వకీల్‌సాబ్ కు చంద్రబాబు వకాలత్..బాబు రియాక్షన్‌తో కొత్త సందేహాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వకీల్‌సాబ్‌కు గట్టిగానే వకాలత్ పుచ్చుకున్నారు టీడీపీ అధినేత. రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో ప్రయణిస్తున్న తర్వాత చంద్రబాబు ఎంచుకున్న ఈ లైన్ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎపిసోడ్‌ను రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరని భావించాలా? తిరుపతి ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తున్న కొత్త నేపథ్య సంగీతాన్ని ఎలా చూడాలి?
భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పవన్‌పై కర్చీఫ్ వేశారా?
Also Read
వకీల్‌సాబ్ సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో చంద్రబాబు స్పందన ఇది. వాస్తవానికి తీవ్ర దుమారం రేపిన ఈ అంశంపై చిత్రానికి సంబంధించిన వాళ్లు ఎవరూ రియాక్ట్ కాలేదు. హీరో పవన్ కల్యాణ్ సైతం పెదవి విప్పింది లేదు. కానీ.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని భుజనకెత్తుకున్నారు టీడీపీ అధినేత. ఆయన వైఖరిని చూసిన వాళ్లంతా వకీల్‌సాబ్ విషయంలో చంద్రబాబు దూకుడుగా ఉన్నారు అని అనుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పవన్ కల్యాణ్‌కు ఏదైనా కర్చీఫ్ వేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
బాబు రియాక్షన్ ముందు బీజేపీ నేతల స్పందన తేలిపోయిందా?
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతు ఇచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్. బీజేపీ, జనసేన మిత్రపక్షాలు గా ఉన్నాయి. రత్నప్రభకు సపోర్ట్‌గా తిరుపతిలో పాదయాత్ర చేశారు.. బహిరంగ సభ నిర్వహించారు జనసేనాని. ఈ స్థాయిలో రెండు పార్టీలు వేర్వేరుమార్గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో చంద్రబాబు వకీల్‌సాబ్ గురించి మాట్లాడటమే ఆసక్తి కలిగిస్తోంది. టికెట్ రేట్ల పెంపు విషయంలో బీజేపీ నేతలు కూడా స్పందించారు. కానీ.. టీడీపీ అధినేత రియాక్షన్ ముందు కమలనాథులు తేలిపోయారనే టాక్ ఉంది.
తాజా ఎపిసోడ్‌పై వైసీపీ బ్యాటింగ్ మొదలైందా?
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కాకుండా.. సాధారణ సందర్భం అయి ఉన్నట్టయితే.. వకీల్‌సాబ్‌పై చంద్రబాబు రియాక్షన్‌ను పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఏపీ రాజకీయాల్లో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక వేడి రాజేస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రత్యర్థి పార్టీ నేత సినిమా గురించి చంద్రబాబు నిగ్గదీసి అడగటం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారపార్టీ వైసీపీ వెంటనే యక్షన్లోకి దిగిపోయింది. ఎవరు ఏ పార్టీయో.. ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారో తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు వైసీపీ నాయకులు.
మెగాబ్రదర్ సన్నాయి నొక్కులు?
మొత్తానికి సమస్య పొలిటికల్ కలర్ ఇచ్చుకుంది. సినిమాను సినిమాగానే చూడాలని అనుకున్నారో ఏమో.. మెగా బ్రదర్ నాగబాబు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. సీఎం జగన్‌కు తెలిసి సినిమా టికెట్ల పెంపును అడ్డుకుని ఉండబోరని తనదైన శైలిలో ఓ కామెంట్ పాస్ చేశారు.
పంచాయతీ, పురపోరులో జనసేనకు కొన్నిచోట్ల టీడీపీ మద్దతు?
రాజకీయ రగడను కాసేపు పక్కన పెడితే.. చంద్రబాబు వకీల్‌సాబ్ సినిమాకు వకాలత్ పుచ్చుకోవడం వెనక బలమైన వ్యూహం ఉందన్న టాక్ వినిపిస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల ఓపెన్‌గానే జనసేనకు టీడీపీ నేతలు సపోర్ట్ చేశారు. గతంలోలా జనసేనాని పై విమర్శలు లేవు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చాక.. కొన్నాళ్లపాటు బంధం సజావుగానే సాగింది. జనసేనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. మధ్యలో రాజకీయ వైరుధ్యాలు వచ్చాయి. మళ్లీ పవన్ కల్యాణ్‌తో కలిసి నడవాలని అనుకుంటున్నారో ఏమో మాజీ సీఎం స్వయంగా రంగంలోకి దిగారని అనుకుంటున్నారు. మరి.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక.. వకీల్‌సాబ్ సినిమా ఎలాంటి రాజకీయ స్క్రిన్‌ప్లే రచిస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
Tumbbad 2: హారర్ ప్రపంచంలోకి ఆలియా భట్.. ‘తుంబాడ్ 2’లో కీలక పాత్ర ఖరారు!
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!