Site icon NTV Telugu

Off The Record: సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ మార్చారా?

Revanth

Revanth

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గేమ్‌ప్లాన్‌ మార్చారా? ఇక వాళ్లకి వీళ్ళకి వదిలేయడం ఎందుకని అనుకుంటున్నారా? అందుకే తాను డైరెక్ట్‌ అటాక్‌ మొదలుపెట్టబోతున్నారా? ఆ దిశగా ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారా? ఏ విషయంలో గేమ్‌ ఛేంజ్‌ చేయబోతున్నారు ముఖ్యమంత్రి? ఎందుకు అలా మార్చాల్సి వచ్చింది?

Read Also: Old Temples Lift: జాకీల సాయంతో వందేళ్ల నాటి ఆలయాలు లిఫ్ట్.. ఎక్కడో తెలుసా?

తెలంగాణలో పవర్‌లోకి వచ్చి ఏడాదిన్నర దాటి పోయింది. మొదట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురైనా… ఇప్పుడు మెల్లిగా పరిపాలన గాడిన పడుతోంది. సంక్షేమ పథకాల ప్లానింగ్ ముగిసింది…, ఇక గ్రౌండింగ్ మిగిలింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇక గేమ్‌ ఛేంజ్‌ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. పథకాల అమలు విషయంలో ఏదో.. చేశామంటే చేశాం… దక్కిన వాళ్ళు అదృష్టవంతులు, దక్కని వాళ్ళ ఖర్మ అన్నట్టు వదిలేయకుండా….గ్రౌండ్‌ లెవల్‌లో పూర్తిగా అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ఇక నుంచి దాని మీదనే ఫుల్‌గా ఫోకస్‌ చేయాలనుకుంటున్నారట ఆయన. ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ లాంటి వాటిపై ఎక్కువ ఫోకస్ చేసింది సర్కార్‌. రైతు భరోసాను కూడా ఇక నుంచి రైతు అవసరానికి అనుగుణంగా వేయాలని డిసైడ్ అయ్యారు. అలా అన్ని స్కీమ్స్‌ అర్హులైన అందరికీ అందేలా గట్టి చర్యలు తీసుకోవాలన్నది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఇక నుంచి తానే జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Read Also: Off The Record: మంచిర్యాలలో మంత్రికి నో ఎంట్రీ బోర్డు ఎన్నాళ్ళు?

ఇందుకు మరో కారణం కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కొందరు మంత్రులు జిల్లాల్లో యాక్టివ్‌గా ఉండటంలేదని, క్షేత్ర స్థాయి వ్యవహారాలను పర్యవేక్షించడం లేదన్న నివేదికలు అందుతున్నాయట. అదే సమయంలో… ఇటీవల జరుగుతున్న వరుస సమావేశాల్లో కొందరు మంత్రుల పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు సీఎం. జిల్లా స్థాయిలో నామినేటెడ్‌ పోస్ట్‌ల భర్తీ, పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు పదవులు లాంటి అంశాల్లో ముగ్గురు నలుగురు మంత్రులు అంత సీరియస్‌గా లేరన్న అభిప్రాయంతో ఉన్నారట ముఖ్యమంత్రి. ఇటీవల జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా ఈ అంశం మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. పదవులు భర్తీ చేయడానికి సీఎం రెడీగా ఉన్నప్పుడు మంత్రులు… PCC జాబితా ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటన్న చర్చ జరిగింది. ఈ క్రమంలోనే… ఇలాంటివాటన్నిటినీ…సెట్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళాలని సీఎం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పదే పదే చెబుతున్నా కూడా… కొందరు మంత్రుల తీరు మారకపోవడంతో… ఇక తానే రంగంలోకి దిగాలనుకుంటున్నట్టు సమాచారం.

Read Also: Nidhhi Agerwal: అగర్వాల్స్ ఏం తింటే ఇంత అందంగా ఉంటారో తెలుసా ?

స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నందున ఇంకా ఉపేక్షిస్తే… నష్టం జరుగుతుందని భావిస్తున్నారట రేవంత్‌ రెడ్డి. అందుకే ఆ ఎన్నికల లోపు వీలైనంత ఎక్కువగా జిల్లా టూర్స్‌ వేయాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక నేరుగా సీఎం రంగంలోకి దిగి…. జిల్లాల వారీగా సమీక్షలు చేసి ఇటు ప్రభుత్వ, అటు పార్టీ వ్యవహారాలను గాడిన పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కలెక్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ… బేరీజు వేసుకుంటునన్నారట సీఎం. అదే రీతిలో ఇక నుంచి పార్టీ నాయకులపై ఫోకస్ చేయబోతున్నట్టు తెలిసింది. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన ప్రకటనలు కూడా అందుకు ఊతం ఇస్తున్నాయి. వచ్చే ఎన్నికల టార్గెట్ ఫిక్స్ చేయడం.. క్యాడర్‌ని జోష్‌ మూడ్‌లోకి తీసుకురావడం లాంటి పనుల్లో సీఎం బీజీ అవబోతున్నట్టు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. దీంతో గతంలో తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన సక్సెస్‌ ఫార్ములాస్‌ మళ్ళీ తెర మీదికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version