Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Even If The Two Are In The Same Cage Will They Fall From The Beginning

Congress : ఆ ఇద్దరూ ఒకే గూటిలో ఉన్నా మొదటినుంచి పడదా..?

Published Date :June 16, 2022 , 4:55 pm
By Premchand Chowdary
Congress : ఆ ఇద్దరూ ఒకే గూటిలో ఉన్నా మొదటినుంచి పడదా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పీసీసీ మాజీ చీఫ్‌.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం ముదిరిపోయింది. 2009లోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ వరకు న్యాయపోరాటం చేసిన నాయకులు వీరిద్దరూ. అలాంటిది పదేళ్ల తర్వాత అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకరికొకరు హస్తం అందించుకుని నేస్తమయ్యారు. ఆ సమయంలో వారి మైత్రీని చూసిన వాళ్లంతా ఇద్దరూ కలిసిపోయారనే అనుకున్నారు. కానీ.. తెలంగాణలో పీసీసీ నిర్వహిస్తున్న రచ్చబండ వీరిమధ్య మరోసారి విభేదాలకు తెరతీసింది.

చేర్యాల డివిజన్‌ దూల్మిట్టలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రచ్చబండకి వెళ్తుండగా ఆయన్ని పొన్నాల వర్గీయులు అడ్డుకున్నారు. ప్రతాప్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి చేశారు. దీంతో కాంగ్రెస్‌లో జనగామ జాతర రచ్చ రచ్చగా మారిపోయింది. పొన్నాల, కొమ్మూరి మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న గొడవలు రోడ్డెక్కేశాయి. కొమ్మూరిని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్ చేయాలన్నది పొన్నాల వర్గం డిమాండ్‌. ఇదంతా కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరాటంగా శ్రేణులు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనగామ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఇద్దరు నాయకులు పోటీపడుతున్నట్టు ఓపెన్‌ టాక్‌. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

2018 ఎన్నికల సమయంలో పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య ఒక ఒప్పందం జరిగిందట. అది కూడా ఒకసారి పొన్నాల ఎన్నికల్లో నిలుచుంటే..కొమ్మూరి మద్దతివ్వడం.. వచ్చే ఎన్నికల్లో కొమ్మురి పోటీ చేయడం ఆ ఒప్పందంలోని షరతులుగా ప్రచారం చేస్తున్నారు. ఆ ఎన్నికలు అయిపోయాయి.. పొన్నాల ఓడిపోయారు. ఇప్పుడు జనగామలో కొమ్మూరి యాక్టివ్‌ కావాలని చూస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కూడా. ఇది పొన్నాల వర్గానికి రుచించడం లేదు. వచ్చే ఎన్నికల్లో పొన్నాలే పోటీ చేస్తారని కుండబద్దలు కొట్టేస్తున్నారు. దీంతో రెండు శిబిరాల మధ్య మాటల దాడి పెరిగింది. ఒప్పందానికి కట్టుబడలేదని ఒకరు.. అలాంటిదేమీ లేదని మరోవర్గం విమర్శల వేడి పెంచుతోంది. ఒకవేళ అలాంటి ఒప్పందమే జరిగి ఉంటే బయట పెట్టొచ్చుగా అనేది కొందరు పార్టీ శ్రేణుల ప్రశ్న.

ఈ వర్గపోరు ఫలితంగా జనగామ కాంగ్రెస్‌లో నేతల జాతర కొత్త పుంతలు తొక్కుతోంది. పరస్పరం దాడులు చేసుకునే వరకు తీవ్రత పెరిగింది. పొన్నాల పీసీసీ చీఫ్‌గా పనిచేసి ఉన్నారు. కొమ్మూరి మాజీ ఎమ్మెల్యే. ఇద్దరూ పార్టీలో తమ ప్రాబల్యం మేరకు పట్టు నిరూపించుకొనే పనిలో పడ్డారు. పరస్పరం ఫిర్యాదులు.. విమర్శలు.. ఆరోపణలు కామనైపోయాయి. మరి.. ఈ పంచాయితీకి పార్టీ పెద్దలు ఫుల్‌స్టాప్‌ పెడతారో లేక.. ఎన్నికల నాటికి విభేదాలు మరింత రసకందాయంలో పడాతయో చూడాలి.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • MLA Kommuri Pratap Reddy
  • PCC
  • ponnala lakshmaiah
  • telangana

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions