OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
- ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలు..
- ఓట్ల తొలగింపుపై గళం విప్పుతున్న మిగతా పార్టీలు..
- దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేస్తున్న కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నడుస్తాయా…? ప్రత్యేకించి తెలంగాణలో అసలు అలాంటి అవకాశం ఉంటుందా..? కాస్త డిఫరెంట్‌గా ఆలోచించడం సహజమేగానీ… మరీ…. ఇంత తేడాగానా…? అన్న డౌట్ కొడుతోందా? రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్ని గమనిస్తున్న ఎవ్వరికైనా ఈ ప్రశ్న రావడం సహజమేగానీ… కొన్ని వర్గాల్లో ఇలాంటి చర్చే జరుగుతోందట. ఢీ అంటే ఢీ అంటున్న రెండు పార్టీలు కలిసి నడుస్తాయన్న ఆలోచనే అసలు ఎందుకు వచ్చింది? ఏ అంశాన్ని బేస్ చేసుకుని డౌట్ కొట్టింది?
ఎస్ఐఆర్ ప్రక్రియపై దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అలాగే… తాము అధికారంలో ఉన్న తెలంగాణలో సైతం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో భారీగా ఓట్లు తొలగించేస్తున్నారంటూ బాహాటంగానే ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. బీఎల్ఏల నియామకం నుండి మొదలుకుని…సవరణ జాబితా రూపొందే వరకు అన్ని దశల్లోనూ ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు హస్తం లీడర్స్. అలాగే… మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఓట్ల తొలగింపుపై గళం విప్పుతూనే ఉన్నాయి. ఇక తెలంగాణలో బీజేపీ మినహా… మిగతా రాజకీయ పార్టీలన్నీ సర్ ప్రక్రియ పై కొంత ఆందోళనలోనే ఉన్నాయి.
Also Read
కాంగ్రెస్ అయితే… మరింత దూకుడుగా ఈ ఎపిసోడ్‌ని నడిపిస్తోంది. కొన్ని పార్టీలు అంటీ ముట్టనట్టు ఉన్నా.. మిగిలినవి సీరియస్‌గానే రంగంలోకి దిగుతున్నాయి. అటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలను… బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వాళ్ళను కలుపుకుని భారీ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్. దేశ వ్యాప్తంగా ఆందోళనలతో పాటు…… రాష్ట్రాల వారీగా లోక్‌భవన్‌ల ముట్టడికి పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో… తెలంగాణలో బీఆర్ఎస్ కలిసి వస్తుందా..? కాంగ్రెస్ వాళ్ళు కలుపుకుని పోతారా..? అనే చర్చ నడుస్తోంది. అసలది సాధ్యమేనా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట చాలామందికి.
ఐతే ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదన ఏ పక్షం నుంచీ లేదు. తెలంగాణలో …కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని సర్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. అందుకోసం గాంధీ భవన్లో అన్ని పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు కూడా. కానీ…. జాతీయ రాజకీయాలు, అక్కడి ప్రాధాన్యతల సంగతి ఎలా ఉన్నా… రాష్ట్రంలో ఉప్పు…నిప్పులాంటి కాంగ్రెస్, BRS సర్ ప్రక్రియపై కలిసి ఆందోళన చేసే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. సర్ ప్రక్రియలో బీజేపీ…brs లోపాయికారీగా కలిసి పని చేస్తున్నాయని ఆరోపిస్తోంది కాంగ్రెస్.
ఆ సంగతి ఎలా ఉన్నా…. దేశ వ్యాప్తంగా కలిసివచ్చే అన్ని శక్తులతో రోడ్డెక్కాలని కాంగ్రెస్ నిర్ణయించిన క్రమంలో… తెలంగాణలో కూడా మైత్రి ఉన్న అందరితో కలిసి ఆందోళనకు సిద్ధమవుతోంది. ఎంత అవసరం అయినా… స్టేట్‌లో రెండు పక్షాల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న క్రమంలో ఇక్కడ సర్‌కు వ్యతిరేకంగా ఇద్దరూ కలిసి అడుగులేసే ప్రసక్తే ఉండబోదని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!