Off The Record: ఆ అధికారులు దొరికిందే ఛాన్స్ దండుకుందామంటూ వీర దోపిడీకి తెర లేపారా?
- 11 నెలల నుంచి పాలక మండళ్ళు లేని మున్సిపాలిటీలు..
- తెలంగాణ మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఇష్టారాజ్యం..
- కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్‌లు, కమీషన్లు..
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా వసూళ్ళు?..
- టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో అంతులేని అవినీతి..
- బంధువులు, స్నేహితుల పేరుతో కమిషనర్స్ బిల్లులు?..
- సొంత మనుషులకే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు..
- జీహెచ్‌ఎంసీ విలీన మున్సిపాలిటీల్లో లక్షల్లో గోల్‌మాల్?..
- జీహెచ్ఎంసీకి రికార్డ్‌లు సమర్పించని అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆ అధికారులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారా? దొరికిందే ఛాన్స్ దండుకుందామంటూ వీర దోపిడీకి తెర లేపారా? పొలిటికల్ మానిటరింగ్ లేక ఆఫీసర్స్ ఇష్టారాజ్యం అయిపోయిందా? బంధువులు, స్నేహితుల పేరుతో పనులు చేయించి, బిల్లులు చేసుకుంటున్నది ఎక్కడ? అసలు ఎందుకా పరిస్థితి వచ్చింది?
Read Also: PM Modi: SIR చొరబాటుదారుల్ని ఏరేస్తుంటే, దేశద్రోహులు వారిని రక్షిస్తున్నారు..
Also Read
తెలంగాణలో మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం జనవరితో ముగిసింది. చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాలన ముగిసి 11 నెలలవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 124 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్స్‌లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. దీంతో అన్ని విషయాల్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ ఆఫీసర్ ఎంత చెబితే అంతే. ఏం చెబితే అదే. ఎవ్వరైనా మరో మాట మాట్లాడడానికి వీలు లేదు. దాన్ని అడ్డం పెట్టుకుని కాంట్రాక్ట్ పనులు, ప్రభుత్వ నిధుల్ని నచ్చిన వారికి మంజూరు చేస్తూ కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మున్సిపల్ ఆదాయ వనరుల్ని పక్కన పెట్టి, ప్రభుత్వ నిబంధనల్లో ఉన్న లొసుగుల్ని అనుకూలంగా మార్చుకుంటూ అందిన కాడికి దోచుకుంటున్నారట. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, పారిశుధ్యం, రెవెన్యూ విభాగాల్లో అడ్డగోలుతనం పెరిగిపోయిందని చెప్పుకుంటున్నారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా భారీగా డబ్బులు వసూలు చేసి అక్రమాలు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
Read Also: Bhartha Mahashayulaku Vignapthi: పైసా తీసుకొని రవితేజ.. కానీ ఒక కండిషన్!
మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరిగినా చర్యలు తీసుకోవడం లేదు. అనుమతుల్లో మాత్రమే సెట్‌బ్యాక్స్ చూపిస్తూ క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటివేం ఉండటం లేదట. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నతాధికారుల సాయంతో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అందిన కాడికి దోచుకుంటున్నారన్న అభియోగాలున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తున్న వారి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, పాలక మండళ్ళు లేకపోవడంతో ప్రశ్నించే వాళ్ళే లేకుండా పోయారంటూ వాపోతున్నారు రాజకీయ నాయకులు. కొందరు మున్సిపల్ ప్రత్యేక అధికారులైతే.. తమ బంధువులకు, స్నేహితులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించి బిల్లులు డ్రా చేస్తున్నారట. సాధారణంగా మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌లో బిల్లులు అంత త్వరగా మంజూరుకావని అంటారు. ప్రతీ స్థాయిలో ఎంతో కొంత ముట్టచెప్పనిదే ఫైల్ ముందుకు కదలదు. కానీ… ప్రత్యేక అధికారుల పాలనలో మున్సిపల్ కమిషనర్లే అన్నీ చూసుకుంటూ.. కావాల్సిన వాళ్ళకు చకచకా బిల్స్ ఇచ్చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు మాజీ కౌన్సిలర్స్, కార్పొరేటర్స్.
Read Also: Bangladesh: బంగ్లా జాతీయ కవి పక్కనే రాడికల్ హాది అంత్యక్రియలు.. ఎందుకు ఇలా చేశారు?
ప్రభుత్వ కార్యక్రమాలు, డ్రైనేజీల రిపేర్లు, కొత్త సిసి రోడ్ల నిర్మాణం వంటి పనుల్ని తమ మనుషులకే ఇప్పించుకుని, డబ్బులు దండుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనం అయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అయితే ఇంకా ఘోరంగా ఉందట వ్యవహారం. ఆ 27 కార్యాలయాల్లో పాత బోర్డులు తొలగించి కొత్త బోర్డులు ఏర్పాటు చేయడానికి, వాల్ రైటింగ్స్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశారు అధికారులు. ఈ బోర్డుల పేరు మీదనే లక్షల రూపాయలు నొక్కారని ఉద్యోగులు చెవులు కొరుక్కుకుంటున్నారు. దీనికి తోడు విలీనం అయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విలీన మున్సిపాలిటీల్లోని అన్ని రికార్డులు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశించినా ఇంకా రికార్డులు అప్పగించ లేదంటే అక్రమాలకు ఆస్కారం కల్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఎంత లేటైతే ఈ అక్రమార్కులకు అంత అవకాశం కల్పించినట్టు అవుతుందని, వీలైనంత త్వరగా మున్సిపల్ పాలక మండళ్ళు ఏర్పాటయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు రాజకీయ నాయకులు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?