Karimnagar TRS Politics : ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ లో తగ్గేదే లే అంటున్న గులాబీ లీడర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar TRS Politics : మంత్రి వర్సెస్ మాజీ మేయర్. కరీంనగర్ టీఆర్ఎస్లో ప్రస్తుతం వాడీవేడీగా ఉన్న తాజా రాజకీయం. ఓ రేంజ్లో మాటల తూటాలు పేలుతున్నాయ్. రెండు గ్రూపులు బహిరంగ సవాళ్లు చేసుకునే వరకు వెళ్లింది సమస్య. తగ్గేదే లేదన్నట్టుగా పిడికిలి బిగించడంతో ఇక్కడి గులాబీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది.
మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్. ఇద్దరూ అధికార టీఆర్ఎస్ నాయకులే అయినప్పటికీ .. ఎదురుపడితే పచ్చగడ్డి భగ్గుమనేలా ఉంటుంది పరిస్థితి. వీరి మధ్య తాజాగా కొత్త రగడ చిచ్చు పెట్టింది. అది ఎక్కడ ఆగుతుంది? ఎంత వరకు వెళ్తుంది? ఎవరు పైచెయ్యి సాధిస్తారు అనేదే స్థానికంగా వినిపిస్తున్న ప్రశ్న.
Also Read
కరీనంగర్‌లోని 49వ డివిజన్ కార్పొరేటర్ కమల్జీత్ కౌర్ భర్త సోహన్‌సింగ్.. ఓ వ్యాపారితో మాట్లాడిన ఆడియో లీకై.. లోకల్ టీఆర్ఎస్లో దుమారం రేపుతోంది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్‌పై మాజీ మేయర్ రవీందర్‌సింగ్ చేస్తున్న కుట్రగా అధికారపార్టీ నేతలు భగ్గుమన్నారు. ఏకంగా 40 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ అధిష్ఠానానికి దీనిపై ఫిర్యాదు చేయడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. కమల్జీత్ కౌర్ స్వయాన రవీందర్‌సింగ్ అన్న కుమార్తె. తాజా గొడవలో ఆమె భర్తపై మున్సిపల్ శాఖ నుంచి కేసులు పెట్టించడం ఇక్కడి ఆధిపత్యపోరును మరో మలుపు తిప్పింది. పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఆడియోలో సోహల్ సింగ్ వ్యాఖ్యలు ఉన్నాయనేది గంగుల బ్యాచ్ ఆరోపణ. మంత్రిని ఇరకాట పెట్టే లక్ష్యంతో చేస్తున్న పనులను గమనించి.. సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరోదారి చూసుకుంటామని అల్టిమేటమ్ ఇచ్చారట.
తాజా సమస్య టీఆర్ఎస్ పెద్దల వరకు వెళ్లడంతో.. మాజీ మేయర్ రవీందర్‌సింగ్ స్పందించక తప్పలేదు. ఆడియో రగడలో తనకెలాంటి సంబంధం లేదని.. మంత్రికి తనకు మధ్య ఎలాంటి పంచాయితీలు లేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్‌లోని టీఆర్ఎస్ కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు మంత్రి గంగుల పంచన చేరితే.. మరికొందరు రవీందర్‌సింగ్ శిబిరానికి మద్దతు పలుకుతున్నారట. ఈ రెండు వర్గాలే మీడియా ముందుకు వచ్చి పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. మరోసారి మేయర్ కాకపోవడానికి.. అప్పట్లో ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడానికి మంత్రి గంగులే కారణమని రవీందర్ సింగ్ వర్గం ఇప్పటికీ భావిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్‌సింగ్ రెబల్‌గా పోటీ చేశారు.
తాజా గొడవలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. జరిగిన ఘటనను టీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుందని ప్రచారం జరుగుతోంది. త్వరలో పార్టీ పెద్దలు రెండు వర్గాలతో మాట్లాడతారని సమాచారం. అసలే క్షేత్రస్థాయిలో ఒక్క క్షణం పడని రెండు వర్గాలకు అధిష్ఠానం ఎలా సర్ది చెబుతుంది? ఏం చేస్తుంది అన్నదే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక్కడి విషయాలు హైకమాండ్‌కు తెలియంది కాదు. కాకపోతే చికిత్స ఏంటన్నదే ప్రశ్న. మరి.. కరీంనగర్ టీఆర్ఎస్లో గ్రూపులకు ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్‌కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!