Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Granite Danda In Prakasam District

Granite Danda: లారీలు పట్టుకుంటే లక్షలు

Published Date :February 16, 2022 , 8:40 am
By NTV WebDesk
Granite Danda: లారీలు పట్టుకుంటే లక్షలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

చేసేదే అక్రమం. ఆ అక్రమాన్ని అడ్డంగా క్యాష్ చేసుకుంటున్నారు ఆ చోటామోటా నేతలు. బిజినెస్‌ బాగుండటం.. గిట్టుబాటు అవుతుండటంతో కొత్త కొత్త ముఠాలు ఈ దందాలో చేరిపోతున్నాయి. పోటీ పెరగడంతో ఒకరి రహస్యాలను ఇంకొకరు పోలీసుల చెవిన వేస్తూ పెద్ద నేతలకు తలనొప్పిగా మారారట.

వేలకు వేలు వస్తుండటంతో కొత్త ముఠాలు ఎంట్రీ
ప్రకాశం జిల్లాలో కొత్తరకం దందాకు తెరలేచింది. ‘జిల్లా’లో తరలించే గ్రానైట్‌ లారీల నుంచి వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు వసూళ్లు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏ లారీ ఎక్కడికి బయలుదేరుతుందనే సమాచారం తెలుసుకోవడం.. దారిలో కాపు కాసేయడం డబ్బులు కొట్టేయడమే ఈ దందా. అయితే రూపాయి పెట్టుబడి లేకుండా రోజూ వేలకు వేలు వస్తుండటంతో కొత్త ముఠాలు బయలుదేరాయి. మాదంటే మాది అంటూ గొడవలు జరుగుతున్నాయి.

లారీల నిలిపివేతలో పరస్పరం దాడులు
మార్టూరు కేంద్రంగా గ్రానైట్‌ని అక్రమంగా తరించేందుకు అధికారపార్టీలో లోకల్‌ లీడర్ల మధ్య పోటీ పెరగడంతో బండారం బయటపడుతోంది. ఒకరికి చెందిన లారీల సమాచారాన్ని మరొకరు పోలీసులకు ఇస్తుండటంతో గొడవలు జరిగి పంచాయితీలు పార్టీ పెద్దల వద్దకి చేరుతున్నాయట. మార్టూరు మండలం రాజుపాలెంలో బిల్లులు లేకుండా వెళ్తోన్న ఓ వర్గానికి చెందిన లారీని మరోవర్గం నిలిపి వేయండంలో.. వ్యవహారం పరస్పరం దాడుల వరకు వెళ్లిందట.

నేతల వద్ద తమ పలుకుబడే పెట్టుబడి
గ్రానైట్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్న రెండు వర్గాల్లో ఒకరు మంత్రి బాలినేని పేరును వాడుతుండగా మరొకరు తాము పర్చూరు వైసీపీ ఇంఛార్జ్‌ రావి రామనాథంబాబు వర్గీయులుగా చెప్పుకొంటున్నారట. అయితే వారికి నిజంగా నేతలు మద్దతుగా ఉన్నారా అంటే లేదట. వీరంతా ఆ నేతల వద్ద తమకున్న పలుకుబడిని పెట్టుబడిగా పెట్టి అక్రమ దందా సాగిస్తున్నట్టు సమాచారం. ఇటీవల కోనంకికి చెందిన ఓ నాయకుడు మంత్రి బాలినేని పేరు చెప్పి అక్రమ వ్యాపారం ప్రారంభించారట. అది తెలిసి కస్సుమన్న యద్దనపూడి, మార్టూరు మండలాలకు చెందిన రామనాథంబాబు వర్గంగా చెప్పుకొంటోన్న వైసీపీ నేతలు సర్పంచ్‌ భర్తపై దాడి చేశారు. తమకు అందాల్సినవి అందడంతో పోలీసులు ఈ ఘటనలో జోక్యం చేసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

రూల్స్‌ ప్రకారం లారీకి రూ.90 వేల నుంచి రూ.1.30 లక్షల రాయల్టీ కట్టాలి..!
బల్లికురవ మండలంలో స్టీల్‌ గ్రే గ్రానైట్‌ తవ్వకాలు గతకొన్నేళ్లుగా జరుగుతున్నాయి. స్టీల్ గ్రే గ్రానైట్‌కి మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో వ్యాపారుల మధ్య పోటీ నెలకొంది. తవ్వకాల తర్వాత ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీని ఎగ్గొట్టేందుకు బల్లికురువ, మార్టూరు కేంద్రంగా ఉన్న కటింగ్‌ ఫ్యాక్టరీలకు దొంగచాటుగా రాయిని తరలిస్తున్నారట. నిబంధనల ప్రకారం ఒక్కో లారీకి 90 వేల నుంచి లక్షా 30 వేల వరకు రాయల్టీ, జీఎస్టీ కట్టాలి. ప్రభుత్వానికి ట్యాక్స్‌ ఎగ్గొట్టి గతంలో గ్రానైట్‌ రాళ్లు తరలించేందుకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేంద్రంగా ఓ ముఠా నకిలీ వే బిల్లులు తయారు చేసింది. ఆ ఘటనలో నకిలీ వేబిల్లులు తయారు చేసిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ వే బిల్లులతో దాదాపు 290 కోట్ల వ్యాపారం చేసి.. ప్రభుత్వానికి 85 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టినట్టు పోలీసులు గుర్తించారట.

లంచాలు ఇచ్చేందుకు లారీకి రూ.7 వేలు నుంచి రూ.10 వేలు వసూలు
ఆ కేసు తర్వాత రూటు మార్చిన అక్రమార్కులు గ్రానైట్‌ను తరలించేందుకు లోకల్‌గా ఒక్కో లారీకి ఏడు వేల నుంచి పదివేలు వసూలు చేస్తున్నారట. మైనింగ్‌, పోలీస్, విజిలెన్స్‌ అధికారులకు ఆ మొత్తం నుంచి సర్దుతున్నారట. లాభాలు భారీస్థాయిలో ఉండటంతో అధికారపార్టీ లీడర్లు రాత్రికి రాత్రి పదుల సంఖ్యలో లారీలను జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారట. వ్యాపారం లాభసాటిగా ఉండటంతో వారు వర్గాలుగా విడిపోవడం.. ఒకరి లారీల సమాచారాన్ని మరొకరు పోలీసులకు ఇస్తుండటంతో వ్యవహారం రచ్చకెక్కుతోందట. పట్టుకునేందుకు వచ్చిన పోలీసులకు సైతం మంత్రి బాలినేని పేరుతో పాటు రావి రామనాథంబాబు పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేక వెనక్కు వెళ్లాల్సి వస్తుందట.

లారీలు పట్టుకున్న ఖాకీలు బాగానే ఆర్జిస్తున్నారా?
ఒకటిరెండు సందర్భాలలో లారీలను పట్టుకున్న పోలీసులు బాగానే ఆర్జిస్తున్నారట. అక్రమ వ్యాపారాన్ని పోలీసులు మంత్రి బాలినేనితోపాటు రామనాథంబాబు దృష్టికి తీసుకెళ్లారట. వారు ఎటొచ్చి వ్యవహారాన్ని నడుపుతోంది వైసీపీ నేతలే కావడంతో ఏం చెప్పాలో అర్థంకాక ఇరకాటంలో పడుతున్నారట. దీంతో గ్రానైట్‌ అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు కొత్త స్కెచ్‌లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మంత్రి బాలినేని కూడా అక్రమ రవాణా విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సంకేతాలు ఇచ్చేశారట. మంత్రి చెప్పారని పోలీసులు యాక్షన్‌ మొదలుపెడతారా? తమకొచ్చే పావలా బేడాలను వదిలేసుకుంటారా? అన్నది చర్చ. కేసులు పెడితే అధికార పార్టీ నేతల నుంచి రియాక్షన్‌ ఎలా ఉంటుందో పోలీసులకు, అధికారులకు తెలియంది కాదు. అందుకే గ్రానైట్‌ అక్రమ రవాణా మూడు లారీలు.. ఆరు రాళ్లగా సాఫీగా సాగిపోతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • granite business
  • lorrrys serivice
  • LORRYS
  • off the record
  • police

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions