Off The Record: అక్కడ బావ, బామమరిది మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరిందా? ఒకరు సై అంటే… మరొకరు సై సయ్యా… అని అంటున్నారా? వయసు అయిపోయిన నీకెందుకు పార్టీ పదవి అని ఒకరంటే.. వారసుడి కోసం మరొకరు పావులు కదుపుతున్నారా? తమదికాని, ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌లో ఢీ అంటే ఢీ అంటున్న ఈ ఇద్దరు రెడ్లు ఎవరు? వైసీపీ అధిష్టానం ఎవరివైపు మొగ్గుతోంది?
Read Also: PM Modi: అప్రూవల్ రేటింగ్స్‌లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నరేంద్ర మోడీ..
కడప జిల్లా బద్వేల్ వైసీపీకి అత్యంత పట్టున్న నియోజకవర్గాల్లో ఒకటి. అలాంటి చోట ఇప్పుడు ఇన్ఛార్జ్ వార్ మొదలై… కేడర్‌లో గందరగోళం పెరుగుతోందట. 2004 ఎన్నికల్లో డీసీ గోవిందరెడ్డి మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రవేశం చేసి ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి వరకు కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన విశ్వనాధ్ రెడ్డి.. తన బావ గోవిందరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. ఇక 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్ అయింది. అటు నాయకులు కాంగ్రెస్ నుంచి వైసీపీకి షిఫ్ట్ అవడం కూడా జరిగిపోయాయి. దాంతో.. గోవిందరెడ్డికి రెండు సార్లు ఎమ్మెల్సీ ఆకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అయితే, ఆయనకు ఆరోగ్య సమస్యలు రావడంతో.. నియోజకవర్గంలో పట్టున్న విశ్వనాథ్ రెడ్డికి అదనపు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది. అదే ఇప్పుడు ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి మింగుడు పడడం లేదట. 2024 ఎన్నికల టైం నుంచి ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, ఆయన బావమరిది విశ్వనాథరెడ్డి మధ్య ఇన్ఛార్జ్ గోల మొదలైందట.
Read Also: HCA: హెచ్ సీఏ అక్రమాల పుట్ట.. సీఐడీ దర్యాప్తులో మరో భారీ స్కాం వెలుగులోకి
అయితే, ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయినా.. ఇన్నాళ్ళు పెత్తనమంతా ఎమ్మెల్సీ గోవింద రెడ్డిదే. ఎమ్మెల్సీగా, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ఆయన హవానే నడిచేది. పార్టీ అభ్యర్థి ఎవరైనా… మొత్తం తన చేతిలోనే ఉంచుకుని నడిపించిన గోవిందరెడ్డికి ఇప్పుడు బావమరిది పక్కలో బల్లెంలా మారినట్టు చెప్పుకుంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు కూడా గోవింద రెడ్డికి వ్యతిరేకంగా విశ్వనాథ్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసుకొని తాము చెప్పిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని అధినేత దగ్గర పట్టుబట్టారట. కానీ, అప్పుడు గోవింద రెడ్డికే ఓకే చెప్పిన వైసీపీ అధినేత.. ఎన్నికల తర్వాత విశ్వనాథ్ రెడ్డి వైపు మొగ్గి నియోజకవర్గ అదనపు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీన్నే ఎమ్మెల్సీ జీర్ణించుకోలేకపోతున్నట్టు చెబుతున్నారు. ఒక రకంగా అది తనకు చెక్ పెట్టినట్టు భావిస్తున్నారట ఆయన. ఆ క్రమంలోనే అలకబూనినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Read Also: UP: రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు.. డెలివరీ ఏజెంట్ల వేషంలో జువెల్లరీ షాప్‌లోకి దూరి..
వివాదం మరీ ముదిరిపోవడంతో.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగినా.. గోవింద రెడ్డి పట్టు వీడలేదని తెలుస్తోంది. ఆరోగ్యం సహకరించకున్నా.. అంత పంతం ఎందుకంటే.. వారసుడి కోసం అన్నది సమాధానం. ఒకవేళ అనారోగ్యం పేరుతో తనకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వకుంటే.. తన కొడుక్కి ఇవ్వమంటున్నారట ఆయన. కానీ, అతనికి నియోజకవర్గంలో పెద్దగా పరిచయాలు లేవని, ఆ పోస్ట్‌కు సరిపోడన్నది పార్టీ పెద్దల అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు. అందుకే అవినాష్‌రెడ్డి కూడా విశ్వనాథ రెడ్డి వైపే మొగ్గుతున్నట్టు సమాచారం. గత ఆరు నెలలుగా బావ బావమరుదుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఎమ్మెల్యే కూడా వన్ సైడ్ అయిపోయారట. విశ్వనాధ్ రెడ్డి చేపట్టే పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నట్టు సమాచారం. అదే సమయంలో….ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఓ కేంద్ర మంత్రితో హైదరాబాద్‌లో భేటీ అయ్యారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. బీజేపీ పెద్దలు కూడా బద్వేల్‌లో బలమైన నేత కోసం అన్వేషణలో ఉన్నారన్న వార్తల నడుమ ఈ ప్రచారానికి ప్రాధాన్యం చేకూరింది. బావ, బావమరిదిలో ఎవరో ఒకరిని మాత్రం కాషాయ పార్టీ లాక్కోవడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి స్థానికంగా. దీంతో బావ, బావమరిది ఆధిపత్య పోరులో చివరికి ఎవరు పైచేయి సాధిస్తారు? వైసీపీలో ఉండేది ఎవరు? పార్టీ మారిపోయేది ఎవరన్న చర్చలు ఆసక్తికరంగా బద్వేల్‌లో జరుగుతున్నాయి.
