OTR: బిఆర్ఎస్ ఎమ్మెల్యే & కాంగ్రెస్ సీనియర్ నేత కలసి ఇసుక దందా..!!
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అడ్డగోలు ఇసుక దందా
- విపక్ష ఎమ్మెల్యే అలా ఎలా చేయగలుగుతున్నారన్న క్వశ్చన్
- నిత్యం వందల లారీలు, కోట్ల రూపాయలు
- ఛాన్స్ దొరికితే సీఎం, ప్రభుత్వం మీద విరుచుకుపడే ఎమ్మెల్యే
- అసెంబ్లీ ఎన్నికల టైంలో సదరు ఎమ్మెల్యే వీడియో సంచలనం
- మాకేం తెలియదు, మేమేం చూడలేదన్నట్టు అధికారులు
- బీఆర్‌ఎస్ హయాంలో మానేరు క్వారీల్లో వేలు పెట్టిన ఎమ్మెల్యే
- ఇంకా మొదలవని, సగంలో వదిలేసిన రెండు ర్యాంపుల్లో లేటెస్ట్ దందా
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అండదండలు?
- ఎమ్మెల్యే ఇచ్చిన ఆఫర్ కాంగ్రెస్ లీడర్‌కి తెగ నచ్చేసిందా?
- కాంగ్రెస్ నేత రాష్ట్ర స్థాయి పదవిలో ఉండటం కలిసొచ్చిందా?
- చర్యలు తీసుకోబోయిన కింది సిబ్బందికి కాంగ్రెస్ నేత తరపున ఫోన్స్?
- కాంగ్రెస్ నేత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మిలాఖత్‌పై ఎంక్వైరీ మొదలైందా?
OTR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరు అడ్డగోలుగా ఇసుక దందా చేస్తున్నారన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అదీ కూడా… ఏదో చాటుమాటుగానో… అడపాదడపానో కాకుండా…. రాజమార్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే అలా ఎలా చేయగలుగుతున్నారంటూ హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. విషయం తెలిసి అధికార కాంగ్రెస్ నాయకులే అవాక్కవుతున్నారట. నిత్యం వందలాది లారీల ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా రవాణా చేస్తూ… సదరు ఎమ్మెల్యే కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక్కడ ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే… ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సందు దొరికితే చాలు… రాష్ట్ర ప్రభుత్వం మీద, సీఎం రేవంత్‌రెడ్డి మీద విరుచుకుపడుతుంటారు. సంచలన వ్యాఖ్యలు, చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. బీఆర్ఎస్ వేదికల మీద కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అసలు లెక్కే లేనట్టు మాట్లాడుతూ సీఎంను పరుష పదజాలంతో విమర్శిస్తుంటారట.
READ ALSO: OTR: టీడీపీ, వైసీపీ రాజకీయాల మధ్య తిరుమల దర్శనాల వివాదం!
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
అవకాశం దొరికిన ప్రతీసారి హస్తం పార్టీని ఆడేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో సదరు ఎమ్మెల్యే చేసిన ఓ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అలాంటి నాయకుడు… కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత అడ్డగోలుగా ఇసుక దందా చేస్తున్నారంటే… ప్రభుత్వంలోని ఎవరి సపోర్ట్ లేకుండానే అదంతా జరుగుతోందా అన్న డౌట్స్ వస్తున్నాయట జిల్లాలో ఎక్కువ మందికి. సాధారణంగా ప్రతిపక్ష నాయకులు ఇలాంటి పనులు చేస్తుంటే… పవర్‌లో ఉన్న వాళ్ళు ఊరుకోరు. అధికారులు కూడా పవరాస్త్రాలకు పదును పెడుతుంటారు. కానీ… ఈ ఎమ్మెల్యే విషయంలో వాళ్ళు, వీళ్ళు అంతా… కలగలిసి మాకేం తెలియదు, మేమేం చూడలేదన్నట్టు మౌనం పాటించడం వెనక పెద్ద వ్యవహారాలే నడుస్తున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో జిల్లా పరిధిలోని మానేరు నదిపై ఉన్న అన్ని ఇసుక క్వారీల్లో వేలుపెట్టిన ఆ లీడర్ తాను ఎమ్మెల్యే అయిన కొత్తలో కాస్త తగ్గి… దందాకి కాస్త దూరం జరిగారట.
కానీ… ఈ మధ్య కాలంలో ఆయనకు ఓ కొత్త ఐడియా వచ్చి వెంటనే అమల్లో పెట్టేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా ప్రారంభం కాని ర్యాంప్‌తో పాటు… జిల్లాకు చెందని ఓ వ్యక్తి లీజుకు తీసుకుని కొంతకాలంగా తవ్వకాలు నిలిపివేసిన ర్యాంప్‌లో దర్జాగా దందా స్టార్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తన వ్యవహారాలకు అడ్డుపడకుండా…. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి సాయం కోసం సంప్రదించి సక్సెస్ అయినట్టు తెలిసింది. ఎమ్మెల్యే గారి ఆఫర్స్ సదరు కాంగ్రెస్ సీనియర్‌కు తెగ నచ్చేయడంతో లైన్ క్లియరైపోయిందట. ఆ సీనియర్ కూడా రాష్ట్ర స్థాయి పదవి ఉన్న నేత కావడంతో… అధికారులు సైతం కమ్ కమ్ వెల్కమ్ అన్నట్టు సమాచారం. ఇంకేముంది… ఆల్‌గుడ్ అనుకుంటూ ఇంతకు ముందు పక్కకు పెట్టిన ఎమ్మెల్యే అనుచరుల వాహనాలు ఇసుక లోడ్స్‌తో రయ్ రయ్‌మని దూసుకెళ్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదంతా పై స్థాయిలో జరగడంతో… విషయం తెలియని కొందరు కింది లెవల్ అధికారులు చర్యలకు సిద్ధం కావడంతో… సదరు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేత వైపు నుంచి ఫోన్‌కాల్స్ వెళ్ళాయన్న టాక్ ఉంది. ఈ విషయం అనోటా ఈనోటా జిల్లా నుంచి హైదరాబాద్‌కు చేరిందట. దాంతో ఎమ్మెల్యే ఇల్లీగల్ దందా వెనక ఆ కాంగ్రెస్ సీనియర్ పాత్ర ఎంత? పార్టీలకు అతీతంగా ఇద్దరూ నిజంగానే ఏక్ దూజే కే లియే అంటున్నారా లేక అధికారులతో దురుసుగా వ్యవహరిస్తాడనే పేరున్న ఎమ్మెల్యేనే గడుసుగా కాంగ్రెస్ నాయకుడి పేరు వాడుతున్నారా అన్న విషయంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. మొత్తానికి పైకి కారాలు మిరియాలు నూరుతూ కయ్యానికి కాలు దువ్వే నేతలు… కాసుల కక్కుర్తితో కలిసిపోయారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? ప్రచారం ఎంత అన్నది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్.
READ ALSO: Vishwak Sen: పొలిటీషియన్‌గా విశ్వక్‌సేన్.. ‘లెగసీ’ టీజర్ చూశారా!
తాజావార్తలు
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
-
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!