Site icon NTV Telugu

Off The Record: తెలంగాణలో మిత్రభేదం మొదలైందా? కాంగ్రెస్ సీపీఐ మధ్య ఏం జరుగుతుంది?

Off The Record

Off The Record

Off The Record: తెలంగాణలో కాంగ్రెస్‌, సీపీఐ మిత్రపక్షాలు. పొత్తులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలిచారు. అయితే.. అదంతా గతం. వర్తమానానికి వస్తే… ఇప్పుడిక్కడ రెండు పార్టీల మధ్య గ్యాప్‌ పెరిగినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే కూనంనేని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య తేడా వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పట్టు బిగించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించమే గ్యాప్‌నకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతకు ముందు పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్ని తీసుకుంటే…కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. అప్పుడు ఫస్ట్‌ ప్లేస్‌లో బీఆర్ఎస్, రెండో స్థానంలో సిపిఐ, చివరిగా కాంగ్రెస్‌ ఉండేవి.

READ ALSO: Off The Record: పొలిటికల్ కంపు కొడుతున్న అహోబిలం, తెలుగుదేశం నేతల హస్తం ఉందన్న గుసగుసలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు కోసం సీపీఐ గట్టిగా పట్టుబడ్డటానికి కారణం కూడా అందేనంటారు. కానీ… ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో మాత్రం సమీకరణలు మారిపోయాయి. స్నేహ పూర్వక పోటీ పేరుతో రెండు పార్టీల మద్దతుదారులు బరిలో దిగారు. ఇద్దరికీ కాస్త అటు ఇటుగా దాదాపు సమానమైన సీట్లు దక్కాయి. ఇప్పుడు ఎవరెక్కువ అన్న చర్చలు జరుగుతున్న క్రమంలో విభేదాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో సీట్లు కాంగ్రెస్‌కు అధికంగా వస్తే… ఓట్లు మాత్రం సిపిఐకి ఎక్కువ పడ్డాయట. ఈ లెక్కల్ని విడమర్చి మరీ చెబుతున్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు. కొత్తగూడెం నియోజకవర్గంలో అన్నీ కలిపి 97 పంచాయతీలు ఉంటే… 47 కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి. సీపీఐకి 33 పంచాయతీలు దక్కాయి. రాజకీయంగా గుండెకాయ వంటి విద్యానగర్ పంచాయతీలో సిపిఐ పాగా వేసింది. ఇక ఓట్ల విషయానికి వస్తే సిపిఐకి 37వేల 911, కాంగ్రెస్‌కు 33వేల 911 ఓట్లు పడ్డాయి. ఓవరాల్‌గా ఓట్లు తమకే ఎక్కువ పడ్డాయని ఎమ్మెల్యే లెక్కలు చెబుతుంటే…. గెలిచిన సీట్ల సంగతేంటన్నది కాంగ్రెస్‌ క్వశ్చన్‌. ఎన్ని ఓట్లన్నది కాదమ్మా… ఎన్ని సీట్లు గెలిచామన్నదే లెక్క అంటున్నారు కాంగ్రెస్‌ లీడర్స్‌. ఇక్కడే తేడా కొడుతోందట. ఇక నియోజకవర్గంలో అధికారులు కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెప్పినట్టే వింటున్నారని, ఆ విషయంలో వాళ్ళు పునరాలోచించుకోవాలని హెచ్చరిస్తున్నారు కూనంనేని. ఇక్కడ సిపిఐకి అప్పనంగా ఎంఎల్ఎ సీటు దక్కలేదు. మేం ఎన్నో పోరాటాలు చేశాం… జైళ్లకు కూడా వెళ్లాం. మంచి ఏదో చెడు ఏదో చూసుకోవాలంటూ పోలీసులు, అధికారులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో సంచలనం అవుతున్నాయి.

మీరు మాకు ఒక్క సీటు ఇస్తే… మేం 118 సీట్లలో ఓట్లు వేశాం. పంచాయతీ ఎన్నికలకు గుర్తులతో సంబంధం లేదు కాబట్టి… ఇండివిజువల్‌గా పోటీ చేశాం… భవిష్యత్‌లో పొత్తుపై మేమే మాట్లాడమంటూ కూనంనేని చేసిన వ్యాఖ్యలు చుట్టూ రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి. మంత్రి పొంగులేటి ఇక్కడ ఎన్నికలకు ముందు నుంచే ప్రత్యేకంగా ఆఫీస్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచే ఎంపీ రఘురామిరెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే కూనంనేనికి మధ్య గ్యాప్ బాగా పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. నడిపించేది మంత్రి పొంగులేటి అయినప్పటికి ఇక్కడ మాత్రం ప్రత్యక్షంగా రఘురామిరెడ్డి, ఎంఎల్ఎ కూనంనేని మధ్య మిత్రుల రాజకీయాలు సాగుతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే… కొత్తగూడెంలో మిత్ర భేదం ఉన్నా… ప్రతిపక్షంగా దాన్ని క్యాష్‌ చేసుకోవడంతో మాత్రం బీఆర్‌ఎస్‌ విఫలం అవుతోందంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కారు పార్టీకి కేవలం ఏడంటే ఏడే సీట్లు దక్కాయి.

READ ALSO: Off The Record: ఆ అధికారులు దొరికిందే ఛాన్స్ దండుకుందామంటూ వీర దోపిడీకి తెర లేపారా?

Exit mobile version