Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?
- చోడవరంలో మూడుసార్లు గెలిచిన KSNSN రాజు
- ఈసారి గెలిచాక ఎమ్మెల్యే వైఖరి మారిందని పార్టీ టాక్
- వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యం అంటూ తమ్ముళ్ళ ఆవేదన
- ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆధిపత్య పోరు
- అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబుతో విభేదాలు
- 2024లో తాతయ్య బాబుకు టిక్కెట్ గ్యారంటీ అన్న ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ సీనియర్ ఎమ్మెల్యే అయినోళ్ళకు ఆకుల్లోనూ, కాని వాళ్ళకు కంచాల్లోనూ వడ్డిస్తున్నారా….? జెండా మోసింది మేమైతే….. జమా ఖర్చులు చూసేది వేరావాళ్ళా అంటూ పాత టీడీపీ సీనియర్స్ కారాలు మిరియాలు నూరేస్తున్నారా…?. ఈ లెక్కల తేడాలే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టీడీపీ ప్రెసిడెంట్‌కు మధ్య మంట పెట్టాయా? టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ ఎక్కడ నడుస్తోంది? కొత్త కుంపట్లతో లాభ నష్టాల సంగతేంటి?
అనకాపల్లి జిల్లా చోడవరం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ అభ్యర్ధుల కంటే పార్టీ జెండాకే జై కొడతారు. 2009,2014,2024లో ఇక్కడి నుంచి గెలిచారు పార్టీ సీనియర్ నేత KSNSN రాజు. వైరి వర్గాలతో కూడా సౌమ్యంగా ఉంటారని పేరున్న ఎమ్మెల్యే….ఈ దఫా పొలిటికల్ స్ట్రాటజీని మార్చడం అంతర్గతంగా అగ్గి రాజేస్తోందట. కూటమి పార్టీలను సమన్వయం చేసుకోవడం కంటే సంస్ధాగతంగా బలమైన శక్తిగా ఎదిగేందుకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన కలిసి ఐదేళ్ళపాటు పోరాడినా… ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు ఎమ్మెల్యే ఆశ్రయం కల్పించడమే కాకుండా తమ మీద ఆజమాయిషీ చేసే స్ధాయికి తెచ్చారనే ఆవేదన ఎక్కువవుతోంది. ఈ క్రమంలో నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కుతుండగా ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారాలు మారుతున్నాయని అంటున్నారు.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఎమ్మెల్యే పెద్దరికం ప్రదర్శిస్తున్నా… ఆయన వర్గం మాత్రం మిగిలిన వాళ్ళతో ఓ ఆట ఆడేస్తోందనే ఫిర్యాదు లు హైకమాండ్‌కు వెళ్తున్నాయట. దీంతో చోడవరం టీడీపీ గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు., ఎమ్మెల్యే వర్గం మధ్య విభేదాలు ఇటీవల మరోసారి బహిర్గతం అయ్యాయి. వడ్డాది గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం దగ్గర తలెత్తిన మాట పట్టింపులు పోలీసులు మోహరింపు వరకు వెళ్ళింది. అక్కడితో ఆగకుండా ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా కనిపించిన కేఎస్ఎన్ ఎస్ రాజు…..అనూహ్యంగా రేసులోకి వచ్చారు. దీంతో సీటు గ్యారెంటీ అని భావించి ప్రచారానికి సిద్ధమైన తాతయ్య బాబుకు షాక్ తప్పలేదు. బలమైన కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉన్న ఈ స్ధానంలో టీడీపీకి జనసేన ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ అయింది. బలమైన కూటమి గాలిలో రాజు విజయం సాధించగా…. తాతయ్య బాబుకు పార్టీ జిల్లా ప్రెసిడెంట్‌తో పాటు కీలకమైన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది.
మొదట్లో అంతా సవ్యంగా కనిపించినప్పటికీ… మెల్లిగా ఆధిపత్య పోరు మొదలైంది. ఇలాంటి పరిస్ధితులు జనసేన ఎమ్మెల్యేలు గెలిచి….టీడీపీలో సీనియర్స్ వున్న దగ్గర కనిపిస్తుండగా….. చోడవరంలో మాత్రం సైకిల్ వెర్సస్ సైకిల్ అన్నట్టుగా మారింది. కొద్దిరోజుల క్రితం పెద్ద మదీనా గ్రామంలో జనసేన, టీడీపీ వర్గాలు యుద్ధ వాతావరణం స్రుష్టించాయి. కొండపోరంబోకులో వున్న చెట్ల వేలం దగ్గర ఎమ్మెల్యే వర్గం….జనసేన వర్గం తన్నుకున్నాయి. ఇప్పుడు సిమెంట్ రోడ్డు దగ్గర మొదలైన ప్రోటోకాల్ పంచాయితీ పెద్దదైంది.
సుమారు 55 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం ఎమ్మెల్యే వర్గీయులు చేపట్టారు. తన స్వగ్రామంలో జరుగుతున్న అభివ్రుద్ధి పనులకు ఆహ్వానం లేకపోవడంతో జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు కినుక వహించారు. ఆయన అనుచరులు వెళ్ళి పనుల్ని అడ్డుకున్నారు. ఇది ముమ్మాటికీ జిల్లా అధ్యక్షుడికి జరిగిన అవమానమేనని….ఎమ్మెల్యే సమాధానం చె ప్పాలని ఆయన వర్గం అలిగి కూర్చుంది. మరోవైపు ఈ లెక్కన చూ స్తే…. జిల్లా అధ్యక్షుడు అభివృద్ధికి ఆటంకంగానే భావించాల్సి వుంటుందంటూ ఎమ్మెల్యే వర్గీయులు ప్రచారం చేయడంతో వ్యవహారం ముదిరి పాకానపడింది. అయితే…. ఎమ్మెల్యే వెర్సస్ జిల్లా ప్రెసిడెంట్ ఫైటింగ్ కొ త్త కాదని, గతంలో ఏకంగా కటౌట్లు వేసుకునే వరకూ విభేదాలు వెళ్ళాయంటూ గుర్తు చేసుకుంటున్నాయి చోడవరం టీడీపీ వర్గాలు. మరోవైపు ఎమ్మెల్యే ఇటీవల అనుసరిస్తున్న విధానాల కారణంగానే సమస్యల జటిలమవుతోందంటూ ప్రచారాన్ని విస్త్రుతం చేసింది టీడీపీలోని మరో వర్గం.
నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా వున్న వాళ్ళకే నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు దక్కుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఇటీవల జిల్లా అధ్యక్షుడు కూడా పావులు కదుపుతున్నారట. KSNSN ఎంపిక చేసిన నలుగురు మండల అధ్యక్షుల నియమాకాన్ని జిల్లా అధ్యక్షుడి హోదాలో తాతయ్య బాబు పక్కన బెట్టేయడంలో సక్సెస్ అయ్యారు. పోటీగా ఎమ్మెల్యేవ్యూహం పన్ని పరువు నిలబెట్టుకున్నా…..ఆధిపత్యం అసలు సమస్యగా మారిందనేది బహిరం గంగానే కనిపిస్తోంది. అటు నియోజకవర్గంలో ఉన్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ ఇటీవల మూతపడింది. ప్రజలకు రహదారులు, తాగునీరు సహా అనేక సమస్యలున్నాయి. వాటన్నిటినీ గాలికొదిలేసి అధికార పార్టీలోని రెండు వర్గాలు ఇలా కుమ్ములాడుకుంటుంటే…భవిష్యత్ పరిణామాలు వేరేలా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది టీడీపీ కేడర్.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!