Srikakulam Politics: సిక్కోలులో చిక్కులు తప్పవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ అధికారంలో ఉండగా ఆమెకు నెంబర్‌వన్ ఎమ్మెల్యేగా పేరు. జిల్లా పార్టీలో కీలకంగా ఉండేవారు. అప్పట్లో పొగిడి పనులు చేయించుకున్న నాయకులే ఇప్పుడు రివర్స్ అవుతున్నారట. గట్టిగానే పొగ పెడుతున్నట్టు టాక్. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? సొంత పార్టీలో ఎందుకు ఇబ్బందిగా మారింది?
గుండ శిబిరాన్ని కలవరపెడుతున్న పరిణామాలు
శ్రీకాకుళం టీడీపీలో మొదటినుంచీ రెండువర్గాలు. ఒకటి కింజరాపు కుటుంబం.. రెండోది మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వర్గం. అయినప్పటికీ తనదైనశైలిలో రాజకీయాలు నెరుపుతూ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసారు అప్పల సూర్యనారాయణ. 2014లో అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మిదేవి ఇరవైవేల ఓట్ల తేడాతో ధర్మాన ప్రసాదరావును ఓడించారు. 2019లో మాత్రం స్వల్ప తేడాతో ఓడిపోయారు. నాటి నుంచి చాపకింద నీరులా పార్టీలో అంతర్గత పోరు కోనసాగుతోందట. నియెజకవర్గం మినీ మహానాడు వేదికగా శ్రీకాకుళం టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గుండ కుంటుంబాన్ని ధిక్కరిస్తున్న రూరల్ నేతలు.. యువతకు పట్టం కట్టాలని కొత్త స్వరం అందుకున్నారు. ఈ డిమాండ్స్ గుండ శిబిరాన్ని కలవర పెడుతున్నట్టు సమాచారం.
Also Read
కింజరాపు ఫ్యామిలీ ఎత్తుగడలపై రచ్చ
గుండ ప్యామిలీకి టిక్కెట్ రాకుండా చేయటానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారంట కింజరాపు కుటుంబం. నిన్నమెన్నటి వరకూ ఎంపీ రామ్మోహన్నాయుడు వర్గం యువతకి టికెట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అచ్చెన్నాయుడి మనుషులగా మద్రపడిన కొందరు లక్ష్మీదేవికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టేశారట. దీంతో కింజరాపు ఫ్యామిలీ పేరు చెబితేనే మండిపడుతున్నారట మాజీ ఎమ్మెల్యే లక్ష్మిదేవి. శ్రీకాకుళం అసెంబ్లీలో పార్టీ పరిస్థితి ఏంటో నివేదిక ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం పరిశీలకులను నియమించినట్టు తెలుస్తోంది. లక్ష్మీదేవికి వ్యతిరేకంగా కొందరు లోకల్ లీడర్లను అచ్చెన్న అండ్ కో వెనకేసుకొస్తున్నట్టు టాక్.
అధిష్ఠానం దగ్గర తేల్చుకుంటానంటున్న లక్ష్మీదేవి
ఈ పరిణామాలపై గుర్రుగా ఉన్న గుండ కుటుంబం.. అచ్చెన్న బ్యాచ్‌పై టీడీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు సమాచారం. అక్కడే తాడోపేడో తేల్చుకుంటామని అనుచరుల దగ్గర చెబుతోందట. ఇప్పటికీ శ్రీకాకుళంలో తమకు పట్టు సడలలేదని.. తమను కాదని వేరెవరు వచ్చినా పార్టీకి ప్రతికూలతే ఎదురవుతుందని సన్నిహితుల దగ్గర అంటున్నారట. దీంతో రానున్న రోజుల్లో సిక్కోలులో టీడీపీ లోకల్ పాలిటిక్స్ ఆసక్తిగా మారతాయని కేడర్ భావిస్తోంది. ఒకవైపు అధిష్ఠానం తిరిగి పుంజుకోవాలని చూస్తుంటే.. ఇక్కడ మాత్రం ఆధిపత్యపోరాటం కేడర్‌ను కలవరపెడుతోందట. మరి.. ఈ విషయాన్ని టీడీపీ పెద్దలు గ్రహించారో లేదో అని ఒకరినొకరు ఆరా తీస్తున్నారట తెలుగు తమ్ముళ్లు.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి