Site icon NTV Telugu

Off The Record: 7 నియోజకవర్గాలు ఉండగా పిఠాపురం మీదే ఆ కలెక్టర్ ఫోకస్ ఎందుకు?

Pithapuram

Pithapuram

Off The Record: సగిలి షన్మోహన్….. కాకినాడ జిల్లా కలెక్టర్‌. రాష్ట్రంలో అధికారం మారి కూటమి సర్కార్‌ వచ్చిన వెంటనే ఆయన్ని ఇక్కడకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు.గతంలో పలు విభాగాలలతో పాటు చిత్తూరు కలెక్టర్‌గా కూడా పనిచేశారాయన. అయితే ఆయన్ని కాకినాడ కలెక్టర్‌గా నియమించినటైంలోనే… ఇక్కడి నేతలతో పాటు అటు చిత్తూరు టీడీపీ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ కలెక్టర్‌గా ఉన్నప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెబితే అది చేశారన్న ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తికి ఇక్కడ ఎలా బాధ్యతలు ఇస్తారంటూ కాకినాడ టీడీపీ నేతలు అభ్యంతరపెట్టారు. అయితే అదంతా గతం. కలెక్టర్‌ సాబ్‌ ఇప్పుడు వేరే అవతారంలోకి పరకాయప్రవేశం చేసినట్టు చెప్పుకుంటున్నారు.

READ ALSO: OTR: నెల్లూరు అవిశ్వాసం కథలో రకరకాల మలుపులు.. ఎండ్‌ కార్డ్‌ వేసిన మేయర్ స్రవంతి!

అప్పుడు పెద్దిరెడ్డి మనిషని ముద్ర పడితే… ఇప్పుడు మాత్రం కేవలం డిప్యూటీ సీఎం పవన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే కలెక్టర్‌గా పని చేస్తున్నారంటూ సెటైర్స్‌ వేస్తున్నారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నిటినీ సమానంగా చూడాల్సిన కలెక్టర్‌ కేవలం ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం మీదే ఫోకస్‌ పెడుతున్నారంటే ఆయన ఉద్దేశ్యం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లా టీడీపీ నాయకుల అసంతృప్తుల కారణంగా… ఇటీవల జరిగిన బదిలీల్లోనే ఆయన్ని కూడా ట్రాన్స్‌ఫర్‌ చేస్తారని అనుకున్నారు. కానీ… అలా జరక్కపోవడంతో డిప్యూటీ సీఎం రిఫరెన్స్‌తో కంటిన్యూ అవుతుండవచ్చని మాట్లాడుకుంటున్నారు. జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలతో టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగా ఉంటున్నారట కలెక్టర్‌. ఏం చెప్పినా… చూద్దాం చేద్దామంటూ…టైం పాస్‌ చేస్తున్నారన్నది తమ్ముళ్ల ఆగ్రహం. నాకు అన్నీ తెలుసునని అనడం తప్ప… తాము చెప్పేది ఆయన వినరా అని చర్చించుకుంటున్నారు పసుపు లీడర్లు. ప్రతిసారి పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తానంటే ఎలాగన్నది వాళ్ళ క్వశ్చన్‌. మిగతా చోట్ల కూడా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ఉన్నారు కదా అంటూ గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఆయన పనితీరు కూడా అంతంత మాత్రంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కలెక్టర్స్‌ ఫైళ్ళ క్లియరెన్స్‌కు సంబంధించి సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9 వరకు డేటా కలెక్ట్ చేసింది ప్రభుత్వం. అందులో చిట్ట చివరన 26వ స్థానంలో ఉన్నారట కాకినాడ కలెక్టర్. షన్మోహన్‌ ఒక్కొక్క ఫైల్ క్లియర్ చేయడానికి 11 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టు తెలిసింది. ఫైల్స్‌ క్లియరెన్స్ అని పైకి చెబుతున్నా…ఇతరత్రా కూడా ఆయన పని అలాగే ఉందంటూ గుసగుసలాడుకుంటున్నారు కాకినాడలో. ఆ రిపోర్ట్‌ చూసిన కలెక్టరేట్‌ ఉద్యోగులు సైతం…

అంటే…. మనం రాష్ట్రం మొత్తం మీద ఆఖరి స్థానంలో ఉన్నామన్న మాట అంటూ చర్చించుకుంటున్నారు. ఆయనకు అంతకుమించిన పనులు ఏముంటాయి, సార్‌ తీరువల్ల అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు మరింత ఆలస్యం అవుతున్నాయని అనే వాళ్ళు సైతం ఉన్నారు. మిగతా జిల్లాను పట్టించుకోకుండా…. కేవలం పిఠాపురానికే ఫుల్‌టైం కేటాయిస్తే… ఇలాగే ఉంటుందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. ఆయన పని ఆయన చేస్తున్నప్పుడు ఒక కలెక్టర్‌ మరీ…. అంత ఇన్వాల్వ్ అయిపోవడం ఏంటి, ఇద్దరికీ సరిపడేంత పని అక్కడుందా అని అడిగేవాళ్ళు సైతం ఉన్నారు. పని మీద ఎవరు కలెక్టరేట్‌కు వెల్ళినా నేను పిఠాపురంలో ఉన్నాననో లేక పిఠాపురానికి సంబంధించిన మీటింగ్ లో ఉన్నాననో పొడిపొడిగా మాట్లాడేసి పంపించేస్తున్నారట. ఇది చూస్తున్న వాళ్ళంతా షన్మోహన్‌ను పిఠాపురం కలెక్టర్‌ అంటూ చమత్కరిస్తున్నారు. కేవలం డిప్యూటీ సీఎం వైపే కాదు… కాస్త మా నియోజకవర్గాల సంగతి కూడా చూడండి కలెక్టర్‌ సాబ్‌ అంటున్నారు కాకినాడ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు.

READ ALSO: Off The Record: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారా?

Exit mobile version