OTR: మానుకోట కాంగ్రెస్‌లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
- మహబూబాబాద్‌లో ఛైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్స్
- కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ ఛైర్పర్సన్ ఆవేదన
- మా వార్డుల్లో ఆమె పెత్తనం ఏంటంటున్న కౌన్సిలర్స్
- మున్సిపల్ ఆఫీస్ సైతం రెండుగా చీలిపోయిందా?
- సమాచారం లేకుండా ఛైర్పర్సన్ వార్డ్ టూర్స్‌పై ఆగ్రహం
- ఎమ్మెల్యే మురళీనాయక్ దగ్గరికి వెళ్ళినా తేలని పంచాయితీ
- గాంధీభవన్ దృష్టికి తీసుకువెళ్ళాలనుకుంటున్న ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: మానుకోట మున్సిపల్ పాలకవర్గం నిలువునా చీలిపోయిందా? ఛైర్పర్సన్ ఒకవైపు, కౌన్సిలర్స్ మొత్తం మరోవైపు అన్నట్టు మారిపోయిందా? పనులు, పంపకాల్లో తేడా కొట్టిందా…? అంతకు మించిన కారణాలు వేరే ఉన్నాయా? చివరికి ఎమ్మెల్యే సైతం తీర్చలేనంతగా వివాదం ఎందుకు ముదిరిపోయింది? మహబూబాబాద్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? మహబూబాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగి ఏడాది కూడా అవలేదు. అప్పుడే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ల మధ్య రచ్చ మొదలైంది. ఇక్కడి అధికార పార్టీ సభ్యులు మధ్య వర్గ విభేదాలు రోజు రోజుకు పెరుగుతూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. పనులు, పంపకాల విషయంలో ఛైర్పర్సన్, కౌన్సిలర్స్ పట్టుదలకు పోతుండటంతో… మానుకోట మున్సిపాలిటీలో ఆధిపత్య పోరు పెరుగుతోందంటున్నారు. అది క్రమంగా ముదిరి రచ్చకెక్కే స్థాయికి చేరిందట. తాను అంత ఖర్చుపెట్టి…. ఛైర్పర్సన్ అయితే.. కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు,పదవికి రాజీనామా చేస్తానంటూ ఛైర్పర్సన్ జ్యోతి తన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అదే సమయంలో వార్డుల్లో తమను కాదని ఆమె పెత్తనం చేస్తున్నారని, అది తమకు ఇబ్బందిగా మారుతోందంటున్నారు కౌన్సిలర్స్. పొజిషన్లో ఉన్న నేత కలుపుకుని పోవడం లేదన్నది కౌన్సిలర్స్ కంప్లయింట్. కలిసి నడవాల్సిన మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన వాళ్ల మధ్య సమన్వయ లోపానికి ఈ పరిస్థితులే ఉదాహరణ అంటున్నారు. మున్సిపల్ నిధుల నుంచి ప్రతీ వార్డుకు 5లక్షలు ఇవ్వగా… వాటిని త్వరగా ఖర్చుచేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. కానీ… కాంట్రాక్టర్లకు పనుల కేటాయింపుల్లో జోక్యం చేసుకోవడం, ఇందుకు అధికారులను నిందించడంతో మున్సిపల్ ఆఫీస్ కూడా రెండుగా చీలిపోయిందని చెప్పుకుంటున్నారు.
పనులు, పంపకాల కోసం పాటు ఆధిపత్యం కోసం చైర్పర్సన్, కౌన్సిలర్లు పోటీపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో పనిచేసిన చైర్మన్లను అన్ని వార్డులకు పిలిచేవారని, అక్కడ జరిగే కార్యక్రమాల్లో గౌరవించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ ప్రస్తుత ఛైర్పర్సన్ జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే డబ్బులు ఖర్చుపెట్టి పార్టీకోసం పనిచేసి తాము గెలిచామని, పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు పైసా తీసుకోకుండా చైర్‌పర్సన్‌కు మద్దతు తెలిపామని అంటున్నారు పలువురు కౌన్సిలర్లు. అంత కష్టపడితే… ఇప్పుడు తమ వార్డులో ఆమె పెత్తనం ఏంటన్నది వాళ్ళ ప్రశ్న. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వార్డుల్లోని కార్యకర్తలు, నాయకులను కలవడం, వారి ఇళ్లల్లో శుభకార్యాలకు రావడం, ఏంటంటూ ప్రశ్నిస్తున్న తీరుతో మహబూబాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే… చైర్పర్సన్ మాత్రం అనుమతులు ఇచ్చుకుంటూ పోతున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే తమ అనుచరుల నిర్మాణాల దగ్గరికి అధికారులను పంపించి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, భవనాలకు కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారట. ఇలా ఇరువర్గాల మధ్య అంతరం పెరిగి చివరకు ఎమ్మెల్యే మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా వద్దకు ఈ పంచాయితీ చేరినట్లు అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి . తనను కౌన్సిలర్లు ఇబ్బంది పెడుతున్నారని ఛైర్పర్సన్, ఆమెతో తమకు కుదరడం లేదని కౌన్సిలర్లు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్టు తెలిసింది. అక్కడ కూడా కొలిక్కి రాకపోవడంతో… ఈ పంచాయితీని నేరుగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఎమ్మెల్యే ఉన్నట్టు తెలిసింది.
Also Read
తాజావార్తలు
-
OTR: మానుకోట కాంగ్రెస్‌లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
-
UAE: యూఏఈలో బస్సు-ట్రక్కు ఢీ.. 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు!
-
School Picnic Tragedy: సరదాగా పిక్నిక్కు వెళ్లి.. ఊయల తగిలి పదేళ్ల బాలుడు మృతి.!
-
Musi River Rejuvenation : మూసీ పునరుజ్జీవానికి ముహూర్తం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!