Off The Record: తెలుగుదేశం పార్టీ లీగల్‌సెల్‌లో లుకలుకలు తీవ్ర స్థాయికి చేరాయా? ఆధిపత్య పోరులో ఏకంగా అడ్వకేట్ జనరల్‌నే టార్గెట్ చేశారా? జరుగుతున్న పరిణామాలు, పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు హాఫ్ బాయిల్డ్ నాలెడ్జ్‌తో దమ్మాలపాటి మీద దుష్ప్రచారం మొదలుపెట్టారా? ఏ విషయంలో సదరు సెమీ కుక్‌డ్ టీమ్ ఏజీని టార్గెట్ చేసింది? దానిపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?
Read Also: Krishna Janmashtami 2025: కృష్ణుడి ఎనిమిది మంది భార్యల పేర్లు ఇవే..
ప్రముఖ న్యాయవాది, ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌కి, టిడిపికి మధ్య దూరం పెరిగిందని, ఆయన ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఒక వర్గం చేస్తున్న దుష్ప్రచారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తునకు సంబంధించి సిట్ నుంచి దమ్మాలపాటి సమాచారాన్ని సేకరించి, దాన్ని వైసిపి లీగల్ టీంకి చేర వేస్తున్నారంటూ పార్టీ లీగల్ టీంలో ఆయన వ్యతిరేక వర్గం విపరీతమైన దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది. దమ్మలపాటి శ్రీనివాస్ అసిస్టెంట్ అప్పసాని ధీరజ్ ఈ సమాచారాన్ని వైసిపి లీగల్ టీం కి చేరవేశాని టిడిపిలో ఒక వర్గం పనిగట్టుకుని ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా లిక్కర్ కేస్ విషయంలో దమ్మాలపాటి వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని…. టిడిపి లీగల్ సెల్లో కొందరు ఫిర్యాదు చేశారు కూడా. ఏపీ బ్రేవరేజెస్ మాజీ కమిషనర్ వాసుదేవ రెడ్డి లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారుతూ గతంలో వేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకునే ప్రయత్నంలో ఉండగా, దమ్మాలపాటి కౌంటర్ పిటిషన్ వేయకుండా చోద్యం చూస్తున్నారని టిడిపి లీగల్ టీం లో ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు లిక్కర్ కేస్ కి సంబంధించి సిట్ నుంచి ఎప్పటికప్పుడు దమ్మాలపాటి సమాచారం తెప్పించుకోవాల్సిన అవసరం ఏముందనేది టిడిపి లీగల్ సెల్‌లోని కొందరి ప్రశ్న.
Read Also: Russian fighter jet crash: ట్రంప్‌ను కలవడానికి ముందు పుతిన్‌కి దెబ్బ.. Su-30SM ఫైటర్ జెట్ మిస్సింగ్
అదంతా ఒక ఎత్తయితే… వాస్తవం మాత్రం మరోలా ఉంది. దమ్మాలపాటి శ్రీనివాస్ టిడిపికి, చంద్రబాబు నాయుడుకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి. వృత్తిపరమైన అంశాల్లో ఒకటి రెండుసార్లు ఆయన గతంలో చంద్రబాబు చెప్పిన మాట వినకపోయినప్పటికీ… వ్యక్తిగతంగా మాత్రం సిఎంకి అత్యంత విశ్వసనీయమైన న్యాయవాది. అందుకే ఆయనకు రెండుసార్లు అంటే…. 2014లో, మళ్లీ 2024లో అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారు. అసలు దమ్మాలపాటి అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి గానీ, చంద్రబాబు నాయుడుకు గాని వ్యతిరేకంగా అలాంటి పనులు చేయబోరని, కేవలం అసూయతోనే టిడిపి లీగల్ సెల్లో కొందరు ఈ దుష్ప్రచారం మొదలుపెట్టారని చెబుతున్నారు పార్టీలో సీనియర్ నేతలు. దమ్మాలపాటి శ్రీనివాస్ కి రెండోసారి అడ్వకేట్ జనరల్ ఇచ్చినప్పుడు టిడిపిలో కొందరు న్యాయవాదులు, అలాగే లీగల్ సెల్ సభ్యులు బహిరంగంగానే వ్యతిరేకించారు. పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు తాము కూడా అండగా నిలబడ్డామని, దమ్మాలపాటికి మాత్రమే అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చి.. చంద్రబాబు తమను నిర్లక్ష్యం చేశారని కొందరు న్యాయవాదులు విమర్శలు చేశారు.
Read Also: Drumstick Tree: మునగ చెట్టు ఇంటి ఆవరణలో ఉండవచ్చా? లేదా? ఉంటే ఏమవుతుంది?
కానీ, న్యాయవాదిగా దమ్మాలపాటికున్న ప్రావీణ్యం, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఆయనకు అడ్వకేట్ జనరల్ ఇచ్చారని అంటారు. అప్పటినుంచి శ్రీనివాస్‌పై కత్తి కట్టిన ఒక వర్గం ఇప్పుడు పార్టీలో ఈ దుష్ప్రచారం లేవనెత్తినట్టు చెప్పుకుంటున్నారు. లిక్కర్ స్కామ్ లో నిందితులకు అనుకూలంగా దమ్మాలపాటి వ్యవహరిస్తున్నారని లేనిపోని కట్టు కథలను ప్రచారం చేయడం మొదలుపెట్టింది ఓ వర్గం. కేసుకు సంబంధించి దమ్మాలపాటి తీసుకున్న ఒకటి రెండు నిర్ణయాలపై యాగీ చేయడం మొదలుపెట్టారు లీగల్ టీంలో కొందరు సభ్యులు. కానీ పార్టీలో, ప్రభుత్వంలో సీనియర్లు దమ్మాలపాటి వైపు నిలబడడంతో ఈ వ్యతిరేకవర్గం దుష్ప్రచారం ఎక్కువ రోజులు నిలబడలేదన్నది టీడీపీ ఇన్నర్ వాయిస్.
