Site icon NTV Telugu

Off The Record: కేసీఆర్ విషయంలో రేవంత్ రివర్స్ వ్యూహం అమలు ?

Rr

Rr

Off The Record: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి వ్యూహం మార్చారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషయంలో రివర్స్ స్ట్రాటజీ అప్లయ్‌ చేస్తున్నారా? గతంలో ఆయనే అంటే… ఆయన కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించబోతున్నారా? ఎత్తులకు పై ఎత్తుల్లో దిట్టలుగా పేరున్న ఇద్దరు నాయకుల మధ్య ఈ రివర్స్‌ స్ట్రాటజీ ఏంటి? తాజాగా వస్తున్న మార్పులేంటి?

Read Also: Priyanaka Chopra: ఇక తగలబెడదామా.. మందాకిని దూకుడు మాములుగా లేదుగా..!

తెలంగాణ పాలిటిక్స్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే… ఆ తర్వాత అది క్రమంగా… రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ కేసీఆర్‌ కుటుంబం అన్నట్టుగా మారిపోయింది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్ళు ఒక లెక్క అయితే… ఆ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక మరో లెక్క అన్నట్టుగా మారిపోయింది. ఇంకా కచ్చితంగా, నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచినా… సీఎం సీట్లో రేవంత్‌రెడ్డిని ఊహించుకోలేకపోయారట కేసీఆర్‌. తన వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా…. ప్రజాభీష్టం మేరకు ఆ సీట్లో కూర్చున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా అంగీకరించాలన్న కనీస స్పృహ కూడా మాజీ సీఎంకు లేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. అది నిజమేనా అన్నట్టు ఆ తర్వాత మాట్లాడిన మాటల్లో ఆయన ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని సంభోదించలేదు. తన నోటి నుంచి ఆ మాట వస్తే… రేవంత్‌ను ఎక్కడ పెద్దవాడిని చేసినట్టు అవుతుందోనన్న భావంతో కేసీఆర్‌ ఆలా వ్యవహరించారన్న మాటలు సైతం వినిపించాయి. ఇక అసెంబ్లీలో కూడా… సీఎం సీట్లో రేవంత్‌రెడ్డి కూర్చుని ఉంటే…. తాను ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఎదురుగా ఉండటం ఇష్టం లేకే కేసీఆర్‌ అసెంబ్లీకి వెళ్ళడం లేదన్న వాదన సైతం ఉంది. రేవంత్‌ తనతో సమానం కాదన్న ఉద్దేశ్యంతోనే ప్రధాన ప్రతిపక్ష నేత సభలో కూర్చోకుండా కేటీఆర్‌, హరీష్‌రావుకు వదిలేశారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే… అదంతా గతం. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక తర్వాత సీన్‌ మొత్తం మారిపోయింది.

Read Also: SS Rajamouli: టెస్టింగ్‌ కోసం ప్లే చేసిన వీడియో లీక్‌.. ఈవెంట్లో రాజమౌళి అసహనం

ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో తిరుగులేని బలం సంపాదించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త వ్యూహానికి పదును పెట్టినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళు తన విషయంలో కేసీఆర్‌ ఏదైతే వ్యూహాన్ని అనుసరించారో… ఇక నుంచి తాను కూడా రివర్స్‌ స్ట్రాటజీలో అదే పని చేయబోతున్నట్టు చెప్పకనే చెప్పారు. గతంలో తన పేరు ఉచ్చరించడానికి కూడా కేసీఆర్‌ ఇష్టపడలేదన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి… ఇప్పుడు తాను కూడా కేసీఆర్‌ని చాలా లైట్‌ తీసుకుంటున్న సంకేతాలిచ్చారు. యాక్టివ్‌ పాలిటిక్స్‌లో లేని వ్యక్తి గురించి మనమేం మాట్లాడతాం. ఆయన మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక మాట్లాడుకుందాం అంటూ…. ప్రస్తుతం కేసీఆర్‌ తెర మరుగైన రాజకీయ నాయకుడని చెప్పకనే చెప్పేశారు. అలాగే… మాజీ సీఎం ఆరోగ్యం కూడా సరిగా లేదని అనడం ద్వారా… మేం ఇద్దరం సమానం కాదని, కేసీఆర్‌ని తాను చాలా లైట్‌గా తీసుకుంటున్నానని పరోక్షంగా చెప్పినట్టయిందన్న విశ్లేషణలున్నాయి.

Read Also: Delhi Terror Blast: ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్‌ బయటకు.. వెన్నులో వణుకు పుట్టించే పేలుడు దృశ్యాలు

జూబ్లీహిల్స్‌ ఫలితం వెలువడ్డాక జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ మాటలనడం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ సబ్జెక్ట్‌ అయింది. పనిలో పనిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అహంకారం తగ్గించుకోమని, హరీష్‌రావుకు అసూయ తగ్గించుకోమంటూ సూచన చేశారు సీఎం. వాళ్ళిద్దరి సంగతి ఎలా ఉన్నా…. మీడియా సమావేశంలో కేసిఆర్‌ పేరు తీసుకు రావడానికి, ఆయన విషయంలో కామెంట్‌ చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపకుండా…సీఎం కొత్త స్ట్రాటజీ ప్లే చేశారన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ఆయన గురించి మాట్లాడదామని అన్నారంటే… గతంలో వాళ్ళు తన విషయంలో అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు తాను అనుసరిస్తున్నట్టు చెప్పేసినట్టయిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version