మెడికల్ కాలేజీ కోసం టీఆర్‌ఎస్ నేతల మధ్యపోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లాలో నేతల మధ్య మెడికల్ కాలేజీ అంశం ప్రకంపనలు సృష్టిస్తోందా? ఎవరికి వారు తమ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నారా? అందుకు తగ్గట్టుగానే అధికార పార్టీ నేతలు పావులు కదుపుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది? ఇంతకీ ఏంటా జిల్లా? ఎవరా నాయకులు?
మెడికల్ కాలేజీ కోసం అధికార, విపక్షాలు ఉద్యమం
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
మంచిర్యాల జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అలా చెప్పారో లేదో ఇటు జిల్లాలో అధికార పార్టీ నేతలు యాక్టివ్ అయ్యారు. మెడికల్ కాలేజీని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ నేతల నుంచి డిమాండ్స్ జోరందుకున్నాయి. వీరికి ప్రాంతాల వారీగా విపక్ష పార్టీల నాయకులు జత కలుస్తున్నారు.
బెల్లంపల్లిలో ఏకంగా మెడికల్ కాలేజీ సాధన సమితి ఏర్పాటు
బెల్లంపల్లిలో అధికార, విపక్షాలు కలిసి మెడికల్ కాలేజీ కోసం ఉద్యమం చేపట్టాలని నిర్ణయించాయట. ఏకంగా మెడికల్ కాలేజీ సాధన సమితి అని పేరు కూడా పెట్టేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ నియోజకవర్గంలోనే కాలేజీ పెట్టాలని.. ఇందుకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారట. ఈ దిశగా కొన్ని వినతిపత్రాలు సిద్ధం చేసి సంబంధిత విభాగాలకు.. మంత్రులకు.. ప్రభుత్వంలోని పెద్దలకు పంపుతున్నారట స్థానిక నాయకులు. కొందరైతే ముఖ్యమంత్రికే వినతిపత్రం ఇచ్చామని.. బెల్లంపల్లికే మెడికల్ కాలేజీ వస్తుందని ప్రచారం మొదలుపెట్టేశారు.
చెన్నూరు, మంచిర్యాల ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు
ఇది చూసిన.. చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లోని ప్రజలు సైతం స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారట. ఎమ్మెల్యేలు కనిపిస్తే అదే పనిగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. ప్రజల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా.. ఉద్యమాలు చేయడానికి వారు ఇష్టపడటం లేదట. మేం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తాం. మెడికల్ కాలేజీ సాధిస్తాం అని అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారట. తమ ప్రాంతాలు ఎందుకు అనుకూలమో ప్రభుత్వ పెద్దల చెవిలో ఒక మాటగా వేసినట్టు సమాచారం.
ప్లేస్‌ను సీఎం డిసైడ్ చేశారని కొందరు ప్రచారం
మెడికల్ కాలేజీ తీసుకొస్తే హీరోలు.. లేకపోతే జీరోలా?
బెల్లంపల్లి అన్ని ప్రాంతాలకు సెంటర్‌గా ఉంటుందని చెబుతూ.. పక్క జిల్లాల ప్రజాప్రతినిధులు సైతం ఉద్యమాలకు శ్రుతి కలుపుతున్నారట. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. మెడికల్ కాలేజీ ఎక్కడ ఉండాలో ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని.. సీఎం కేసీఆర్ ఆ ప్లేఎస్‌ను ఎప్పుడో డిసైడ్ చేసేశారని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా.. జిల్లాలోని ప్రజాప్రతినిధుల మధ్య మెడికల్ కాలేజీ దూరం తెస్తోందని టాక్. అధికార పార్టీ నాయకులకు ఇది ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. కాలేజీ తీసుకొస్తే.. జనాల్లో హీరోలుగా మిగులుతామని.. మరోసారి ఎమ్మెల్యే పదవికి ఢోకా ఉండబోదని కొందరు భావిస్తుంటే.. సెంటిమెంట్‌గా మారిన ఈ అంశంలో వెనకపడితే అది రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారట ఇంకొందరు. మరి.. ఈ విషయంలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!