల మధ్యే నిత్యం పోరాటమనేది ఇప్పటి మాట. ప్రత్యర్థి పార్టీపై పోరు కంటే సొంత పార్టీలోని నేతలపైనే బాణాలు ఎక్కు పెడుతున్నారు నాయకులు. సోషల్ మీడియాలో పోస్టులు.. ఏదో సందర్భంలో పరోక్షంగా చేసిన విమర్శలను వైరల్ చేయడంలో ఫుల్‌ బిజీగా ఉంటున్నారట. ఇదంతా ఎందుకోసమనే చర్చ టీడీపీ వర్గాల్లో ఉంది. బలంగా ఉన్న పార్టీ బలహీనపడుతున్నా పట్టించుకోని నేతలు కుంపట్లు రాజేయడంతో తమ్ముళ్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.

మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల టీడీపీ ఇంచార్జ్‌. బ్రహ్మానందారెడ్డికి.. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఫరూక్ కుమారుడు ఫిరోజ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నంద్యాల టికెట్‌ను ఆశిస్తూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఫిరోజ్ వర్గం బ్రహ్మానందరెడ్డిపై ఒంటికాలిపై లేస్తోంది. ఫిరోజ్ యువసేన పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్స్‌ అమ్ముకున్నారనే ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యేపై నేరుగా బాణాలు ఎక్కు పెడుతున్నారు.

బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే ఏదో సందర్భంలో పరోక్షంగా బ్రహ్మనందరెడ్డిపై చేసిన విమర్శల వీడియోలు ఫిరోజ్‌ వర్గానికి ఇప్పుడు అస్త్రంగా మారిపోయాయి. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.. టీడీపీ నేత నారా లోకేష్ పై చేసిన విమర్శలను బీసీ జనార్దన్ రెడ్డి ప్రస్తావిస్తూ.. బ్రహ్మానందరెడ్డి పై విమర్శలు చేశారట. పాలు అమ్ముకునే వారిని లోకేష్ ఎమ్మెల్యేని చేసారంటూ జనార్దన్ రెడ్డి గతంలో చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం నంద్యాల టీడీపీలో రచ్చ అవుతున్నాయి. నంద్యాలలో టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి ఇంఛార్జ్‌ బ్రహ్మానందరెడ్డే కారణమనేది ఫిరోజ్‌ వర్గం ఆరోపణ.

కొంతకాలంగా నంద్యాలలో ఇరువర్గాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. నియోజకవర్గం క్లస్టర్ మీటింగ్‌కు తనను పిలవలేదని బహిరంగ వేదికపైనే ఫిరోజ్‌.. బ్రహ్మానందరెడ్డిపై అసంతృప్తి వెళ్లగక్కారు. దాంతో తనను రాజకీయంగా కార్నర్‌ చేస్తున్న సొంత పార్టీ నేతలకు బ్రహ్మానందరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పెద్దలు అందరిని కలుపుకొనే ముందుకు వెళ్తున్నానని.. తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని వివరణ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే. అలాగే స్థానిక నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేదిస్తుంటే.. వారి కోసం వచ్చానని చెప్పుకొచ్చారు బ్రహ్మానందరెడ్డి. నంద్యాల టీడీపీలో విభేదాలు సృష్టించాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో రాజకీయం హీట్‌ మీద ఉంది. ఆ ప్రభావం నంద్యాలలోనూ కనిపిస్తున్నా.. క్యాచ్‌ చేసుకునే పరిస్థితులో టీడీపీ నేతలు లేరు. పైగా ప్రత్యర్థులపై పోరాటం మానేసి సొంత వాళ్లపైనే ఓపెన్‌గా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం టీడీపీ నాయకులకే చెల్లిందని తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. టికెట్‌ కావాలంటే పార్టీ పెద్దలను అడగాలి కానీ.. ఇలా రోడ్డున పడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. మొత్తం మీద అధికారం కోల్పోయినా టీడీపీలో మార్పు రాదా అనే ప్రశ్న కేడర్‌లో వినిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • B.Chinnola Janardhana Reddy
  • bhuma brahmananda reddy
  • Feroze
  • Katasani Rambhupal Reddy
  • Nandyala TDP Politics

తాజావార్తలు

  • Couple: 29 ఏళ్ల మహిళ.. 36 ఏళ్ల ప్రియుడిని హోటల్‌కు పిలిచి.. గదిలో ఇలా..

  • Pawan Kalyan: అధికారులతో చర్చిస్తుండగా తీవ్ర అస్వస్థత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్..

  • AP Weather Alert: ఏపీలో డబుల్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎండలు..

  • RCB vs DC: “చిన్నస్వామిలో ‘కిల్లర్’ షో.. ఆర్సీబీ చేతిలో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న మిల్లర్.. బెంగళూరుకు షాక్!”

  • CSK Vs SRH: టాస్ గెలిచిన సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్లు..

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions